E-Paper
Advertisement

Fire Accident: కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. 17 ఫైర్ ఇంజిన్లతో

Fire Accident: కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. 17 ఫైర్ ఇంజిన్లతో
Advertisement

Fire Accident: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌‌కతాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పొద్దార్ కోర్టు సమీపంలో ఎజ్రా స్ట్రీట్ ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. మంటలను అదుపు చేసేందుకు 17 అగ్నిమాపక కేంద్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా అగ్ని ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే సమీపంలోని ఇళ్లకు, ఆఫీస్, వాణిజ్య సముదాయలకు మంటలు వ్యాపించాయి. దీనికి తోడు దట్టమైన పొగతో ఆ ప్రాంతం అంతా వ్యాపించించడంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

Advertisement

సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. మొత్తం 17 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తేచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

ప్రమాద తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఫైర్ అండ్ ఎమర్జెన్సీ విభాగం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆపరేషన్‌ను చేపట్టింది. ఎత్తైన భవనాలకు మంటలు అంటుకోవడంతో హైడ్రాలిక్ లాడర్లు, అధిక పీడన నీటి పంపులు వినియోగిస్తున్నారు. సమీపంలో ఉన్న పాత భవనాలు బలహీనంగా ఉండడంతో ఏ సమయంలోనైనా కూలిపోవచ్చనే భయంతో పోలీసులు అక్కడికి ఎవరినీ అనుమతించడం లేదు.

Advertisement

ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం వివరాలు వెల్లడికాలేదు. కానీ ఆ ప్రాంతంలో ఉన్న పాత గోదాములలో భారీగా సామగ్రి ఉందని స్థానికులు చెబుతున్నారు. ఆస్తి నష్టం గణనీయంగానే ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అగ్ని ప్రమాదం పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత మాత్రమే అసలు నష్టం ఎంత అయ్యిందో వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

 

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×