BigTV English

LiveIn Murder: స్కృడ్రైవర్‌తో పొడిచి పొడిచి హత్య.. భర్తను వదిలి బాయ్‌ఫ్రెండ్‌తో 4 పిల్లల తల్లి సహజీవనం

LiveIn Murder: స్కృడ్రైవర్‌తో పొడిచి పొడిచి హత్య.. భర్తను వదిలి బాయ్‌ఫ్రెండ్‌తో 4 పిల్లల తల్లి సహజీవనం

LiveIn Murder| దేశరాజధాని ఢిల్లీలో పట్టపగలు దారుణ హత్య జరిగింది. ఒక యువకుడిని ఒక మహిళ బండరాయితో కొట్టి ఆ తరువాత అపస్మారక స్థితిలో ఉన్న అతడిని స్కృడ్రైవర్‌తో పొడిచి పొడిచి హత్య చేసింది. ఆ తరువాత శవంతోనే 8 గంటలపాటు ఉండి.. చివరకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సరెండర్ చేసింది.


పోలీసుల కథనం ప్రకారం.. ఢిల్లీలోని ముకుంద్‌పురా ప్రాంతంలో ఒక యువకుడితో సహజీవనం చేస్తున్న నలుగురు పిల్లల తల్లి తన ప్రియుడిని దారుణంగా హత్య చేసింది. అతను మద్యం సేవించి.. ఆమెను వేధిస్తున్నాడనే కారణంగానే ఆమె ఈ హత్య చేసినట్లు పోలీసుల ముందు అంగీకరించింది. హత్య జరిగిన సమయంలో అక్కడే ఆమె నలుగురు పిల్లలు కూడా ఉండడం గమనార్హం. పిల్లల ఎదుటే ఘటన జరగడంతో వారిని పోలీసులు ఈ కేసులో సాక్షులుగా పరిగణిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. బీహార్ రాష్ట్రంలోని ఖగాడియాకు చెందిన కల్పన దేవి (28) వివాహం ఢిల్లీకి చెందిన రమేష్ కుమార్ తో 2015లో జరిగింది. రమేష్ కుమార్ ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసేవాడు. తన తల్లిదండ్రులతో ఢిల్లీలోనే నివాసం ఉండేవాడు. అయితే 2018లో వారి ఇంటికి సమీపంలో ఉన్న ప్లంబర్ సాహిల్ ఖాన్ తో కల్పన దేవికి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అప్పటికే కల్పనదేవికి ఇద్దరు పిల్లలున్నారు. వారిద్దరి ప్రేమ వ్యవహారం నాలుగేళ్లు సాగింది. 2022లో రమేష్ కుమార్ కు తన భార్య వివాహేతర సంబంధం గురించి తెలిసింది. దీంతో కల్పనదేవి, రమేష్ కుమార్ మధ్య తరుచూ గొడవలు జరిగేవి. అప్పటికి వారిద్దరికీ నలుగురు పిల్లలున్నారు.


Also Read:  ఇద్దరు భర్తలను వదిలి అక్క మొగుడితో సహజీవనం.. అనుమాస్పద స్థితిలో మృతి

చివరకు కల్పనదేవి.. తన భర్త, నలుగురు పిల్లలను వదిలి సాహిల్ ఖాన్ తో సహజీవనం చేసేందుకు వెళ్లిపోయింది. అలా 2022 నుంచి ప్రియుడు సాహిల్ ఖాన్‌తో సహజీవనం చేస్తున్న కల్పనదేవికి గత కొంతకాలంగా అతనితో కలిసి ఉండడం నరకంగా మారింది. సాహిల్ ఖాన్ తాగుడుకు బాగా అలవాటు పడ్డాడు. రోజు పనికి వెళ్లేవాడు. పైగా అతనికి ఒక భార్య, ఒక కొడుకు కూడా ఉన్నారు.

సాహిల్ ఖాన్ కొంతకాలం తన భార్యతో కొంతకాలం కల్పనదేవితో ఉండేవాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో సాహిల్ ఖాన్.. కల్పనదేవిని తరుచూ కొట్టేవాడు. అయితే ఆరు నెలల క్రితం రమేష్ కుమార్ గుండెపోటుతో మరణించాడు. భర్త చనిపోవడంతో అత్తారింట్లో ఉన్న తన నలుగురు పిల్లలను కల్పనదేవి తనతో తీసుకువచ్చేసింది. ఈ విషయం సాహిల్ ఖాన్‌కు నచ్చేదికాదు. పిల్లలను తిరిగి పంపించేయాలని గొడవచేసేవాడు.

తాజాగా రెండు రోజుల క్రితం.. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో సాహిల్ ఖాన్ మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో కల్పనదేవి, ఆమె నలుగురు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. మత్తులో ఉన్న సాహిల్ ఖాన్ ఇంటికి చేరి.. పిల్లలను అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోపంతో అన్నాడు. కల్పనదేవి అడ్డుపడేసరికి ఆమెను, పిల్లలను కొట్టాడు. దీంతో కల్పనదేవి అతడిని ఇల్లు వదిలి వెళ్లిపోవాలని చెప్పింది. కానీ సాహిల్ ఖాన్ ఆమెను మళ్లీ కొట్టాడు. ఇక చేసేది లేక కల్పనదేవి ఇంట్లో ఉన్న సుత్తితో సాహిల్ ఖాన్ తలపై బలంగా రెండు దెబ్బలు కొట్టింది. దీంతో సాహిల్ ఖాన్ స్పృహ తప్పి పడిపోయాడు. అతడు తిరిగి లేస్తే మళ్లీ గొడవ జరుగుతుందని భావించిన కల్పనదేవి ఇంట్లో ఉన్న స్కృడ్రైవర్‌తో అపస్మారక స్థితిలో ఉన్న సాహిల్ ఖాన్ ను పొడిచి పొడిచి హత్యచేసింది.

రాత్రి 10 గంటలకు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆమె తాను ఓ హత్య చేశానని సరెండర్ చేసింది. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని శవాన్ని పోస్టు మార్టం కోసం తరలించారు. కల్పనదేవి నలుగురు పిల్లలను వారి తాత, నానమ్మల వద్దకు పంపించారు. సాహిల్ ఖాన్ హత్య కేసులో కల్పనదేవిని అరెస్టు చేశారు.

Related News

Hyderabad News: ఆడ వేషం వేసుకుని.. ఫ్రెండ్ ఇంట్లో చోరి, ఇదిగో ఇలా దొరికిపోయాడు!

Bapatla Road Accident: బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

Charlapalli Incident: సంచిలో డెడ్ బాడీ కేసులో పురోగతి.. ఆ మహిళ, నిందితుడు ఎవరంటే?

Mahabubnagar: మహిళ డెడ్ బాడీని రోడ్డు పక్కన వదిలేసిన అంబులెన్స్ డ్రైవర్.. రాష్ట్రంలో దారుణ ఘటన

Train Accident: రైలు ఢీకొని.. ఇద్దరు యువకులు మృతి

Husband Kills Wife: గాఢ నిద్రలో భార్య.. సైలెంటుగా గొంతుకోసి పరారైన భర్త.. అసలు ఏమైంది

Food Delivery Boy: ఫుడ్ ఆర్డర్ ఆలస్యంగా తెచ్చాడని.. డెలివరీ బాయ్‌పై ఘోరంగా దాడి

Guntur Bus Accident: గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే 25 మంది

Big Stories

×