Comedy video: ఇటీవల సోషల్ మీడియా హవానే ఎక్కువగా నడుస్తోంది. సోషల్ మీడియాలో వివిధ ప్లాట్‌ఫామ్ లలో వందలాది వైరల్ వీడియోలు చూస్తున్నాం.. ముఖ్యం పాముల వీడియోలు, కుక్కలు, ఏనుగులు, కామెడీకి సంబంధించిన వీడియోలు ఎక్కువ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా ఇలాంటి వీడియోలను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వైరల్ వీడియోలకు సోషల్ మీడియాలో లక్షల వ్యూస్ వస్తున్నారు. అలాగే వేలల్లో లైకులు, కామెంట్లు చేస్తున్నారు. తాజాగో ఓ బాలుడు చేసిన హాస్యాస్పదమైన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బాలుడు లిఫ్ట్ ఎలివేటర్ వద్ద చేసిన చిలిపి పనిని నెటిజన్లను ఆకర్షిస్తోంది. అతను చేసిన చిలిపి పని నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ నవ్వకుండా ఉండలేరు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
— Ghar Ke Kalesh (@gharkekalesh) August 17, 2025
బాలుడు ముందుగా లిఫ్ట్ ఎలివేటర్ వద్ద నిలబడి ఉంటాడు. కొంత మంది లిఫ్ట్ లోనికి వెళ్తారు. లోపల లిఫ్ట్ డోర్స్ క్లోజ్ చేసే బటన్ కూడా నొక్కుతారు. అయితే.. ఎలివేటర్ తలుపులు మూసుకునే సమయంలో లిఫ్ట్ బయట సైడ్ బాలుడు బటన్‌ను నొక్కుతాడు. దీంతో లిఫ్ట్ డోర్స్ మళ్లీ ఓపెన్ అవుతాయి. ఆ తర్వాత.. అతను సమీపంలో దాక్కుని. ఎలివేటర్ నుంచి బయటకు వచ్చే వ్యక్తుల రియాక్షన్ ను చూస్తాడు. ఒక వ్యక్తి బయటకు వచ్చి, బాలుడిని చూసి తిరిగి నవ్వుకుంటూ ఎలివేటర్‌లోకి వెళ్లిపోతాడు. కానీ బాలుడు అంతటితో ఆగుతాడా..? అంటే.. అసలు ఊరుకోడు.. మళ్లీ బటన్‌ను నొక్కి మరోసారి లిఫ్ట్ డోర్స్ తెరిచేలా చేస్తాడు. ఈసారి మరొక వ్యక్తి బయటకు వచ్చినప్పుడు బాలుడు నవ్వుతూ పరిగెత్తుకుంటూ వెళ్లిపోతాడు.
ALSO READ: Guntur News: రాష్ట్రంలో దారుణ ఘటన.. పిల్లలను చంపి ఉరేసుకున్న తండ్రి
వీడియో హైలెట్ ఏంటి అంటే.. ఆ బాలుడు మరోసారి బటన్‌ను నొక్కినప్పుడు ఒక యువతి కోపంతో లిఫ్ట్ లోపలి నుంచి బయటకు వస్తుంది. దీంతో వీడియో అకస్మాత్తుగా ముగుస్తుంది. ఆ తర్వాత ఏమి జరిగిందో నెటిజన్లు ఊహించేలా చేస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియా వేదికలపై విపరీతంగా వైరల్ అయ్యింది. నవ్వులు, లైక్ లు, కామెంట్లు అనేక మీమ్స్‌కు దారితీసింది. చాలా మంది బాలుడి ధైర్యాన్ని ప్రశంసించగా, కొందరు ఇలాంటి చిలిపి పనులు చేయడం వల్ల కలిగే ప్రమాదాల గురించి మాట్లాడారు.
ALSO READ: Weather News: వాయుగుండంగా అల్పపీడనం..! ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతవారణశాఖ
ఈ వీడియో ఒక సాధారణ చిలిపి చేష్ట ఎలా ఊహించని రీతిలో ఆసక్తికరంగా మారుతుందో చూపించింది. ఇది సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ గా మారింది. పిల్లల అమాయకత్వం, చిలిపితనం కలగలిసిన సరదా క్షణాలను గుర్తు చేస్తుంది. ఈ వీడియో నెటిజన్లను అమితంగా ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో వినోదాత్మక చర్చలకు కారణమైంది. ఈ కామెడీ వీడియోను మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తున్నాయి. లక్షల కొద్ది లైక్, వేలల్లో కామెంట్లు చేస్తున్నారు. మరీ ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఈ వీడియోను ఓసారి చూసి నవ్వేయండి బ్రో..