E-Paper
Advertisement

Nagar Kurnool District: తీవ్ర విషాదం.. ఇద్దరు బిడ్డలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య..

Nagar Kurnool District: తీవ్ర విషాదం.. ఇద్దరు బిడ్డలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య..
Advertisement

Nagar Kurnool District: న్యూ ఇయర్ వేళ అందరూ సంబరాల్లో మునిగిపోతుంటే, నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని తిలక్ నగర్ కాలనీలో మాత్రం తీవ్ర విషాదం అలుముకుంది. భర్త మరణాన్ని తట్టుకోలేక భీమశెట్టి ప్రసన్న (35) అనే మహిళ తన ఇద్దరు పిల్లలకు అన్నంలో విషం కలిపి ఇచ్చి, తాను కూడా తిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ హృదయవిదారక ఘటనలో తల్లి ప్రసన్నతో పాటు ఎనిమిదో తరగతి చదువుతున్న కుమార్తె మేఘన అక్కడికక్కడే మృతి చెందగా, పదో తరగతి చదువుతున్న కుమారుడు అశ్వితరామ్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.

అయితే సుమారు రెండు నెలల క్రితం ప్రసన్న భర్త అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. అప్పటి నుంచి ప్రసన్న తీవ్ర మనస్తాపానికి గురై, ఎవరితోనూ సరిగ్గా మాట్లాడకుండా ఒంటరిగా ఉంటోంది. చేతికి అందొచ్చిన బిడ్డలు ఉన్నప్పటికీ, భర్త లేని జీవితం తనకు భారంగా అనిపించిందని, ఆయన లేని లోకంలో తాను ఉండలేననే ఆవేదనతోనే ఆమె ఈ దారుణమైన నిర్ణయం తీసుకున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు.

Advertisement

సంఘటన జరిగిన సమయంలో పిల్లలు ఇద్దరూ స్థానిక కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో చదువుకుంటున్నారు. నూతన సంవత్సర వేడుకల రోజునే ఈ ఘాతుకం జరగడం అందరినీ కలిచివేసింది. అశ్వితరామ్ పరిస్థితిని గమనించిన ఇరుగుపొరుగు వారు వెంటనే స్పందించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తల్లి, సోదరిని కోల్పోయి అనాథగా మిగిలిన ఆ బాలుడి పరిస్థితి చూసి స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Also Read: రెండు రైలు బోగీల మధ్య పడుకొని.. మంచిర్యాలలో షాకింగ్ ఘటన

Advertisement

సమాచారం అందుకున్న కల్వకుర్తి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రాథమిక విచారణ అనంతరం కేసు నమోదు చేసి, ఆత్మహత్యకు గల పూర్తి కారణాలను విశ్లేషిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఏవైనా ఉన్నాయా లేక కేవలం మానసిక ఒత్తిడి వల్లే ఇలా జరిగిందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో తిలక్ నగర్ ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×