E-Paper
Advertisement

Lorry fell into a Bolero: ఘోర ప్రమాదం.. డివైడర్‌ని ఢీ కొట్టిన లారీ, ఆ తర్వాత బొలెరోపై పడింది

Lorry fell into a Bolero: ఘోర ప్రమాదం.. డివైడర్‌ని ఢీ కొట్టిన లారీ, ఆ తర్వాత బొలెరోపై పడింది
Advertisement

Lorry fell into a Bolero: యూపీలోని దారుణమైనప్రమాదం చోటు చేసుకుంది.మితిమీరిన లోడుతో వెళ్తున్న ఒక భారీ లారీ.. ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయింది. పక్కనే ప్రయాణిస్తున్న బొలెరో వాహనంపై బోల్తా పడింది. ఈ ఘటనలో బొలెరో వాహనం నుజ్జు నుజ్జు అయ్యింది. డ్రైవర్ స్పాట్ లో మృతి చెందాడు. దీనికి సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

యూపీలో ఘోర ప్రమాదం

Advertisement

నగరాల్లోకి భారీ వాహనాలను రాత్రి వేళ మాత్రమే అనుమతిస్తారు. ఎందుకంటే ఆ వాహనాలు అడ్రస్ తెలియక ఎక్కడపడితే అక్కడ ఆపుతారు. దీనివల్ల రద్దీ పట్టణాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. అందుకే ఆ వాహనాలను రాత్రి 12 నుంచి తెల్లవారజామున ఐదు గంటల వరకు అనుమతిస్తుంటారు పోలీసులు.

ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌ పట్టణంలో ఘోర ప్రమాదం జరిగింది. రాంపూర్ పట్టణంలోని జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రంపం పొట్టుతో భారీ లారీ వేగంగా వెళ్తూ డ్రైవర్ వైపునున్న డివైడర్‌ని ఢీ కొట్టింది. ఈ క్రమంలో లారీ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయింది. పక్కనే ప్రయాణిస్తున్న బొలెరో వాహనంపై బోల్తా పడింది.

Advertisement

డివైడర్‌ని ఢీ కొట్టి.. బొలెరోపై పడిన లారీ

ఈ ప్రమాదంలో బొలెరో వాహనం పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. బొలెరో డ్రైవర్ ఫిరాసత్ మృతి స్పాట్ లో మృతి చెందాడు. పోలీసులు వెంటనే ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. క్రేన్, బుల్డోజర్‌తో సహాయక చర్యలు ప్రారంభించారు. ట్రక్కును సరిచేసి రోడ్డు పక్కన ఉంచారు. ఢిల్లీ-నైనిటాల్ హైవే-87లోని పహాడి గేట్ కూడలి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదం తర్వాత దాదాపు మూడు గంటల పాటు స్తంభించిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. బొలెరో డ్రైవర్ కుడివైపు తన వాహనాన్ని కట్ చేస్తున్నాడు. అదే సమయంలో వెనుక నుండి వస్తున్న లారీ.. బొలెరోను తప్పించుకునే ప్రయత్నంలో డివైడర్‌ పైకి ఎక్కింది. వాహనం నియంత్రణ కోల్పోవడంతో బొలెరోపై బోల్తా పడింది.

ALSO READ:  ఉత్తరాఖండ్ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

గుజర్ తోలా నివాసి ఫిరాసత్.. విద్యుత్ శాఖకి చెందిన బొలెరోను నడిపాడు. ఆదివారం సాయంత్రం నాలుగున్నర గంటలకు ఖౌడ్ సబ్‌స్టేషన్‌లో అధికారిని దింపి ఇంటికి తిరిగి వస్తున్నాడు. డ్రైవర్ తన ఇంటి ఓ కిలోమీటరు దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది.ఈ ప్రమాదం కారణంగా హైవేపై రెండు కిలోమీటర్ల మేరా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ట్రాఫిక్‌ను మళ్లించి ఆ ప్రాంతాన్ని క్లియర్ చేశారు పోలీసులు.

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×