BigTV English

Most Dogs Country: ఎక్కువ కుక్కలు ఏ దేశంలో ఉన్నాయి? టాప్ 10 లిస్టులో ఇండియా ఉందా?

Most Dogs Country: ఎక్కువ కుక్కలు ఏ దేశంలో ఉన్నాయి? టాప్ 10 లిస్టులో ఇండియా ఉందా?

Dog Population by Country 2025: వీధి కుక్కల వ్యవహారంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చి తీర్పు తీవ్ర వివాదం అయ్యింది. ఢిల్లీలోని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని న్యాయస్థానం ఇచ్చిన తీర్పును పలు జంతు హక్కుల సంఘాలు తీవ్రంగా తప్పుబట్టాయి. కుక్కల పట్ల అమానవీయంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడుతున్నాయి ఇక దేశ వ్యాప్తంగా సుమారు 1.53 కోట్ల వీధి కుక్కలు ఉన్నాయి. ఇంతకీ ప్రపంచంలో అత్యధిక కుక్కలు ఉన్న దేశం ఏది? టాప్ 10 లిస్టులో ఇండియా ఉందా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..


ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కుక్కలు ఉన్న దేశాలు

1.అమెరికా: అమెరికాలో 75.8 మిలియన్ కుక్కలు ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిక కుక్కలు ఉన్న దేశాల్లో నెంబర్ వన్ గా ఉంది. డాగ్ పార్కులు, గ్రూమింగ్ సేవలు, కఠినమైన జంతు సంక్షేమ చట్టాలు ఈ దేశాల్లో ఉన్నాయి.


2.బ్రెజిల్: బ్రెజిల్ 35.7 మిలియన్ కుక్కలు ఉన్నాయి. దాదాపు సగం ఇళ్లలో ఒక్కో కుక్క ఉంటుంది. ప్రభుత్వం కుక్కలు  టీకాలు వేయడంతో పాటు వాటి భద్రతకు రక్షణ కల్పిస్తాయి.

3.చైనా: చైనాలో 27.4 మిలియన్ కుక్కలు ఉన్నాయి. కుక్కలను పెంచుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.

4.భారతదేశం: భారతదేశంలో 15.3 మిలియన్ల వీధి కుక్కలు ఉన్నాయి. వీటి సంఖ్యలను నియంత్రించడానికి, వాటి ద్వారా రేబిస్ వ్యాప్తి చెందకుండా 70% టీకాలు వేయాలని భావిస్తోంది.

5.రష్యా: రష్యాలో కూడా పెద్ద సంఖ్యలోనే కుక్కలు ఉన్నాయి. ఆదేశంలో దాదాపు 15 మిలియన్ కుక్కలు ఉన్నాయి. అక్కడ వీధి కుక్కల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.

6.జపాన్: జపాన్‌లో దాదాపు 12 మిలియన్ల కుక్కలు ఉన్నాయి. చాలా మంది పిల్లలను కనడానికి బదులుగా పెంపుడు జంతువులను దత్తత తీసుకుంటారు. అక్కడ కుక్కలను కుటుంబంగా పరిగణిస్తారు.

7.ఫిలిప్పీన్స్: ఈ దేశంలో 11.6 మిలియన్ కుక్కలను కలిగి ఉంది. అయితే,  ఫిలిప్పీన్స్ రేబిస్ సంబంధిత మరణాలను ఎదుర్కొంది. వీధి కుక్కల జనాభాను నియంత్రించడానికి ప్రభుత్వం టీకాలను వేయిస్తోంది.

8.అర్జెంటీనా: అర్జెంటీనాలో దాదాపు 9.2 మిలియన్ కుక్కలు ఉన్నాయి. అపార్ట్‌ మెంట్లలో కూడా కుక్కలను పెంచుకునే సంప్రదాయం పెరుగుతోంది. ప్రభుత్వం నేతృత్వంలో కుక్కలకు టీకాలు వేయడంతో పాటు స్టెరిలైజేషన్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

9.ఫ్రాన్స్: ఫ్రాన్స్ లో  7.4 మిలియన్ కుక్కలు ఉన్నాయి. ప్రతి కుక్కకు గుర్తింపు కోసం మైక్రోచిప్ ఉండాలి. ఈ దేశంలో  టీకా నియమాలు కఠినంగా ఉంటాయి. రేబిస్ కేసులు చాలా తక్కువగా ఉంటాయి.

10.రొమేనియా: రొమేనియాలో దాదాపు 4.1 మిలియన్ కుక్కలు ఉన్నాయి. 1980లలో చాలా మంది గ్రామాల నుంచి నగరాలకు వలస వెళ్లి పెంపుడు జంతువులను వదిలి వేశారు. ఆ తర్వాత  వీధి కుక్కల జనాభా పెరిగింది.

Read Also: గుడ్డుపై 150మంది స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలు.. ఈ వండర్ ఫోటోను ఇప్పుడే చూసేయండి బ్రో!

Related News

Comedy video: లిఫ్ట్ బయట ఈ పిల్లోడు చేసిన పని చూస్తే.. నవ్వు ఆపకోలేరు భయ్యా..!

Viral Video: గుడ్డుపై 150మంది స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలు.. ఈ వండర్ ఫోటోను ఇప్పుడే చూసేయండి బ్రో!

ఇది రియల్లీ మైండ్ బ్లోయింగ్ వీడియా.. తాళాన్ని క్షణాల్లో ఓపెన్ చేశాడు.. ఇక దొంగలకు తెలిస్తే..?

Drunken Trump: ఫుల్‌గా మందుకొట్టి.. పుతిన్ ముందుకు.. ట్రంప్ మామ దొరికిపోయాడు, ఎలా తడబడ్డాడో చూడండి

Mumbai Hotel: ముంబై హోటల్‌లో కప్పు టీ అక్షరాల రూ.1000.. ఈ ఎన్ఆర్ఐ రియాక్షన్ చూడండి, వీడియో వైరల్

Big Stories

×