E-Paper
Advertisement

త్రిసూర్ బాణసంచా గిడ్డండిలో భారీ పేలుడు.. ఆరుగురు మృతి, 40 మంది పరిస్థితి విషమం

త్రిసూర్ బాణసంచా గిడ్డండిలో భారీ పేలుడు.. ఆరుగురు మృతి, 40 మంది పరిస్థితి విషమం
Advertisement

Kerala: కేరళలోని త్రిసూర్ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. స్థానిక ఒక బాణసంచా తయారీ కేంద్రం (గిడ్డంగి)లో సంభవించిన భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాద ధాటికి మరో 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించగా, వారిలో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఈ ఘోర ప్రమాదంపై కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అధికారులను ఆదేశించడంతో పాటు, ఘటనా స్థలానికి అదనపు అంబులెన్సులను పంపాలని సూచించారు. పేలుడు దాటికి గిడ్డంగి పరిసర ప్రాంతాలు చిందరవందరగా మారాయి. అగ్నిమాపక సిబ్బంది మరియు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తూ, శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Also Read: పసుపు మంగళకరమే.. కానీ ఆ రైతులకు మాత్రం కన్నీటి శాపం.. ఎందుకో తెలుసా?

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×