Srikakulam: తీవ్ర విషాదం.. భార్య వేరే వ్యక్తితో తిరుగుతుందని కుమార్తెకు విషమిచ్చి, తానూ తాగి ఆత్మహత్య చేసుకున్న ఓ భర్త.. అయితే తాను చనిపోతే కూతురు ఆలనాపాలనా ఎవరు చూసుకుంటారో అని ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం సంచాం గ్రామానికి చెందిన దుప్పాడ సంతోష్ (35)కు ఇద్దరు భార్యలు ఉన్నారు. రెండో భార్య స్వాతిని ప్రేమ వివాహం చేసుకోగా.. విశాఖలో వేర్వేరు ఇళ్లల్లో ఇద్దరు భార్యలతో నివసిస్తున్నాడు. అయితే దసరా సెలవుల నేపథ్యంలో పెద్దపాడు గురుకుల పాఠశాలలో చదువుతున్న కుమార్తె హైమా(11)ను తీసుకురావడానికి వెళ్లి, ఉదయం నుండి రాత్రి వరకు వేరే వ్యక్తితో తన భార్య స్వాతి కలిసి తిరిగుతుందని తెలుసుకున్న సంతోష్.. స్వాతి ఇంటికి వచ్చాక ఉదయం వెళ్లి రాత్రి వరకు ఏం చేశావంటూ భార్యను సంతోష్ అడగడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం ఏర్పడింది. దీంతో మనస్తాపానికి గురై, కూతురుని బయటకు తీసుకెళ్లి విషం తాగించి, తానూ తాగాడు.. అక్కడి స్థానికులు చూసి సర్వజన ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ తండ్రి, కూతురు మృతి చెందారు.
పూర్తి వివరాలు..
దుప్పాడ సంతోష్ ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం సంచాం గ్రామానికి చెందిన సాధారణ కుటుంబ సభ్యుడు. అతడికి ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్య పేరు పరిచయం లేదు.. కానీ రెండో భార్య స్వాతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. స్వాతితో సంతోష్‌కు హైమా అనే కుమార్తె పుట్టింది. విశాఖపట్నంలో వారు వేర్వేరు ఇళ్లల్లో నివసిస్తున్నారు. సంతోష్ తన ఇద్దరు భార్యలను కలిగి ఉంచుకుని, కుటుంబాన్ని నడుపుతూ ఉన్నాడు. హైమా పెద్దపాడు గురుకుల పాఠశాలలో 6వ తరగతిలో చదువుతోంది. ఆమె తండ్రి-తల్లి మధ్య ఇటీవల మొదలైన అనుమానాలు కుటుంబంలో తీవ్ర పరిణామాలకు దారితీసింది. స్వాతి రాంబాబు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు సంతోష్‌కు తెలిసి, అతడు మానసికంగా దెబ్బతిన్నాడు.
భార్యను వేరే వ్యక్తితో తిరుగుతోందని మనస్తాపం చెందిన సంతోష్..
అయితే దసరా సెలవుల నేపథ్యంలో సంతోష్ తన కుమార్తె హైమాను పాఠశాల నుంచి తీసుకురావాలని భార్య స్వాతిని ఉదయం పంపాడు. స్వాతి పెద్దపాడు వెళ్లిన తర్వాత, రాంబాబు అనే వ్యక్తితో కలిసి రోజంతా తిరిగి, రాత్రి మూడు గంటల సమయంలో మాత్రమే ఇంటికి చేరుకుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న సంతోష్, భార్యను నిలదీసి “ఉదయం నుంచి రాత్రి వరకు ఏం చేశావు?” అని ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మనస్తాపానికి గురైన సంతోష్, స్వాతి, హైమాను జీరుపాలెంలోని తన అమ్మవాళ్ల ఇంటికి పంపేశాడు. కానీ, తన కుమార్తె భవిష్యత్తు గురించి ఆందోళన చెందిన సంతోష్, మళ్లీ హైమాను తీసుకుని సంచాం గ్రామానికి తిరిగి వచ్చాడు.
కుమార్తెకు విషమిచ్చి ఆత్మహత్య చేసుకున్న సంతోష్
బుధవారం మధ్యాహ్నం సంతోష్ తీవ్ర మానసిక ఒత్తిడికి లొంగిపోయాడు. తాను చనిపోతే కుమార్తె ఎవరు చూసుకుంటారని భావించి, ఆమెను కూడా తీసుకెళ్లాలని కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ముందుగా మొబైల్‌లో సెల్ఫీ వీడియో రికార్డ్ చేసుకుని, తన భార్య స్వాతి, ఆమె సహచరుడు రాంబాబును నిందిస్తూ మాట్లాడాడు. “భార్య నన్ను మోసం చేసింది, ఈ పరిస్థితిలో జీవించలేను” అని చెప్పుకున్నాడు. తర్వాత, పురుగుల మందు కొని, “నాన్న ఇచ్చాడు” అని నమ్మిన హైమాకు తాగించాడు. తానూ దాన్ని తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వీడియోను కుటుంబ సభ్యులు చూసి, వెంటనే వారిని శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలోనే సంతోష్ మృతి చెందాడు, చికిత్స పొందుతూ గురువారం హైమా కూడా కన్నుమూసింది.
Also Read: ముంచుకోస్తున్న ముప్పు.. మరో రెండు రోజులు భారీ వర్షాలు..
ఒకరి పాపం.. కుటుంబానికి శాపం..
ఈ దారుణ సంఘటన తెలిసిన వెంటనే స్వాతి, రాంబాబు పరార్‌లోకి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు, బంధువులు హైమా మరణంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “కుమార్తె ఏమీ పాపం చేయలేదు, ఆమె భవిష్యత్తు ఉండేది. ఇది అపరిమిత విషాదం” అంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. అంతేకాకుండా సంతోష్ తీసుకున్న నిర్ణయం వల్ల ఇటు హైమా చనిపోయింది. అలాగే అతని మొదటి భార్య తన పిల్లలు జీవితం కూడా అందకారంలో పడిపోయింది. ఒకరి కోసం వీరందరి జీవితం బలయైపోయిందంటూ గ్రామంలోని ప్రజలు విమర్శిస్తున్నారు. ఈ ఘటనపై రణస్థలం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న స్వాతిని, రాంబాబును పట్టుకుంటాం అని పోలీసులు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో విషాదం..
కుమార్తెకు విషమిచ్చి ఆత్మహత్య చేసుకున్న సంతోష్ అనే వ్యక్తి
తన భార్య వేరే వ్యక్తితో తిరుగుతోందని మనస్తాపం చెంది సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్య
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తండ్రి, కూతురు మృతి
ఇద్దరు భార్యలతో ఒకే ఇంట్లో కాపురం చేస్తున్న… pic.twitter.com/DBqBzGFBnP
— BIG TV Breaking News (@bigtvtelugu) September 26, 2025