E-Paper
Advertisement

Garuda Purana Part 05: నరకలోయ ప్రయాణంలో ఆత్మ చేరుకునే ఐదవ పట్టణం శైలాగమం – ఆత్మకు అసలైన నరకం ఇక్కడే కనిపిస్తుందట

Garuda Purana Part 05: నరకలోయ ప్రయాణంలో ఆత్మ చేరుకునే ఐదవ పట్టణం శైలాగమం – ఆత్మకు అసలైన నరకం ఇక్కడే కనిపిస్తుందట
Advertisement

Garuda Purana Part 05: నరకలోయ ప్రయాణంలో ఆత్మ చేరుకునే ఐదవ పట్టణం శైలాగమ. ఇక్కడి నుంచే ఆత్మకు అసలైన నరకం అంటే ఎలా ఉంటుందో తెలుస్తుందట. ఆకుపచ్చని ఆకులే కత్తుల్లా మారి జీవుడి యాతనా శరీరాన్ని కోస్తుంటాయట. ఈ పట్టణానికి వెళ్లే దారిలో పాపాత్ములు అనుభవించే కష్టాలు వర్ణాణాతీతమట. అయితే బతికి ఉన్నప్పుడు పుణ్యాలు చేసిన వ్యక్తుల ఆత్మలకు మాత్రం ఈ దారులన్నీ పూలదారుల్లా మారిపోతాయట. వారికి ఎలాంటి బాధలు లేకుండా ప్రయాణం సాగుతుందట.

గరుడ పురాణం  ప్రకారం, జీవుడు మరణించిన తర్వాత యమలోకానికి చేసే ప్రయాణం అత్యంత కఠినంగా ఉంటుందట. పాపాత్ములైన వారు వెళ్లే మార్గంలో శైలాగమం (పర్వత ప్రాంతం) ఒక ముఖ్యమైన ఘట్టమని ఇందులో ఎదురయ్యే కష్టాలు తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుందని పండితులు సూచిస్తున్నారు.

Advertisement

శైలాగమం ఎలా చేరుకోవాలి: వైతరణి నదిని దాటిన తర్వాత, యమభటులు పాపిని దారుణంగా హింసిస్తూ ముందుకు తీసుకువెళ్తారట. ఈ క్రమంలో జీవుడు శైలాగమం అనే ప్రాంతానికి చేరుకుంటాడట. యమలోక మార్గంలో ఇది ఒక ఎత్తైన, నిటారుగా ఉండే పర్వత ప్రాంతం. ఇక్కడ దారి ఉండదు, అంతా రాళ్లతో నిండి ఉంటుందట. జీవుడు నడవలేకపోయినా, యమభటులు పాశాలతో లాగుతూ, ముళ్ళ కర్రలతో కొడుతూ ఈ పర్వతాల మీదుగా లాక్కెళ్తారట.

శైలాగమంలో పడే శిక్షలు: శైలాగమం అంటేనే రాళ్లు మరియు పర్వతాల సమూహం. ఇక్కడ పాపాత్ములు అనుభవించే బాధలు వర్ణనాతీతమట. ఈ పర్వత ప్రాంతంలో సూర్యుడు పన్నెండు మంది సూర్యుల తేజస్సుతో (ద్వాదశాదిత్యులు) ప్రకాశిస్తూ ఉంటాడట. ఆ వేడికి జీవుడి చర్మం మాడిపోతుందట. కొన్ని సందర్భాల్లో శైలాగమం సమీపంలోనే ‘అసిపత్ర వనం’ ఉంటుందట. ఇక్కడ చెట్ల ఆకులు కత్తులలాగా పదునుగా ఉంటాయట. గాలి వీచినప్పుడు ఆ ఆకులు జీవుడి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోస్తాయట. ఇక పర్వత శిఖరాల నుండి నిప్పులు కక్కుతున్న రాళ్లు జీవుడిపై పడతాయట. ఈ పర్వతం మీద అడుగు వేయడమే ఒక నరకం. ప్రతి అడుగులోనూ విషపూరితమైన ముళ్ళు, పదునైన రాళ్లు గుచ్చుకుంటూ ఉంటాయట. కాళ్ళు చీరుకుపోయి రక్తం కారుతున్నా ఆపకుండా పరిగెత్తాల్సి వస్తుందట. నీరు దొరకని ఆ ప్రాంతంలో భయంకరమైన వేడి గాలి వీస్తుందట. దాహంతో జీవుడు అలమటిస్తున్నా యమభటులు కనికరించరట.

Advertisement

ఇలాంటి శిక్షలు వేయడంలో ఉన్న ఉద్దేశం: పురాణాల ప్రకారం, భూలోకంలో ఉన్నప్పుడు దానధర్మాలు చేయని వారు, ఇతరులను హింసించిన వారు, మరియు అధర్మ మార్గంలో నడిచిన వారు మాత్రమే ఇటువంటి మార్గంలో ప్రయాణించాల్సి వస్తుందట. పుణ్యాత్ములకు ఈ మార్గం చల్లని నీడలా, పూలబాటలా కనిపిస్తుందని గరుడపురాణంలో ఉందట.

NOTE: ఇక ఆత్మ తన యమలోక ప్రయాణంలో ఆరవ పట్టణమైన క్రౌంచపురానికి ఎలా చేరుకుంటుంది. ఎన్ని కష్టాలు, బాధలు అనుభవిస్తుంది. అక్కడ ఆత్మకు విధించే భయంకరమైన శిక్షలు ఏంటి..? అనే విషయాలు రేపటి కథనంలో తెలుసుకుందాం.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: ఆత్మ చేరుకునే నాలుగో పట్టణం గంధర్వనగరం – మానసిక వేదన, తీవ్రమైన ఆకలి

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×