E-Paper
Advertisement

Meerpet Crime: దారుణ విషాదం.. పసి బాలుడిని చంపి ఉరేసుకున్న తల్లి.. అసలు కారణం ఏంటంటే..?

Meerpet Crime: దారుణ విషాదం.. పసి బాలుడిని చంపి ఉరేసుకున్న తల్లి.. అసలు కారణం ఏంటంటే..?
Advertisement

రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుండెలవిసే విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు ఒక నిండు ప్రాణాన్ని.. పది నెలల పసి బాలుడిని బలితీసుకున్నాయి. అంతేగాక ఆ దృశ్యాన్ని చూసి తట్టుకోలేక మరో ప్రాణం కొట్టుమిట్టాడుతోంది. మానసిక ఒత్తిడి, కలహాల కారణంగా సుస్మిత అనే మహిళ 10 నెలల బాబుకు విషమిచ్చి, ఆపై తానూ ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం.. మీర్‌పేట్‌కు చెందిన సుస్మిత (27)కు నాలుగేళ్ల క్రితం యశ్వంత్ రెడ్డి అనే వ్యక్తితో వివాహమైంది. యశ్వంత్ రెడ్డి వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్ (CA)గా పనిచేస్తున్నారు. వీరికి పది నెలల వయసున్నకుమారుడు ఉన్నాడు. పైకి సంతోషంగా కనిపిస్తున్నప్పటికీ.. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సుస్మిత తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది.

Advertisement

సంఘటన జరిగిన రోజు ఉదయం.. సుస్మిత తల్లి లలిత (44) తన కూతురి ఇంటికి వచ్చింది. ఓ ఫంక్షన్ కోసం షాపింగ్‌కు వెళ్దామనే ఉద్దేశంతో ఆమె అక్కడికి చేరుకుంది. అయితే.. సుస్మిత మనసులో అప్పటికే సూసైడ్ అంటెప్ట్ కు పాల్పడాలనే నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. తల్లి ఇంట్లోనే ఉన్న సమయంలో.. సుస్మిత తెలివిగా పక్క గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. అక్కడ తన 10 నెలల కుమారుడు యశ్వవర్ధన్ రెడ్డికి విషమిచ్చి.. అనంతరం తాను ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

చాలా సేపటి వరకు గది తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన తల్లి లలిత లోపలికి వెళ్లి చూడగా.. కూతురు ఉరివేలాడుతూ కనిపించింది. మనవడు అపస్మారక స్థితిలో పడి ఉండటం చూసి దిగ్భ్రాంతికి గురైంది. కళ్లముందే కూతురు, మనవడు విగతజీవులుగా పడి ఉండటాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. తీవ్ర ఆవేదనతో ఆమె కూడా ఇంట్లో ఉన్న తల్లి విషం సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

Advertisement

రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో భర్త యశ్వంత్ రెడ్డి ఇంటికి చేరుకోగా, తలుపులు లోపల నుంచి వేసి ఉన్నాయి. ఎంత పిలిచినా స్పందన లేకపోవడంతో డోర్లు పగలగొట్టి లోపలికి వెళ్లిన ఆయనకు భయంకరమైన దృశ్యం కనిపించింది. వెంటనే ఆయన పోలీసులకు సమాచారం అందించారు. తీవ్ర అస్వస్థతకు గురైన లలితను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు.

మీర్‌పేట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సుస్మిత, బాలుడి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలే ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురి పరిస్థితి ఇలా కావడంతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

ALSO READ: Chicken Rasam: చలికాలంలో వేడి వేడి చికెన్ రసం, దీన్ని ఇలా వండేయండి

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×