BigTV English

Guntur News: రాష్ట్రంలో దారుణ ఘటన.. పిల్లలను చంపి ఉరేసుకున్న తండ్రి

Guntur News: రాష్ట్రంలో దారుణ ఘటన.. పిల్లలను చంపి ఉరేసుకున్న తండ్రి

Guntur News: ఏపీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా, బావాపేటలోని సాయిబాబా కాలనీలో ఈ రోజు జరిగిన ఈ దారుణ ఘటన స్థానికులు విషాదంలో ముంచెత్తింది. కుటుంబ కలహాల కారణంగా షేక్ యూసఫ్ షేక్ యూసఫ్ అనే వ్యక్తి ఇద్దరు పిల్లను హత్య చేసి.. ఆ తర్వాత తను ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


పోలీసులు వివరాల ప్రకారం.. షేక్ యూసఫ్ తన భార్య ఎవరితోనో ఫోన్ లో మాట్లాడడం గమనించాడు. ఇలా తరుచూ జరుగుతుండడంతో భార్యను మందలించాడు. ఇది కాస్త ఇద్దరి మధ్య తీవ్ర గొడవకు దారి తీసింది. దీంతో భార్య తన ఇద్దరి పిల్లలను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. అనంతరం షేక్ యూసఫ్ తన ఇద్దరి పిల్లల హుస్సేన్, ఆరిఫ్‌లను తీసుకుని గుంటూరులోని తన సోదరి ఇంటికి వెళ్ళాడు. అక్కడ తన సోదిరికి జరిగిన గొడవ అంతా వివరించాడు.

ALSO READ: Delhi News: దారుణం.. సొంత తల్లిపై అత్యాచారానికి పాల్పడిన కిరాతక కొడుకు.. చివరకు..?


చివరకు అక్కడ ఇంట్లో ఎవరూ లేని సమయానికి తన పిల్లలకు ఎలుకల మందు ఇచ్చి వారిని హత్య చేశాడు. ఆ తర్వాత తను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో.. స్థానిక పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు భార్య, భర్తకు మధ్య కుటుంబ మనస్పర్థలే ప్రధాన కారణంగా పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు.. సాయిబాబా కాలనీలోని నివాసితులు ఈ దుర్ఘటనతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కుటుంబ సమస్యలు, మనస్పర్థలు ఇంతటి దారుణ పరిణామాలకు దారితీస్తాయా అని స్థానిక ప్రజలు మాట్లాడుకుంటున్నారు.

ALSO READ: Weather News: వాయుగుండంగా అల్పపీడనం..! ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతవారణశాఖ

ఈ ఘటన ప్రస్తుతం పలు ప్రశ్నలకు దారితీస్తుంది. సమాజంలో రోజు రోజుకీ మానవ సంబంధాలకు మనుగడ లేకుండా పోతుంది. పరాయి వాడి కారణంగా సొంత పిల్లలను చంపుకునే వరకు వెళ్తోంది.  ప్రియుడి మోజులో పడి భర్తను చంపిన భార్య, ప్రియురాలితో భార్యను చంపిన భర్త, భార్య కారణంగా పిల్లలను చంపి భర్త మృతి ఇలాంటి ఘటనలు నిత్యం చోటుచేసుకుంటున్నాయి. ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా మనుషుల్లో మార్పు రావడం లేదు.

Related News

Kakinada Crime News: యువతి గొంతు కోసిన యువకుడు, నిన్ను వదిలి వెళ్లిపోతున్నా, కాకినాడ జిల్లాలో దారుణం

Khammam News: ఖమ్మంలో ఘోర ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొన్న వాహనం, షాకింగ్ దృశ్యాలు

Guntur Crime: లవర్‌తో కలిసి భర్తను చంపేసిన భార్య.. గుంటూరు జిల్లాలో దారుణ ఘటన

Vishal Brahma Arrest: డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ హీరో.. రూ.40 కోట్ల మత్తు పదార్థాలు స్వాధీనం

Tandoor Crime: రైలు ఎక్కుతూ జారిపడి ASI మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన

Raipur Crime News: టీనేజీ యువతి ఒత్తిడి.. మొండి కేసిన ప్రియుడు, గొంతు కోసి చంపేసింది

Chittoor News: ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ.. పేరెంట్స్ మందలింపు, యువతి సూసైడ్

Indrakeeladri Stampede: ఇంద్రకీలాద్రిపై భ‌క్తుల ర‌ద్దీ.. క్యూలైన్ల‌లో తోపులాట

Big Stories

×