War 2 First Review :ప్రముఖ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ (Ayan Mukherjee) దర్శకత్వంలో యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా (Adithya chopra) నిర్మిస్తున్న భారీ బడ్జెట్ మూవీ వార్ 2 (War 2).. వార్ (War) చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ(Kiara advani) హీరోయిన్గా నటిస్తున్నారు. అంతేకాదు టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ తొలిసారి ఈ సినిమా ద్వారా హిందీ సినీరంగ ప్రవేశం చేస్తున్నారు.. అంతేకాదు ఇందులో విలన్ గా నటిస్తూ ఉండడంతో అంచనాలు పీక్స్ కి చేరుకున్నాయి. ప్రస్తుతం ఆగస్టు 14వ తేదీన హిందీతో పాటు తెలుగు, తమిళ్ భాషలలో ఈ సినిమా విడుదల కాబోతోంది.
వార్ 2 రూమర్స్ కి గట్టి కౌంటర్..
సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. అటు రన్ టైం కూడా లాక్ చేసుకున్న విషయం తెలిసిందే. హిందీలో రెండు నిమిషాల నిడివి తెలుగు , తమిళ్ వెర్షన్ తో పోల్చుకుంటే ఎక్కువ అని కూడా మేకర్స్ స్పష్టం చేశారు . అటు తెలుగు వెర్షన్ , హిందీ వెర్షన్ రెండు వెర్షన్లలో ఈ సినిమాను డిజైన్ చేసినట్లు కూడా స్పష్టం చేశారు.. ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఇన్ని రోజులు ఎన్టీఆర్ ను ఈ సినిమాలో తొక్కేస్తున్నారు అని కామెంట్లు చేసిన వారందరికీ ఇది గట్టి ఝలక్ కలిగించే అంశం అని చెప్పవచ్చు.
వార్ 2 ఫస్ట్ రివ్యూ..
ఇక ఈ సినిమా ఫస్ట్ రివ్యూ విషయానికి వస్తే.. ఈ సినిమా థియేటర్లలో ప్రారంభమైన 20 నిమిషాలలోపే ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుందట. ప్రీ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అదిరిపోయిందని, ఫస్ట్ హాఫ్ అంత ఎన్టీఆర్ డామినేషన్ ఉంటుందని సమాచారం. దీనికి తోడు ఫ్యాన్స్ కి సాటిస్ఫైయింగ్ క్లైమాక్స్ అని, మొత్తానికైతే ఇక్కడ హృతిక్ కంటే ఎన్టీఆర్ డామినేషన్ ఎక్కువగా ఉండనున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఇప్పుడు ఈ ఫస్ట్ రివ్యూ ఇటు సౌత్ఆడియన్స్ లో కూడా అంచనాలు పెంచేసింది. మరి కూలీకి పోటీగా వస్తున్న ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
వార్ 2 సినిమా విశేషాలు..
వార్ 2 సినిమా విషయానికి వస్తే.. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలు, పోస్టర్, ట్రైలర్ కూడా బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా “ఊపిరి ఊయలగా” అంటూ సాగే పాట యూత్ ను విపరీతంగా ఆకర్షించింది.. ఈ సినిమా నుండి కియారా అద్వానీకి సంబంధించిన బికినీ షాట్ డిలీట్ చేశారు అంటూ వార్తలు వచ్చినా.. ఇప్పుడు ఫస్ట్ రివ్యూ ఇచ్చిన హైప్ తో ఆ వార్తలు కొట్టుకుపోయాయని కూడా కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.. మొత్తానికి అయితే అటు ఎన్టీఆర్ ఇటు హృతిక్ రోషన్ ఇద్దరు ఎవరికివారు పోటీ పడుతూ నటిస్తున్న ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
also read:Coolie Shruti Haasan : కూలీ పాత్రపై ఫస్ట్ టైం శృతి కామెంట్… నా నిజజీవితానికి పూర్తి విరుద్దంగా!