E-Paper
Advertisement

సినీ పరిశ్రమలో విషాదం.. హీరో, కెమెరామెన్ దుర్మరణం!

సినీ పరిశ్రమలో విషాదం.. హీరో, కెమెరామెన్ దుర్మరణం!
Advertisement

హైదరాబాద్‌ ఔటర్ రింగ్ రోడ్డు (ORR)పై ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఒక భయంకరమైన రోడ్డు ప్రమాదం సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో సినీ నటుడు భరత్ కాంత్ (31), కెమెరామెన్ త్రిలోక్ (31) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

భరత్ కాంత్ ఇటీవల విడుదలైన ‘టెనెంట్’ సినిమాలో కథానాయకుడిగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అంతకుముందు పలు చిత్రాల్లో సహాయక పాత్రలు పోషించారు. త్రిలోక్ కూడా సినిమాటోగ్రాఫర్‌గా రాణిస్తూ మంచి పేరు సంపాదించుకున్నారు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఇద్దరు యువ ప్రతిభావంతులు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం వారి కుటుంబ సభ్యులతో పాటు చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది.

Advertisement

ఆదిభట్ల పోలీసుల తెలిపిన‌ వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు పట్టణానికి చెందిన భరత్ కాంత్, త్రిలోక్ చిన్ననాటి స్నేహితులు. సినీ రంగంపై మక్కువతో దాదాపు పదేళ్ల క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చారు. నగరంలోని నానక్‌రామ్‌గూడలో నివాసం ఉంటున్న వీరు.. పరిశ్రమలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునేందుకు ఎంతో కృషి చేస్తున్నారు.

గత కొన్ని రోజులుగా సొంతూరైన నెల్లూరులో గడిపిన వీరిద్దరూ.. శనివారం రాత్రి తమ కారులో తిరిగి హైదరాబాద్‌కు ప్రయాణమయ్యారు. ఆదివారం తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో వీరి కారు పెద్ద అంబర్‌పేట్ వద్ద ఓఆర్‌ఆర్‌పైకి ఎక్కింది. శంషాబాద్ వైపు వెళ్తుండగా బొంగుళూరు ఎగ్జిట్-12 సమీపంలో అదుపు తప్పిన వీరి కారు.. ముందు వెళ్తున్న ఒక భారీ కంటైనర్‌ను వెనుక నుంచి అత్యంత వేగంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. కారులో ఉన్న భరత్ కాంత్, త్రిలోక్ తీవ్రమైన గాయాల కారణంగా సంఘటనా స్థలంలోనే మృతి చెందారు.

Advertisement

సమాచారం అందుకున్న ఆదిభట్ల ఎస్సై నోయల్ రాజ్ తన బృందంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను అతికష్టం మీద కారు నుంచి బయటకు తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిద్రమత్తు కారణంగా ప్రమాదం జరిగిందా లేదా అతివేగం కారణమా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. చేతికందిన కొడుకులు విగతజీవులుగా పడి ఉండటం చూసి నెల్లూరులోని వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. వర్ధమాన నటుడు, సాంకేతిక నిపుణుడు ఇలా ప్రాణాలు కోల్పోవడంతో పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: మటన్ కొట్టు అమ్మాయితో పెట్టుకుంటే పొట్టు పొట్టు నరికి… మైండ్ బెండింగ్ థ్రిల్లర్ సామీ

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×