E-Paper
Advertisement

ప్రభుత్వ ఉద్యోగినిపై దారుణం.. వెనుక నుంచి వచ్చి.. కొడవలితో 8 సార్లు నరికాడు!

ప్రభుత్వ ఉద్యోగినిపై దారుణం.. వెనుక నుంచి వచ్చి.. కొడవలితో 8 సార్లు నరికాడు!
Advertisement

Palghar Attack: మహారాష్ట్ర పాల్ఘర్ లో దారుణం చోటుచేసుకుంది. 27 ఏళ్ల ప్రభుత్వ మహిళా ఉద్యోగినిపై ఓ దుండగుడు పదునైన ఆయుధంతో దాడి చేశాడు. విధులు ముగించుకొని బాధితురాలు వెళ్తుండగా.. వెనుక గుండా పరిగెత్తుకొచ్చి ఈ దారుణానికి తెగబడ్డాడు. నిందితుడితో దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు.

బాధిత మహిళను స్నేహల్ సావంత్ గా గుర్తించారు. ఆమె పాల్ఘర్ జిల్లా కలెక్టర్ ఆఫీసులో రెవెన్యూ విభాగంలో పనిచేస్తోంది. శుక్రవారం సాయంత్రం విధులు ముగించుకొని వెళ్తుండగా.. సరిగ్గా 6.15 గం.లకు ఆమెపై దాడి జరిగింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. బాధితురాలు నడుచుకుంటూ వెళ్తుండగా.. నిందితుడు ఆమె వెనుక వైపు నుంచి పరిగెత్తుకు వచ్చాడు. చేతిలోని ఆయుధంతో ఆమె మెడ, వీపు, భుజాలు, నడుముపై కొడవలి లాంటి ఆయుధంతో దాడి చేశాడు. మెుత్తం 8 సార్లు దాడి చేయడంతో స్నేహాల్ తీవ్రంగ గాయపడి.. అక్కడే కుప్పకూలిపోయింది.

Advertisement

అయితే దాడి అనంతరం నిందితుడు తన బ్యాగు, ఆయుధాన్ని అక్కడే వదిలేసి పారిపోయాడు. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న స్థానికులు.. ఆమెను గమనించి హుటాహుటీనా స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు అత్యవసర చికిత్సను అందిస్తున్నారు.

Advertisement

Also Read: సామాన్యులకు గుడ్ న్యూస్.. ఇక ఏసీతో పనిలేదు.. కేవలం రూ.2 వేలతో ఇల్లంతా కూల్!

మరోవైపు దాడి ఘటన గురించి తెలుసుకున్న పాల్ఘర్ పోలీసులు.. హుటాహుటీనా ఘటనాస్థలికి చేరుకున్నారు. జిల్లా ఎస్పీ యతీశ్ దేశ్ ముఖ్ స్వయంగా దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. నిందితుడు స్థానిక కోర్టులో ప్యూన్ గా పనిచేస్తున్నట్లు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. అయితే ఉద్యోగినికి ఎందుకు దాడి చేశారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఘటన జరిగినప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడని.. అతడి ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తామని పేర్కొన్నారు.

Also Read: ఈ 5 పొరపాట్లు చేస్తున్నారా? అయితే ల్యాప్ టాప్ బాంబులా పేలొచ్చు.. జాగ్రత్త భయ్యో!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×