MP Truck Accident Video: మృతువు ఏ రూపంలో.. ఎలా వస్తుందో.. ఎవరూ ఊహించలేరు. ఇంటి ముందు కూర్చొన్న ఓ వృద్ధుడిపై లారీ బోల్తా పడిన ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో 90 ఏళ్ల గిరిరాజ్ శర్మ తన ఇంటి బయట కూర్చొన్నారు. శీతాకాలం కావడంతో ఎండ కోసం ఇంటి బయట కూర్చొన్నారు. ఇంతలో అటుగా కంకర లోడుతో వచ్చిన టిప్పర్ లారీ మట్టిలో కూరుకుపోయి.. ఓ పక్కకు ఒరిగి వృద్ధుడిపై బోల్తా పడింది. కంకర వృద్ధుడిపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందారు. రెప్పపాటులో ఊహించని ప్రమాదంతో గిరిరాజ్ మృతి చెందారు. ఈ ప్రమాదం సీసీకెమెరాల్లో రికార్డు అయింది.
బాధితుడిని గిరిరాజ్ శర్మ తన మనవడు సతీష్ శర్మతో కలిసి గ్వాలియర్ లో నివసిస్తున్నారు. శర్మ తన ఇంటి బయట ఎండ కోసం కూర్చుని ఉన్నారు. అక్కడికి సమీపంలోని ఇంటి నిర్మాణ పనుల కోసం కంకర లోడ్ తో ఒక ట్రక్ ఆ ప్రాంతానికి వచ్చింది. లారీ ముందుకు కదులుతుండగా, దాని వెనుక టైర్లలో ఒకటి రోడ్డు గుంతలో ఇరుక్కుపోయింది. ట్రక్కు బ్యాలెన్స్ కోల్పోయి అకస్మాత్తుగా బోల్తా పడింది. వాహనం పడిపోవడం చూసి చూసి, ఆ వృద్ధుడు లేవడానికి ప్రయత్నించారు. కానీ అతను కదలకముందే, కంకర అతనిపై పడిపోయింది. దీంతో అతడు అక్కడికక్కడే మరణించారు.
𝑵𝒐 𝒐𝒏𝒆 𝒌𝒏𝒐𝒘𝒔 𝒘𝒉𝒆𝒏 𝒅𝒆𝒂𝒕𝒉 𝒘𝒊𝒍𝒍 𝒂𝒓𝒓𝒊𝒗𝒆…
In Gwalior, Madhya Pradesh, 90-year-old Girraj Sharma was simply sitting outside his home, quietly soaking in the winter sun. In a cruel twist of fate, a gravel-laden dumper lost control after a tyre burst and… pic.twitter.com/uAdXECIaxM
— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) December 21, 2025
ఈ ప్రమాదం తర్వాత, ట్రక్ డ్రైవర్ సంఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బహోదాపూర్ పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ట్రక్ కింద నుంచి మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ప్రమాదంపై ఏఎస్పీ జయరాజ్ కుబేర్ మాట్లాడుతూ.. ట్రక్ డ్రైవర్ నెల పరిస్థితులు అంచనా వేయకపోవడంతో ప్రమాదం జరిగిందని అన్నారు. కొద్ది రోజుల క్రితం ఈ ప్రాంతంలో నీటి పైపులైన్ వేయడంతో నేల చిత్తడిగా మారింది. దీంతో ట్రక్ అదుపు తప్పి బోల్తా పడింది. వృద్ధుడు ట్రక్ కింద నలిగి చనిపోయారని ఏఎస్పీ అన్నారు.
Also Read: Anantapur: క్లాస్ రూమ్‌లో ఫిట్స్ వచ్చి విద్యార్థిని మృతి.. ఎస్కే యూనివర్శిటీలో విషాదం
గిరిరాజ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ట్రక్కును స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.