Big Stories

JDU Leader Murder : బీహార్ లో జేడీయూ నేత హత్య.. రాజకీయ వైరమా ?

JDU Leader Saurabh Murder : రెండోదశ లోక్ సభ ఎన్నికలకు ముందు.. బీహార్ లో హింసాత్మక ఘటన వెలుగులోకి వచ్చింది. ఎన్నికలకు ముందు జేడీయూ నేత హత్యకు గురవ్వడం కలకలం రేపింది. బుధవారం (ఏప్రిల్ 24) జేడీయూ నేతపై పాట్నాలోని పున్ పున్ లో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో జేడీయూ యువనేత సౌరభ్ మృతి చెందగా.. మరో వ్యక్తి గాయపడ్డాడు. గాయపడిన సౌరభ్ స్నేహితుడు మున్ మున్ ను ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

సౌరభ్ హత్యతో.. జేడీయూ మద్దతుదారుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కోపోద్రిక్తులైన వారంతా.. వీరంగం సృష్టించారు. అర్థరాత్రి పాట్నా-గయ రహదారిని దిగ్బంధించారు. పోలీసుల జోక్యంతో వారు శాంతించారు. బుధవారం సాయంత్రం ఒక వివాహ వేడుకకు వెళ్లి వస్తున్న సౌరభ్ పై గుర్తుతెలియని వారు కాల్పులు జరిపారు. సౌరభ్ హత్య వెనుక రాజకీయ కుట్రకోణం ఉందా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పాటలీపుత్ర ఆర్జేడీ అభ్యర్థి, లాలూ కుమార్తె మిసాభారతి సౌరభ్ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు.

- Advertisement -

Also Read : కర్నాటకలో యువతి దారుణ హత్య.. లవ్ జిహాద్ కారణమా?

కాగా.. సౌరభ్ పై నలుగురు వ్యక్తులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. సౌరభ్ తలకు 2, అతని స్నేహితుడు మున్ మున్ కు మూడు బుల్లెట్లు తగిలాయని ఎస్పీ వెల్లడించారు. కేసు నమోదు చేసి.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. పాట్నాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మున్మున్ ఆరోగ్య పరిస్థితి విషంగా ఉన్నట్లు తెలుస్తోంది.

 

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News