E-Paper
Advertisement

Lovers Suicide: వందే భారత్ రైలు ముందు దూకిన ప్రేమికులు, ముక్కలుగా మృతదేహాలు, లక్నోలో దారుణం

Lovers Suicide: వందే భారత్ రైలు ముందు దూకిన ప్రేమికులు, ముక్కలుగా మృతదేహాలు, లక్నోలో దారుణం
Advertisement

Lovers Suicide: వందే భారత్ రైలు ముందుకు దూకి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నట్లు ఘటన కలకలం రేపింది. రైల్వే క్రాసింగ్ సమీపంలోని ట్రాక్ పై వారి మృతదేహాలు ఛిద్రంగా కనిపించాయని పోలీసులు తెలిపారు. దీనిపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. యువకుడికి వివాహం కాగా, ఓ బాబు కూడా ఉన్నాడు.

వందే భారత్ రైలు ముందు దూకిన ప్రేమికులు 

Advertisement

శనివారం మధ్యాహ్నం ఆలంనగర్ స్టేషన్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. మృతులను సూర్యకాంత్, అర్జున్‌గంజ్‌లోని షా ఖేడా గ్రామానికి చెందిన దీపాలిగా గుర్తించారు. వీరద్దరూ ఓ ప్రైవేట్ కార్యాలయంలో కలిసి పని చేస్తున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ఈ సంఘటనకు దారితీసిన పరిస్థితులను తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతోంది.

Advertisement

పోలీసులు తెలిపిన వివరాల మేరకు శనివారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటల ప్రాంతంలో వందే భారత్ రైలు అలంనగర్ స్టేషన్ సమీపిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. అందుకుముందు ప్రేమజంట దాదాపు రెండున్నర గంటలపాటు జలాల్‌పూర్ గేట్ దగ్గర నడుచుకుంటూ వెళ్లినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రైలు దగ్గరకు వచ్చేసరికి ఇద్దరు ట్రాక్‌పై పడుకున్నారు.

ముక్కలుగా మృతదేహాలు, లక్నోలో దారుణం

ప్రజలు హెచ్చరించినప్పటికీ రైలు వారిపై నుంచి దూసుకెళ్లింది. జనవరి 7న అంటే గత బుధవారం దీపాలి ఇంటి నుండి ఆఫీసుకు వెళ్లింది. కానీ ఆఫీసు, ఇంటికి మళ్లీ తిరిగి రాలేదు. జనవరి 8న పోలీస్ స్టేషన్‌లో యువతి మిస్సింగ్ అయ్యిందంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఘటన జరిగినప్పటికే పోలీసులు ఆమె కోసం గాలింపు చేపట్టారు.

సూర్యకాంత్‌కు వివాహం కాగా, ఏడాది వయసున్న కొడుకు ఉన్నాడని ఏడీసీపీ ధనంజయ్ కుష్వాహా తెలిపారు. మూడేళ్ల ప్రేమ తర్వాత సవితను వివాహం చేసుకున్నాడు సూర్యకాంత్. ప్రస్తుతం అతడి ఫ్యామిలీ నీల్మత ప్రాంతంలో నివాసం ఉంటోంది. మృతుడి భార్య ఇంట్లో టైలర్‌గా పని చేస్తోంది.

ALSO READ:  అక్క భర్తతో చెల్లి ఎఫైర్..  నడిరోడ్డుపై అక్కను ఘోరంగా చంపిన తమ్ముడు

సూర్యకాంత్ తన ఆధార్ కార్డు ప్రకారం.. నిషాత్‌గంజ్‌లోని అత్తమామల చిరునామా ఉంది. ఘటనకు ముందు వీరిద్దరు మూడు రోజుల ముందు ఈ జంట అన్సాల్ సిటీ ప్రాంతంలోని అద్దెకు దిగినట్టు తేలింది. ముందుగా అద్దె చెల్లించాడని పోలీసులు గుర్తించారు. అయితే దీని గురించి ఇరు కుటుంబాలకు తెలియదు. వారం రోజుల తర్వాత వారి బట్టల బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు.

ఆ జంట వేరే చోటికి వెళ్లాలని ప్లాన్ చేసినట్టు భావిస్తున్నారు. మహిళ నుంచి ఓ మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తి వద్ద రెండు మొబైల్ ఫోన్లు, ఆధార్ కార్డు, ఇతర పత్రాలు దొరికాయి. వారిద్దరికీ బంధువులని , ఆ యువతికి సూర్యకాంత్ వరసకు బావ అవుతాడని అంటున్నారు. సేకరించిన ఆధారాలతో ప్రేమ వ్యవహారం ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. పోలీసులు ఆ కోణంలో కూడా విచారణ వేగవంతం చేశారు.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×