Hyderabad crime: పాపం.. అభం శుభం తెలియని చిన్న పిల్లలను అతి కిరాతకంగా చంపుతున్నారు. ఈ మధ్య కాలంలో లైంగిక దాడులు ఎక్కువయ్యాయి. పోలీసులు ఎంతటి శిక్షలు విధిస్తున్న దాడులు మాత్రం ఆగడం లేదు.. మరీ దారుణంగా చిన్న పిల్లలని కూడా చూడటం లేదు. ఇదంత ఎందుకు చెబుతున్నానంటే.. ఐదేళ్ల బాలుడితో ఓ మృగాడు పైశాచిక ఆనందం కోసం దాడి చేశాడు. ఉప్పల్ పీఎస్ పరిధిలోని రామంతపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఈ నెల 12న మిస్ అయిన ఐదేళ్ల బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఈశ్వర్ పాండే, పులేశ్వరి పాండే దంపతులు రామంతపూర్‌లోని కేసీఆర్ నగర్‌లో నివాసం ఉంటూ.. స్థానిక టింబర్ డిపోలో పనిచేస్తున్నాడు. బాలుడు ఆడుకుంటు ఉండగా మిస్ అయ్యాడని సమాచారం తెలిపారు.
ఐదేళ్ల బాలుడిని గొంతునులిమి దారుణ హత్య
అయితే పోలీసులు సమీపంలోని సీసీ పుటేజీని పరిశీలించగా.. అదే టింబర్ డిపోలో పనిచేసే బీహార్‌కు చెందిన కమర్ అనే వ్యక్తి బాలుడిని ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. బాలుడిని కిడ్నాప్ చేసిన కమర్ ముళ్లపొదల్లో బాలుడిపై అత్యాచారం చేసి అనంతరం గొంతు నులిమి చంపేశాడు. నిందితుడు కమర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలుడి మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు.
Also Read: ఆపరేషన్ కరీంనగర్.. మేయర్ సీటు కోసం రేవంత్ నయా ప్లాన్!