E-Paper
Advertisement

అన్నదాత ఆక్రందన.. “బాంచన్ నీ కాళ్లు మొక్కుతా.. మా పంట కొనండి సారూ!”

అన్నదాత ఆక్రందన.. “బాంచన్ నీ కాళ్లు మొక్కుతా.. మా పంట కొనండి సారూ!”
Advertisement

Farmers Distress: తెలంగాణలోని సాగు క్షేత్రాల్లో అన్నదాతల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. ఆకాశం వైపు చూసి వర్షం కోసం ఎదురుచూడటం ఒక ఎత్తైతే, పండించిన పంటను అమ్ముకోవడానికి అధికారుల కాళ్లు మొక్కాల్సి రావడం మరో ఎత్తు. ఇటీవల జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో చోటుచేసుకున్న హృదయవిదారక సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి.

జగిత్యాలలో ఆగని మక్కల గోస
జగిత్యాల జిల్లాలో మొక్కజొన్న రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. మార్కెట్ యార్డుకు మక్కలు తీసుకొచ్చి 20 రోజులు గడుస్తున్నా, కొనుగోలు ప్రక్రియ (కాంటా) ముందుకు సాగడం లేదని రైతులు రోడ్డెక్కారు. తమ నిరసనను అడ్డుకోవడానికి వచ్చిన పోలీసులను చూసి ఆవేదన తట్టుకోలేక, ఒక రైతు ఏకంగా సీఐ కాళ్లు మొక్కి తన గోడు వెళ్లబోసుకున్నాడు. “సారూ.. ఇరవై రోజుల నుంచి తిండి తిప్పలు మానేసి ఇక్కడే పడి ఉన్నాం.. అడిగితే ఎవరూ సమాధానం చెప్పడం లేదు.. దండం పెడతాం మా పంటను కొనండి” అంటూ ఆయన వేడుకున్న తీరు అక్కడున్న వారిని కలచివేసింది.

Advertisement

అమ్ముడుపోని బస్తాలు.. ఎడతెగని నిరీక్షణ
నిజానికి కొనుగోలు కేంద్రాల్లో కొన్నిచోట్ల కాంటా వేసినా, ఆ బస్తాలను గోదాములకు తరలించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో బస్తాలు ఎండకు ఎండి, వానకు తడిసి పాడవుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద సౌకర్యాలు లేక, రాత్రింబవళ్లు పంటను కాపాడుకోవడానికి పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. అధికారుల చుట్టూ తిరిగినా ‘రేపు.. మాపు’ అనే సమాధానాలే తప్ప, ఆచరణలో చర్యలు కనిపించడం లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మంచిర్యాలలో ‘బాంచన్ నీ కాళ్లు మొక్కుతా’
అటు మంచిర్యాల జిల్లా కేంద్రంలోనూ ఇలాంటి దృశ్యమే పునరావృతమైంది. పండించిన వడ్లు అమ్ముకోవడానికి రైతులు పడుతున్న ఇబ్బందులు పరాకాష్టకు చేరాయి. కొనుగోలు కేంద్రంలో తన ధాన్యం అమ్ముడుపోవడం లేదని ఆవేదన చెందిన ఓ రైతు, అక్కడికి వచ్చిన ఎమ్మార్వో కాళ్లు పట్టుకుని బతిమాలాడు. “బాంచన్.. నీ కాళ్లు మొక్కుతా, నా వడ్లు కొనిపించు” అంటూ కన్నీరుమున్నీరయ్యాడు. కళ్లముందే ధాన్యం రాశులు కుప్పలుగా పేరుకుపోతున్నా, ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడమే ఈ దీనస్థితికి కారణమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

మిల్లర్ల జాప్యం.. అధికారుల నిర్లక్ష్యం?
రైతుల నుంచి ధాన్యం సేకరించడంలో మిల్లు యజమానుల కొర్రీలు, హమాలీల కొరత, రవాణా సౌకర్యాల లేమి ప్రధాన అడ్డంకులుగా మారుతున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర దక్కకపోగా, మరోవైపు తేమ శాతం పేరుతో కోతలు విధిస్తుండటం రైతును కుంగదీస్తోంది. అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగానే కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయని, దీనివల్ల దళారుల చేతిలో రైతులు మోసపోయే ప్రమాదం ఉందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read: రాజ్‌భవన్ వర్సెస్ టీవీకే.. దళపతికి ప్రజలు పట్టం కడితే మీరెవరు అడ్డుకోవడానికి? గవర్నర్ వైఖరిపై భగ్గుమన్న కార్యకర్తలు!

అన్నదాతకు అండగా నిలవాల్సిన సమయం
దేశానికి వెన్నెముక అని చెప్పుకునే రైతు, తను పండించిన పంటను అమ్ముకోవడానికి ఒక యాచకుడిలా కాళ్లు మొక్కాల్సిన పరిస్థితి రావడం ప్రజాస్వామ్య వ్యవస్థకే సిగ్గుచేటు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించి, యుద్ధప్రతిపాదికన కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పాలకులు, అధికారులు కేవలం హామీలకే పరిమితం కాకుండా, రైతన్న కన్నీరు తుడిచేలా పారదర్శకమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×