Investment Fraud in Hyderabad: హైదరాబాద్‌లో మరో భారీ మోసం బయటపడింది. అధిక వడ్డీల పేరులతో ఓ కంపెనీ బాధితులను భారీ సంఖ్యలతో డబ్బులు వసూల చేసి ముఖం చాటేసింది. వివరాల ప్రకారం.. డీకే జెడ్ టెక్నాలజీస్ అధిక వడ్డీల పేరుతో మోసం చేసిందని బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ ఎదుట బాధితులు ఆందోళన చేపట్టారు.
మాదాపూర్‌లోని డీకే జెడ్ టెక్నాలజీస్ సంస్థ అధిక వడ్డీలు చెల్లిస్తామని దాదాపు రూ. 700కోట్లు సేకరించినట్లు బాధితులు వాపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేసి 15 రోజులు గడిచిన పట్టించుకోవడం లేదని ఆందోళనలు చేపట్టారు.
తక్కువ పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని అమాయక ప్రజలను సంస్థ సభ్యులు నమ్మించారు. తర్వాత అధిక మొత్తంలో పెట్టుబడులు సేకరించారు. మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపు 18వేల మంది బాధితుల నుంచి పెట్టుబడి రూపంలో నగదు వసూలు చేశారు.
అయితే, ప్రజలను నమ్మించేందుకు మొదట లాభాలు చూయించనిట్లు కొంతమంది బాధితులు మీడియా ముందు వాపోయారు. తర్వాత మోసం పోయామని తెలుసుకొని వందలాది మంది బాధితులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్దకు చేరుకున్నారు. అనంతరం మీడియాకు తమ గోడు చెప్పుకున్నారు.
అనంతరం బషీరాబాగ్‌లోని సీసీఎస్ కార్యాలయానికి చేరుకున్నారు. మూడు రాష్ట్రాల్లో 55వేలమందికి పైగా బాధితున్నట్లు ఉన్నట్లు తెలుస్తోంది. బాధితుల నుంచి పెట్టుబడి రూపంలో వసూలు చేశారు. తర్వాత పెట్టుబడి చేసిన కొన్ని నెలలపాటు ఇన్వెస్టర్ల ఖాతాల్లో నగదు జమ అయింది.
ఇలా మొత్తం రూ.700కోట్ల వరకు వసూలు చేసిన దుండగులు చివరకు పరారయ్యారు. అంతేకాకుండా ఈ కంపెనీ సోషల్ మీడియా వేదికగా కొంతమందితో ప్రమోషన్లు కూడా చేయించింది. దీంతో ఆకర్షితులైన చాలామంది పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టారు. తర్వాత అందరికీ లాభాలు రావడంతో మరికొంతమంది పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబర్చారు. కొంతమంది ఏకంగా అప్పులు చేయడంతోపాటు బంగారం విక్రయించి మరి పెట్టుబడి పెట్టారని సమాచారం.
Also Read: డాక్టర్ ప్రైవేట్ భాగాలు కోసేసిన నర్సు.. ఏం చేశాడంటే..
ఇదిలా ఉండగా, సైబర్ నేరగాళ్లు ఏకంగా టాలీవుడ్ హీరో బిష్ణు అధికారిని మోసం చేశారు. యూట్యూబ్‌లో టాస్క్ పేరిట డబ్బులు వస్తాయని నమ్మించి రూ.45 లక్షలు స్కాం చేశారు. హోటల్స్‌కు రేటింగ్ ఇవ్వాలని లాస్క్ లు ఇచ్చేవారని, పెట్టుబడి పేరుతో మరికొంత టాస్క్ లు ఇచ్చి మోసానికి పాల్పడినట్లు సమాచారం.