Manchu Manoj: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో మనోజ్ మంచు(Manoj Manchu) ఒకరు. మోహన్ బాబు(Mohan Babu) వారసుడిగా బాల నటుడు గాని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మనోజ్ అనంతరం హీరోగా అద్భుతమైన సినిమాలలో నటించారు. ఇక తన వ్యక్తిగత కారణాలవల్ల కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈయన ఇటీవల భైరవం(Bhairavam) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. త్వరలోనే మిరాయ్(Mirai) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇలా కెరియర్ పరంగా బిజీ అవుతున్న మనోజ్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు..
ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు…
నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు అయితే తాజాగా శ్రీకృష్ణ జన్మాష్టమిని(Sri Krishna Janmashtami) పురస్కరించుకొని సెలబ్రిటీలందరూ కూడా ఈ వేడుకను ఘనంగా జరుపుకున్నారు. ఇక మనోజ్ ఇంట్లో ఈ వేడుక మరింత ఘనంగా జరిగిందని తెలుస్తోంది. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోని మనోజ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. ఇక ఈయన జన్మాష్టమి వేడుకలను తన స్నేహితులతో కలిసి జరుపుకున్నారు అలాగే తన స్నేహితుడి కవల పిల్లల పుట్టిన రోజును కూడా జరుపుకున్నారు. ఇలా కృష్ణుడి వేషంలో పిల్లలందరూ సందడి చేయడమే కాకుండా ఉట్టి కొడుతూ ఎంతో సంతోషంగా ఈ వేడుకను జరుపుకున్నారని తెలుస్తుంది.
సంతోషంలో మనోజ్ దంపతులు..
ఇక ఈ వీడియోని షేర్ చేసిన మంచు మనోజ్ “హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. మొత్తానికి ఈ వీడియోలో మనోజ్ మౌనిక దంపతులు చాలా సంతోషంగా కనిపించారు. చాలా రోజుల తర్వాత మనోజ్ ఇలా సంతోషంగా కనిపించడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మిమ్మల్ని ఇలా చూసి చాలా రోజులైంది భయ్యా అంటూ కొంతమంది కామెంట్లో చేస్తున్నారు. అలాగే ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి అన్నా అంటూ కూడా అభిమానులు ఈ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు.
?igsh=MXF3dDVtdGczMGtmMQ%3D%3D
ఇటీవల కాలంలో మనోజ్ తన కుటుంబ సభ్యులతో పెద్ద ఎత్తున గొడవ పడిన సంగతి తెలిసిందే. ఇలా తన అన్నయ్య తండ్రి పై ఈయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఇంటి ముందు కూర్చుని నుంచి గొడవ చేశారు. అలాగే ఈ గొడవల కారణంగా అటు మనోజ్ ఇటు విష్ణు ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన సంగతి తెలిసిందే. అయితే ఈ గొడవలు ఆస్తి కోసం డబ్బు కోసం కాదని కేవలం యూనివర్సిటీలో పిల్లలకు జరుగుతున్న అన్యాయం గురించి అంటూ పలు సందర్భాలలో మనోజ్ ఈ గొడవలు గురించి క్లారిటీ ఇచ్చారు కానీ విష్ణు, మోహన్ బాబు మాత్రమే ఎక్కడా కూడా గొడవలకు గల కారణాలు ఏంటి అనేది మాత్రం వెల్లడించలేదు. అయితే గత కొద్ది రోజులుగా విష్ణు మనోజ్ సైలెంట్ గా ఉన్న నేపథ్యంలో వీరి మధ్య గొడవలు పూర్తిగా సర్దుమనిగాయని అభిమానులు భావిస్తున్నారు. ఇక మనోజ్ నటించిన మిరాయ్ సినిమాపై కూడా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా సెప్టెంబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో మనోజ్ విలన్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.
Also Read: Actress Girija: గుర్తుపట్టలేని స్థితిలో నాగార్జున హీరోయిన్… ఇలా తయారయ్యింది ఏంటీ?