E-Paper
Advertisement

OTT Movie : కోర్టులో కచేరి… ఓటీటీలో ట్రెండ్ అవుతున్న కోర్టు రూమ్ డ్రామా… ఇంకా చూడలేదా?

OTT Movie : కోర్టులో కచేరి… ఓటీటీలో ట్రెండ్ అవుతున్న కోర్టు రూమ్ డ్రామా… ఇంకా చూడలేదా?
Advertisement

OTT Movie : కోర్ట్ రూమ్ డ్రామా స్టోరీ లు ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. రీసెంట్ గా వచ్చిన ఇలాంటి సిరీస్ లు, సినిమాలు హిట్ టాక్ తో ప్రేక్షకులను అలరించాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ తండ్రి కొడుకుల మధ్య తిరుగుతుంది. సర్జన్‌పూర్ అనే పట్టణంలో ఈ లీగల్ డ్రామా స్టోరీ నడుస్తుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీని ఇష్టపడేవాళ్లకు ఇది బాగా నచ్చుతుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

సోనీ లివ్‌లో

Advertisement

‘కోర్ట్ కచేరి’ (Court Kacheri) హిందీ లీగల్ డ్రామా కామెడీ వెబ్ సిరీస్. రుచిర్ అరుణ్ దర్శకత్వంలో, పవన్ మల్హోత్రా (హరీష్ మాథుర్, ప్రఖ్యాత లాయర్), ఆశిష్ వర్మ (పరమ్ మాథుర్, అతని కొడుకు), పునీత్ బాత్రా (సూరజ్ బెరియా, హరీష్ అసిస్టెంట్) నటించారు. ఈ సిరీస్ ఐదు ఎపిసోడ్‌లతో సోనీ లివ్‌లో 2025 ఆగస్టు 13 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఒక్కో ఎపిసోడ్ సుమారు 30 నిమిషాల నిడివితో IMDbలో 7.5/10రేటింగ్ ను పొందింది.

కథలోకి వెళ్తే

Advertisement

సర్జన్‌పూర్ అనే చిన్న పట్టణంలోని జిల్లా కోర్టులో కథ మొదలవుతుంది. ఇక్కడ హరీష్ మాథుర్ అనే ప్రఖ్యాత లాయర్‌కి మంచి పేరు ఉంటుంది. అతని కొడుకు పరమ్ మాథుర్ లాయర్ కావాలని అస్సలు ఇష్టం లేకపోయినా, తండ్రి ఒత్తిడి వల్ల కోర్టులో ఇంటర్న్‌షిప్ చేస్తాడు. పరమ్‌కి హోటల్ మేనేజ్‌మెంట్ చదివి కెనడా లేదా దుబాయ్ వెళ్లాలని కల. కానీ తండ్రి నీడలో చిక్కుకుని, ఆ కలలను వదిలేయలేకపోతుంటాడు. అతను తన తండ్రిని “చెత్త తండ్రి” అని భావిస్తాడు. ఎందుకంటే హరీష్ అతని కోరికలను పట్టించుకోడు. ఇంతలో హరీష్ లాయల్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసే సూరజ్ బెరియా అనే వ్యక్తి , సొంతంగా కేసులు తీసుకోవాలని కలలు కంటాడు.

ఇక ఈ సిరీస్ మొదటి ఎపిసోడ్‌లో, ఒక డివోర్స్ కేసు వస్తుంది. ఒక భర్త 14 సంవత్సరాలుగా భార్యతో విడిపోయి ఉంటాడు. డివోర్స్ కోసం పిటిషన్ వేస్తాడు. హరీష్ ఈ కేసుని తీసుకుంటాడు. పరమ్‌ని సూరజ్‌కి అసిస్ట్ చేయమని చెప్తాడు. కానీ పరమ్‌కి తండ్రి న్యాయం కోసం కాకుండా పవర్ కోసం పనిచేస్తున్నాడని అనిపిస్తుంది. అందుకే రహస్యంగా ఎదురు పక్షానికి సహాయం చేస్తాడు. ఈ కేసులో ఒక మహిళ లాయర్ అనుషా కూడా ఉంటుంది, ఆమె హరీష్‌తో గట్టిగా పోటీ పడుతుంది. ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగుతున్నప్పుడు, పరమ్ ఒక ఫేక్ సర్టిఫికెట్ కేసులో చిక్కుకుంటాడు. పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ కోసం ఇబ్బంది పడతాడు. ఈ సమయంలో అతను ఒక ఎమోషనల్ మోనోలాగ్ ఇస్తాడు. తన తండ్రిని ఎందుకు ద్వేషిస్తాడో చెప్తాడు.

సూరజ్, పరమ్‌కి స్నేహితుడిగా సహాయం చేస్తాడు. కానీ అతనికి కూడా సొంత కేసులు తీసుకోవాలనే ఆశ ఉంటుంది. ఆతరువాత డివోర్స్ కేసులో ఒక ట్విస్ట్ వస్తుంది. తన తండ్రి నిజంగా న్యాయం కోసం పనిచేస్తున్నాడని పరమ్‌కి అర్థమవుతుంది. ఈ ఘటన తండ్రి-కొడుకు మధ్య అపార్థాలను తొలగిస్తుంది. క్లైమాక్స్‌లో పరమ్ తన తండ్రి గొప్పతనాన్ని గుర్తిస్తాడు. లాయర్‌గా కొనసాగాలా లేక తన కలలను అనుసరించాలా అనే డైలమాలో ఉంటాడు. చివరికి పరమ్ లాయర్ గా కొనసాగుతాడా ? క్లైమాక్స్‌ ట్విస్ట్ ఏమిటి ? ఈ విడాకుల కేసు ఏమవుతుంది ? అనే ప్రశ్నలకు సమాధానాలు కావాలనుకుంటే, ఈ లీగల్ డ్రామా సిరీస్ ను మిస్ కాకుండా చుడండి.

Read Also : తాగుబోతుకు గుడ్ డే… మైకంలోనే కేసును సాల్వ్ చేసే మతలబు… ఐఎండీబీలో రేటింగ్ 8 ఉన్న తమిళ మూవీ

Related News

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

Big Stories

Advertisement
×