Medak District Crime: సభ్య సమాజం అసహ్యించుకునే పని చేసింది ఓ కన్న కత్లి. అక్రమ సంబంధానికి అడ్డుగా వున్నాడనే కారణంతో కన్న కొడుకుని దారుణంగా హతమార్చింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణమైన ఘటన వెంకటాయపల్లిలో జరిగింది.
Also read: Lokesh Kanagaraj: కమల్ హాసన్ ఫ్యాన్ అయితే రజినీకాంత్ ని ఈ రేంజ్ లో మోసం చేయాలా?
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం వెంకటాయపల్లిలో తల్లి మహమ్మద్ రహేనా నివాసం ఉంటుంది. భర్త మృతి చెందడంతో 25 ఏళ్ల కొడుకు అమ్మద్ పాషతో ఉంటుంది. అయితే కొంతకాలంగా రహెనాకు మనోహరాబాద్ మండలం మొప్పడిరెడ్డి పల్లికి చెందిన కందల బిక్షపతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. తరుచూ వాళ్లిద్దరూ కలిసి ఉండటంతో ఈ వార్త కాస్త కొడుకు అమ్మద్ పాష వరకు చేరింది. దీంతో ఆగ్రహంతో తల్లిని నిలదీశాడు కొడుకు.
ఇది ఇప్పటితో ఆపివేయాలని, ఇలాగే కొనసాగితే సహించేది లేదని తల్లిని హెచ్చరించాడు. అయినా తల్లిలో మార్పు రాకపోవడంతో ఇంట్లో తల్లి, కొడుకు మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో తల్లి రహెనా, తన ప్రియుడు బిక్షపతితో ఈ విషయం చెప్పింది. దీంతో కొడుకు అడ్డు తొలగించుకోవాలని ఇద్దరు కలిసి మర్డర్ ప్లాన్ వేసింది తల్లి. ప్లాన్ ప్రకారం కొడుకును బైక్ పై ఎక్కించుకుని అబోతు పల్లి దగ్గరకి తీసుకెళ్లింది. ఇక అక్కడ ఇద్దరు కలిసి కొడుకు అమ్మద్‌కు బలవంతంగా మద్యం తాగించారు.
Also read:Nagarjuna : నేను యాక్టర్ అవుతా అంటే, మా నాన్న ఏడ్చారు
మద్యం తాగిన అమ్మద్ మత్తులోకి జారి పోవడంతో రహెనా, బిక్షపతి ఇద్దరూ కలిసి చున్నీతో ఉరేసి హత్య చేశారు. అమ్మద్ మృతదేహాన్ని హల్దివాగులో పడేసి అక్కడి నుంచి ఏమీ తెలియనట్లు ఇంటికి వెళ్లిపోయారు. గత ఏడాది సెప్టెంబర్ 28న తూప్రాన్ మున్సిపల్ పరిధిలో హల్దివాగులో ఘటన జరిగింది. అప్పట్లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఎవరికి అనుమానం రాకుండా కొడుకు కనిపించడం లేదని తల్లి ప్రచారం చేసింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు తల్లి.
దీంతో తల్లిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. తల్లిని పోలీస్టేషన్ రప్పించి విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. కొడుకు అమ్మద్ ను తల్లే హతమార్చిందని, బిక్షపత్తి సహకరించాడని వెల్లడించింది. కేసు నమోదు చేసిన పోలీసులు రహెనాను రిమాండ్ తలించారు.