E-Paper
Advertisement

వాడొక విచిత్ర దొంగ.. వాడి టార్గెట్ ఏంటో తెలుసా? తెలుస్తే షాకవుతారు, పోలీసుల వేట మొదలు

వాడొక విచిత్ర దొంగ.. వాడి టార్గెట్ ఏంటో తెలుసా? తెలుస్తే షాకవుతారు, పోలీసుల వేట మొదలు
Advertisement

Bizarre Theft: ఒకొక్కరికి ఒక్కో పిచ్చి ఉంటుంది.. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. కానీ మనం చెప్పుకోబోయేవాడు విచిత్రమైన దొంగ. వాడు చేస్తున్న దొంగతనాలకు మహిళలు హడిలిపోతున్నారు. ఇంతకీ వాడు చేసే పనేంటో తెలుసా? మహిళల లోదుస్తులు దొంగిలించడమే. ఈ విచిత్రమైన దొంగ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.

కర్ణాటకలో విచిత్ర దొంగలు, వారి టార్గెట్ ఏంటో తెలుసా?

Advertisement

కర్ణాటకలోని కొప్పల్ జిల్లా గంగావతి పట్టణంలో ఆ దొంగ మహిళలను ఆందోళనకు గురిచేస్తున్నాడు. సాయంత్రం అయితే చాలు మహిళలు భయపడుతున్నారు. రాత్రి వేళ ఇళ్లలోకి చొరబడి మహిళల లోదుస్తులను దొంగలిస్తున్నాడు. కొన్నిరోజులుగా ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయి. కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

గంగావతి టౌన్‌లోని సీసీటీవీలో నిందితుడు దొంగతనాలకు పాల్పడుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఇప్పుడు అవి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. పోలీసుల ప్రాథమిక విచారణ మేరకు.. గుర్తు తెలియని ఓ వ్యక్తి రాత్రి వేళ ఇళ్లలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ప్రహరీ గోడలు దూకి నివాస ప్రాంగణాల్లోకి ప్రవేశించి మహిళల లోదుస్తులను దొంగతనం చేస్తున్నాడు.

Advertisement

మహిళల లోదుస్తులు మాత్రమే.. వాడి కోసం పోలీసుల వేట మొదలు

పట్టణంలోని సీబీఎస్ ప్రాంతంలో ఆ తరహా ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. తొలుత లైట్‌గా తీసుకున్నారు మహిళలు. రోజురోజుకూ ఆ దొంగ ఆగడాలు పెరగడం మొదలయ్యాయి. గడిచిన నాలుగు రోజులుగా దొంగతనాలు జరుగుతున్నాయని మహిళల లోదుస్తులను లక్ష్యంగా చేసుకుంటున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పదే పదే ఈ ఘటనలు జరగడంతో పరిసరాల్లోని మహిళలు ఆందోళనకు గురవుతున్నారు. పలువురు తమ భద్రత, గోప్యతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాడ్ని సైకో దొంగగా పిలుస్తున్నారు. ఈ తరహా ఘటనలు కర్ణాటకలో జరగడం ఇది తొలిసారి కాదు. గతంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.

ALSO READ: భర్త గ్యాస్ సిలిండర్ తీసుకురాలేదని.. భార్య ఆత్మహత్య

మహిళలను కలవరపరిచిన వింత దొంగతనాలు గతేడాది 2025 సెప్టెంబర్ 30న హుబ్బళ్లి సిటీలో జరిగింది. మహిళల లోదుస్తులను దొంగిలించిన వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. వారం తర్వాత దొంగిలించిన దుస్తులను వారి ఇళ్లలో పడేసేవాడని పోలీసుల విచారణలో తేలింది. మరొక కేసులో ఇలాంటిది వెలుగులోకి వచ్చింది. బెంగళూరులోని  హెబ్బగోడి పోలీసులు 23 ఏళ్ల యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

మహిళల లోదుస్తులు ధరించి బహిరంగ ప్రదేశాల్లో అసభ్యంగా తిరిగేవాడు. ప్రవర్తిస్తూ సెల్ఫీలు తీసుకుంటూ భయభ్రాంతులకు గురి చేసేవాడు. మరొక కేసు విషయానికి వద్దాం. 2002లో అరెస్టయిన సీరియల్ రేపిస్ట్, హంతకుడు ఉమేశ్‌‌రెడ్డి కూడా ఇలాంటివాడే. అరెస్ట్ సమయంలో మహిళల దుస్తులతో కనిపించాడు. మహిళల ఇన్నర్ వేర్స్, చీరలు, నైటీలతో పాటు పెద్ద మొత్తంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెల్సిందే.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×