Khazana Jewellers Robbery: హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన ఖజానా జ్యువెలరీ దోపిడీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈనెల 12న మంగళవారం ఉదయం 10.45 గంటలకు ముసుగులు ధరించి సుమారు నలుగురు వ్యక్తులు చెందానగర్ లోని ఖజానా జ్యువెలరీలోకి ప్రవేశించారు. తుపాకీలతో బెదిరించి కాల్పుల మోత మోగించారు. అక్కడున్న వారిని గన్‌తో బెదిరించి బంగారు ఆభరణాలను దొంగలించి పరారయ్యారు. దీనిపై పోలీసులకు సమాచారం అందడంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. దుండగులను ప్రతిక్షణం గమనిస్తూ పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా అలర్ట్ అయ్యారు. ఇద్దరిని అదుపులో తీసుకున్న పోలీసులు, మిగతా ఐదుగురి కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు.
Also Read : Sravanthi chokkarapu: కృష్ణాష్టమి స్పెషల్.. అదిరిపోయే లుక్కులో ఆకట్టుకున్న స్రవంతి!
ఈ కేసులో మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ మాట్లాడుతూ.. ఈ దోపిడిలో మొత్తం ఏడుగురు పాల్గొన్నారు. ఇందులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని తెలిపారు. ఈ ఏడుగురు బీహార్ కి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. వీరిపై బీహార్‌లో 4,5 కేసులు నమోదు అయ్యాయని, ఒక నిందితుడి పై 10 కేసులు ఉన్నాయన్నారు. వీరి వద్ద నుండి 900 గ్రాముల వెండి ఆభరణాలు సీజ్ చేసామని డీసీపీ అన్నారు. 10 కేజీల వెండి ఆభరణాలు దోపిడీ చేశారని, దోపిడీ చేసేందుకు 20 రోజుల క్రితం నగరానికి వచ్చారని స్పష్టం చేశారు. ఆశిష్ కుమార్ సింగ్, దీపక్ కుమార్ సాహలను పూణేలో అరెస్ట్ చేసామన్నారు. వాళ్లు వెళ్లిన డైరెక్షన్స్ అంచనా వేసుకుని.. వారిని పుణే దగ్గర అరెస్ట్ చేశాం. విచారణలో వారు మిగతావారి పేర్లు కూడా చెప్పారు. 24 గంటల్లోనేవారిని గుర్తించాం. అరెస్టు చెయడానికి 48 గంటలు పట్టిందని తెలిపారు.
Also Read :Trump – Putin: ట్రంప్ ఉండి ఉంటే.. ఉక్రెయిన్‌తో యుద్ధమే జరిగేది కాదు.. పుతిన్ కీలక వాఖ్యలు
బీహార్ నుండి వెపెన్స్ కొనుగోలు చేశారని, A1 మోటార్స్ నుండి సెకండ్ హ్యాండ్ బైక్స్ తీసుకున్నట్లు డీసీపీ తెలిపారు. వీరికి ఆశిష్, దీపక్‌లు ఈ ముఠాలకూ వసతి కల్పిచడమే కాకుండా.. రెక్కికి సహకరించారని అన్నారు. వీరందరూ దోపిడీలో కూడా పాల్గొన్నారని స్పష్టం చేశారు. మిగిలిన ఐదుగురు నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. వెంటనే వారిని పట్టుకుంటామన్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా జూవెలర్స్ షాప్స్ యజమానులకు పలు సూచనలు తెలిపారు. తెఫ్ట్ అలారం పెట్టుకోవాలన్నారు. బంగారం ఆభరణాలు ఉన్న షాపులకు తప్పకుండా పెద్ద సంఖ్యలో సెక్యూరిటీని పెదట్టుకోవాలన్నారు. నిబంధనల ప్రకారం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని జావెలర్స్ షాప్ యజమానులకు డీసీపీ సూచనలు జారీ చేశారు.
ఖజానా జ్యువెలర్స్ దోపిడీ కేసులో పురోగతి..
దోపిడీలో ఏడుగురు పాల్గొన్నారు: వినీత్ కుమార్, మాదాపూర్ డీసీపీ
ఇందులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించాము
ఈ ఏడుగురు బీహార్ కి చెందిన వ్యక్తులు
వీరిపై బీహార్ లో 4, 5 కేసులు నమోదు అయ్యాయి
ఒక నిందితుడి పై 10 కేసులు… https://t.co/ziKnPPOUbI pic.twitter.com/ukLWUcCePN
— BIG TV Breaking News (@bigtvtelugu) August 16, 2025