BigTV English

OTT Movie : పెళ్ళైన నెలకే భర్త మృతి… అర్ధరాత్రి అలాంటి అమ్మాయి ఇంటికి అనామకుడు… ఫీల్ గుడ్ తమిళ మూవీ

OTT Movie : పెళ్ళైన నెలకే భర్త మృతి… అర్ధరాత్రి అలాంటి అమ్మాయి ఇంటికి అనామకుడు… ఫీల్ గుడ్ తమిళ మూవీ

OTT Movie : ఫీల్ గుడ్ కంటెంట్ తో ఒక మంచి మెసేజ్ ఇచ్చే సినిమాలను ఎవరైనా మెచ్చుకోవాల్సిందే. ఈ
సినిమాలను ఎంటర్టైన్మెంట్ కోసం కాకుండా, సరైన మార్గంలో నడవడానికి ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాంటి సినిమాలు ఓటీటీలలో చాలానే ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఫీల్ గుడ్ సినిమా చెన్నైలో హిందూ-ముస్లిం అల్లర్ల నేపథ్యంలో జరుగుతుంది. ఒక రాత్రి ఒకే ఇంట్లో చిక్కుకున్న ఇద్దరు అపరిచితుల సంభాషణల చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా మతం, లింగ వివక్ష, సమాజం విధించే నియమాల గురించి చర్చిస్తూ, కొంత ఎమోషనల్, కొంత రొమాంటిక్ కెమిస్ట్రీతో నడుస్తుంది. ఇది ఒకే లొకేషన్‌లో జరిగే సింగిల్-నైట్ స్టోరీ. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …


కథలోకి వెళ్తే

చెన్నైలో హిందూ-ముస్లిం అల్లర్ల నేపథ్యంలో, 21 ఏళ్ల నజ్మా అనే ఒక ముస్లిం యువతి, తన భర్త అన్వర్ రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఇద్దా (ముస్లిం సాంప్రదాయంలో 4 నెలల ఒంటరిగా ఉండటం) పాటిస్తుంటుంది. నర్సింగ్ చదువుకున్న నజ్మా, కేవలం నెల క్రితం అరేంజ్డ్ మ్యారేజ్ ద్వారా అన్వర్‌ని పెళ్లి చేసుకుంది. వాళ్లు ఒకరినొకరు ఇష్టపడుతూ, హనీమూన్ ప్లాన్ చేస్తున్న సమయంలో అన్వర్ మరణిస్తాడు. ఇద్దా కాలంలో నజ్మా ఇంట్లో ఒంటరిగా ఉంటూ, ఎవరినీ కలవకూడదనే నిబంధనను పాటిస్తుంది. ఒక రాత్రి కర్ఫ్యూలో గాయపడిన సూర్య ఆమె ఇంటి తలుపు తట్టి సహాయం అడుగుతాడు. సూర్య ఒక హిందూ ఫ్యాక్షన్ గూండాగా పనిచేసే వ్యక్తి. అల్లర్లలో గాయపడి ఆమె ఇంటికి చేరుకుంటాడు. నజ్మా మొదట అతనికి సహాయం చేయడానికి ఆలోచిస్తుంది.


ఆ తరువాత తన నర్సింగ్ నైపుణ్యంతో అతని గాయానికి కట్టు కడుతుంది. కానీ తన ముఖాన్ని చూపించకుండా బుర్కా ధరిస్తూ ఉంటుంది. కర్ఫ్యూ వల్ల సూర్య రెండు రోజులు ఆమె ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. ఇద్దరూ మతం, సమాజం గురించి మాటల్లో పడతారు. ఈ సంభాషణల్లో నజ్మా తన ఇద్దా పాటించడం వెనక ఉన్న కారణాలను, సమాజం విధించిన ఆంక్షలను గురించి చెబుతుంది. అయితే ఆమె భర్తతో కేవలం ఒక వారం మాత్రమే ఉన్నందున దు:ఖం నటించడం కష్టమని ఒప్పుకుంటుంది. సూర్య కూడా తన జీవితంలోని బాధలను, సమాజం తనను ఎలా తీర్చిందో చెబుతాడు. అతను మతం వల్ల ఏ సమస్యా ఉండదని, దాన్ని అనుసరించే వ్యక్తుల వల్లే సమస్యలు వస్తాయని ఆమెతో వాదిస్తాడు.

నజ్మా, సూర్య వాదనల తరువాత తన ఆలోచనలను మార్చుకోవాలనుకుంటుంది. సూర్య ఆమె హ్యూమానిటీని చూసి, తన హిందూ ఫ్యాక్షన్ ఐడియాలజీని ప్రశ్నించుకుంటాడు. ఈ సంభాషణల మధ్య వాళ్లు ఒకరికొకరు ఆకర్షితులవుతారు. కానీ రొమాన్స్ కంటే ఎమోషనల్ కనెక్షన్ ఎక్కువగా ఉంటుంది. క్లైమాక్స్‌లో నజ్మా తన బుర్కాని తీసేసి, స్వేచ్ఛ వైపు ఒక అడుగు వేస్తుంది. సూర్య, నజ్మా హ్యూమానిటీని గౌరవిస్తూ, తన జీవితాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఈ ఆసక్తికరమైన స్టోరీని మీరుకూడా చూడాలనుకుంటే, ఈ రోజే ఓటీటీలో ఓ లుక్ వేయండి.

రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘బుర్కా’ (Burqa) ఒక తమిళ డ్రామా సినిమా. సర్జున్ కె.ఎమ్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో కలైయరసన్ (సూర్య), మిర్నా మీనన్ (నజ్మా), జి.ఎమ్. కుమార్ (నజ్మా తండ్రి), సూరియనారాయణన్ (అన్వర్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయిన తరువాత 2023 ఏప్రిల్ 7న ఆహా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. Airtel Xstream Play లో కూడా అందుబాటులో ఉంది. 82 నిమిషాల నిడివి ఇఉన్న ఈ సినిమా IMDbలో 6.0/10 రేటింగ్ పొందింది.

Read Also : పాక్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన భారత్… హిస్టరీలో మిస్టరీగా మిగిలిన రా ఆపరేషన్… స్పై థ్రిల్లర్ ప్రియులకు పండగే

Related News

OTT Movie : కోర్టులో కచేరి… ఓటీటీలో ట్రెండ్ అవుతున్న కోర్టు రూమ్ డ్రామా… ఇంకా చూడలేదా?

OTT Movie : ఆ సౌండ్స్ వింటే ఈ దెయ్యానికి పూనకాలే… అమ్మాయి వెంటపడి అరాచకం… కల్లోనూ వెంటాడే హర్రర్ సీన్స్

OTT Movie : కళ్ళకు గంతలు… అతని కన్ను పడితే అంతే సంగతులు… క్రేజీ కొరియన్ క్రైమ్ డ్రామా

F1 OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన క్రేజీ రేసింగ్ మూవీ F1.. ఎప్పుడు?ఎక్కడంటే?

OTT Movie : ఇంటి ఓనర్లే ఈ కిల్లర్ టార్గెట్… వీడి చేతికి చిక్కారో నరకమే… క్రేజీ మలయాళ సైకో థ్రిల్లర్

Big Stories

×