Big Stories

Hubballi Girl Murder: కర్నాటకలో యువతి దారుణ హత్య.. లవ్ జిహాద్ కారణమా?

Hubballi Girl Murder: కర్ణాటకలో యువతి హత్య రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. బాధిత కుటుంబానికి మద్ధతుగా అనేక సంఘాల నేతలు, విద్యార్థులు నిరసనలు తెలుపుతున్నారు. హుబ్బళ్లి మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ కౌన్సిలర్ నిరంజన్ హిరేమత్ కూతురు నేహా హిరేమత్ దారుణ హత్యకు గురైంది. నేహా BVB కాలేజీలో ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. నేహాను ఏప్రిల్ 18న కాలేజీ క్యాంపస్ లో ఆమె సీనియర్ ఫయాజ్ ఖోండునాయక్ దారుణంగా కత్తితో పొడిచి చంపాడు.

- Advertisement -

కాంగ్రెస్ కార్పొరేటర్ కూతురు హత్యకు గురవడంతో రాష్ట్రంలో ఈ ఘటన సంచలనంగా మారింది.దీనిపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తుండగా..తామిద్దరం రిలేషన్‌లో ఉన్నామని నిందితుడు పోలీసులకు తెలిపాడు. యువతి తనకు దూరంగా ఉండటంతోనే హత్య చేశానని ఒప్పుకున్నాడు.

- Advertisement -

ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యక్తిగత కారణంతోనే హత్య జరిగినట్లు ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన వెనుక లవ్ జిహాద్ కోణం ఉందని ఓ కేంద్ర మంత్రి అన్నారు. మరోవైపు యువతి తండ్రి కూడా తన కూతురి హత్యకు లవ్ జిహాద్ కారణమని అన్నారు. నిందితుడు తన కూతురిని ట్రాప్ చేసేందుకు ప్రయత్నించడంతో పాటు లవ్ చేయాలని పలు మార్లు బెదిరించాడని నిరంజన్ తెలిపారు. వారి బెదిరింపులను పట్టించుకోకపోవడం వల్లే హత్య చేశారని ఆరోపించారు.

Also Read : బీజేపీ రెబల్ అభ్యర్థి షాకింగ్ కామెంట్స్..

ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే ముస్లింలు కూడా బాధిత కుటుంబానికి మద్దతుగా నిలుస్తున్నారు. నిందితుడు ఫయాజ్ ను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంట్లో భాగంగానే కర్ణాటకలో ముస్లింల యాజమాన్యంలో నడుస్తున్న అనేక దుకాణాలను మూసివేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ముస్లిం పురుషులు, మహిళలు పాల్గొంటున్నారు. బాధిత కుటుంబానికి బహిరంగంగా ముస్లింలు తమ మద్దతు తెలపడంతో ఈ అంశం ప్రస్తుతం సంచలనంగా మారింది.

బీజేపీ నేతలు సైతం అనేక చోట్ల బ్యానర్లు పట్టుకుని నిరసనలు తెలుపుతున్నారు. హత్యకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త నిరసనలో భాగంగా నగరంలో ప్రదర్శనలు నిర్వహిస్తుండడంతో భారీగా పోలీసులను మోహరించారు. మరో వైపు ఈ కేసును సీఐడీకి అప్పగిస్తున్నట్లు సీఎం సిద్ధ రామయ్య ప్రకటించారు

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News