Delhi News: సమాజంలో రోజు రోజుకీ మానవ సంబంధాలకు మనుగడ లేకుండా పోతుంది. వాయి, వరుసలు లేకుండా అత్యాచారాలు, ఆ పై హత్యల సంఘటనలు నిత్యం ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉన్నాయి. ఈ కామాంధుల రాజ్యంలో స్త్రీలు స్వేచ్ఛగా బతకలేకపోతున్నారు. సొంత కూతురిపై నాన్న అత్యాచారం, సొంత చెల్లితో అన్న అసభ్య ప్రవర్తన, ప్రియుడి మోజులో పడి భర్తను చంపిన భార్య, ప్రియురాలితో భార్యను చంపిన భర్త ఇలాంటి ఘటనలు నిత్యం చోటుచేసుకుంటున్నాయి. ఎన్ని చట్టాలు వచ్చినా ఇలాంటి దారుణ ఘటనలకు పులిస్టాప్ పడడం లేదు. ఎన్ని ఆవెర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించినా చాలా మంది కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా ఓ 65 ఏళ్ల మహిళ తన సొంత కొడుకు చేతిలో అత్యచారానికి గురైన ఘటన దేశ రాజధాని నగరం ఢిల్లీలో చోటుచేసుకుంది.
ఢిల్లీలోని హౌజ్ ఖాజీ ప్రాంతంలో ఒక 65 ఏళ్ల మహిళ తన కొడుకు చేతిలో రెండుసార్లు అత్యాచారానికి గురైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఓ మహిళ, తన తన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి భర్త, కొడుకు, చిన్న కూతురితో కలిసి హౌజ్ ఖాజీలో నివసిస్తున్నారు. వారి పెద్ద కూతురికి పెళ్లి కాగా.. సమీపంలో తన అత్తగారి వద్ద జీవనం కొనసాగిస్తోంది. అయితే.. జులై 17న బాధిత మహిళ, ఆమె భర్త, చిన్న కూతురు సౌదీ అరేబియాకు మతపరమైన యాత్ర కోసం వెళ్లారు.
వాళ్లు పర్యటనలో ఉన్న సమయంలో.. ఎనిమిది రోజుల తర్వాత నిందితుడు తన తండ్రికి పదేపదే కాల్ చేసి కుటుంబం అంతా ఢిల్లీకి తిరిగి రావాలని పట్టుబట్టాడు. దీంతో వారి కుటుంబం అంతా తిరిగి ఢిల్లీకి చేరుకుంది. చేరుకున్న తర్వాత తల్లితో అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. ఆగస్టు 14న నిందితుడు తన తల్లి నిద్రిస్తున్న సమయంలో గదిలోకి వెళ్లాడు. ఆమెను బురఖా తీయమని బలవంతం చేశాడు. గదిలో బంధించి, కొట్టి, చిత్రహిసంలు పెట్టాడు. చివరకు అత్యాచారం చేశాడు.
ALSO READ: Nellore News: ఆస్పత్రిలో ఖైదీ రాసలీలలు.. ఏకంగా హాస్పిటల్ బెడ్ పైనే.. ఏంటీ దారుణం?
అయితే ఆమె గతంలో పెట్టుకున్న అక్రమ సంబంధాలకు గానూ అత్యాచారానికి పాల్పడినట్టు సంచలన ఆరోపణలు చేశాడు. తన తల్లి గతంలో తన చిన్న చెల్లెలు పుట్టకముందు భర్త వృత్తి రీత్యా బయట ఉన్న సమయంలో.. ఇతర పురుషులతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నదని కొడుకు సంచలన ఆరోపణలు చేసేవాడు. తన తండ్రిని తల్లికి విడాకులు ఇవ్వమని సైతం తరుచూ అడిగేవాడు. అత్యాచారం జరిగిన తర్వాత మరుసటి రోజు బాధితురాలు తన బాధను చిన్న కూతురితో బోరున విలపిస్తూ చెప్పుకుంది. ఆమె సలహాతో తల్లి నేరుగా పోలీసులను ఆశ్రయించింది.
ALSO READ: Weather News: వాయుగుండంగా అల్పపీడనం..! ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతవారణశాఖ
ఢిల్లీ పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 64 అత్యాచారం కింద కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. ఈ ఘటన సమాజంలో మానవ సంబంధాలు, నైతిక విలువలపై తీవ్ర చర్చను దారి తీస్తోంది. అలాగే కుటుంబంలో హింస, అత్యాచారం వంటి సమస్యలపై అవగాహన పెంచే అవసరాన్ని నొక్కి చెబుతోంది.