BigTV English

OTT Movie : ఆ సౌండ్స్ వింటే ఈ దెయ్యానికి పూనకాలే… అమ్మాయి వెంటపడి అరాచకం… కల్లోనూ వెంటాడే హర్రర్ సీన్స్

OTT Movie : ఆ సౌండ్స్ వింటే ఈ దెయ్యానికి పూనకాలే… అమ్మాయి వెంటపడి అరాచకం… కల్లోనూ వెంటాడే హర్రర్ సీన్స్

OTT Movie : దెయ్యాల సినిమాలకు ఫ్యాన్స్ కూడా ఎక్కువే. ఈ సినిమాలను చాలా మంది ఒంటరిగా చూసే సాహసం చేయలేరు. అలా చుస్తే పార్ట్స్ ప్యాక్ అవుతుంటాయి. అందుకే ఎవరినైనా తోడు పెట్టుకుని చూస్తుంటారు. ఇక రాత్రి పూట ఈ సినిమాల జోలికి వెళ్లే సాహసం పెద్దగా చెయ్యరు. ఒకవేళ ఇలాంటి సినిమాలను రాత్రిపూట చుస్తే చలి, జ్వరం గ్యారెంటీ. ఇప్పుడు చెప్పుకోబోయే, సినిమా ఒక శపించబడిన రేడియో చుట్టూ తిరిగే భయంకరమైన స్టోరీ. ఈ రేడియోను ఆన్ చేస్తే ఇక అంతేసంగతులు. ఈ రచ్చ ఎలా ఉంటుందో తెలుసుకుందాం పదండి. ఈ సినిమా స్టోరీ ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే


మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘సౌండ్ ఆఫ్ సైలెన్స్’ (Sound of Silence) ఒక ఇటాలియన్ హారర్ సినిమా. దీనికి అలెస్సాండ్రో అంటోనాసి, డానియెల్ లస్కార్, స్టెఫానో మండలా అనే ముగ్గురు దర్శకులు పనిచేసారు. ఇందులో పెనెలోప్ సాంగియోర్గి (ఎమ్మా), రొక్కో మరజ్జిటా (సెబా), లూసియా కాపోరాసో (ఏంజెలికా), డానియెల్ డి మార్టినో (ఎట్టోర్) ప్రధాన పాత్రల్లో నటించారు. 2023 మార్చి 9న ఈ సినిమా విడుదలైంది. ప్రస్తుతం Fandango at Home, Tubi, Viki లలో అందుబాటులో ఉంది.


కథలోకి వెళ్తే

ఎమ్మా న్యూయార్క్‌లో గాయని కావాలనే కలలు కనే ఒక యువతి. తన తండ్రి ఎట్టోర్ ఒక యాక్సిడెంట్‌లో గాయపడి హాస్పిటల్‌లో ఉన్నాడని తెలిసి ఇటలీకి తిరిగి వస్తుంది. తన తండ్రి రికవరీలో ఉండగా, ఎమ్మా ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. ఈ సమయంలో ఇంట్లో ఒక పాత రేడియోని కనిపెడుతుంది. అది ఆన్ చేయగానే వింత శబ్దాలు, ఆత్మలు కనిపిస్తాయి. దీని గల కారణం ఏమిటో ఎమ్మా తెలుసుకోవాలనుకుంటుంది. ఈ క్రమంలో ఎమ్మా తన బాయ్‌ఫ్రెండ్ సెబా, స్నేహితురాలు అలీస్‌లతో ఈ రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తుంది. రేడియో ఆన్ చేసినప్పుడు మాత్రమే ఈ ఆత్మలు కనిపిస్తాయని, శబ్దం చేస్తే ప్రమాదం వస్తుందని ఎమ్మాకి తెలుస్తుంది. ఈ రేడియో ఒక కుటుంబ హత్య, డొమెస్టిక్ వయోలెన్స్‌తో ముడిపడి ఉందని, ఆ కుటుంబాన్ని క్రూరమైన వ్యక్తి చంపినాడని బయటపడుతుంది. ఎమ్మా తన తండ్రి యాక్సిడెంట్ కూడా ఈ రేడియో వల్లే జరిగిందని గుర్తిస్తుంది.

రేడియోని ధ్వంసం చేయడం లేదా ఇంటిని వదిలేయడం సాధ్యం కాదని తెలిసిన ఎమ్మా, ఆ ఆత్మలతో కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆమె రేడియో ఫ్రీక్వెన్సీతో ఆత్మలను అర్థం చేసుకుంటుంది. ఒక ఆత్మ ఆమె బాయ్‌ఫ్రెండ్‌ సెబాని ఆవహిస్తుంది. ఇప్పుడు పరిస్థితి మరింత భయంకరంగా మారుతుంది. ఒక రికార్డింగ్ స్టూడియోలో జరిగే క్లైమాక్స్‌లో, ఎమ్మా ఆత్మల గతాన్ని బయటపెడుతుంది. ఎమ్మా సౌండ్‌ని ఉపయోగించి ఆ ఆత్మను ఆపడానికి ఒక ప్లాన్ వేస్తుంది. కానీ సినిమా ఒక ట్విస్ట్‌తో ముగుస్తుంది. ఎమ్మా ఈ దెయ్యాన్ని నియంత్రిస్తుందా ? రేడియోలో దెయ్యాలు ఎందుకున్నాయి ? ఈ దెయ్యాల గతం ఏమిటి ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : హోటల్లో పని చేసే అమ్మాయిపై అరాచకం… వచ్చిన ప్రతి ఒక్కడూ అదే పని… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Related News

OTT Movie : పెళ్ళైన నెలకే భర్త మృతి… అర్ధరాత్రి అలాంటి అమ్మాయి ఇంటికి అనామకుడు… ఫీల్ గుడ్ తమిళ మూవీ

OTT Movie : కోర్టులో కచేరి… ఓటీటీలో ట్రెండ్ అవుతున్న కోర్టు రూమ్ డ్రామా… ఇంకా చూడలేదా?

OTT Movie : కళ్ళకు గంతలు… అతని కన్ను పడితే అంతే సంగతులు… క్రేజీ కొరియన్ క్రైమ్ డ్రామా

F1 OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన క్రేజీ రేసింగ్ మూవీ F1.. ఎప్పుడు?ఎక్కడంటే?

OTT Movie : ఇంటి ఓనర్లే ఈ కిల్లర్ టార్గెట్… వీడి చేతికి చిక్కారో నరకమే… క్రేజీ మలయాళ సైకో థ్రిల్లర్

Big Stories

×