E-Paper
Advertisement

USA Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలంగాణ యువతులు మృతి

USA Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలంగాణ యువతులు మృతి
Advertisement

USA Road Accident: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థినులు మరణించారు. కాలిఫోర్నియాలో కారులో యాత్రకు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కాలిఫోర్నియాలోని ఓ ప్రధాన రహదారిపై కారులో ప్రయాణిస్తున్న సమయంలో.. అదుపు తప్పిన వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన మేఘన (25), ముల్కనూరు గ్రామానికి చెందిన భావన (24) అక్కడికక్కడే మృతి చెందారు.

Advertisement

మృతుల్లో మేఘన గార్ల మీసేవ కేంద్రం నిర్వాహకుడు నాగేశ్వరరావు కూతురు. ఉన్నత చదువుల కోసం కొద్ది సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లిన ఆమె, అక్కడి యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతుంది.

ఇంకొక మృతురాలు భావన (24) ముల్కనూరు ఉప సర్పంచ్ కోటేశ్వరరావు కూతురు. ఆమె కూడా ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి చదువుకుంటోంది.

Advertisement

ప్రమాద వార్త వెలువడిన వెంటనే మహబూబాబాద్ జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రెండు గ్రామాల్లోనూ శోకసంద్రం నెలకొంది.

Also Read: ఘోర ప్రమాదం.. డివైడర్‌ని ఢీ కొట్టిన లారీ, ఆ తర్వాత బొలెరోపై పడింది

ఈ ఘటనపై స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, ప్రమాదానికి గల కారణాలపై అమెరికా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను స్వదేశానికి తరలించే ఏర్పాట్లలో అధికారులు, భారత దౌత్య కార్యాలయం నిమగ్నమయ్యాయి.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×