UP Crime: ఓ వ్యక్తి ఆస్తిపై కన్నేసింది ఓ మహిళ.అతడికి ఎవరూ లేరని తెలుసుకుంది. నేరుగా మారువేషంలో అతడితో మాట్లాడింది. వివాహానికి సై అనుకున్నారు.. పెళ్లి చేసుకున్నారు. ఇంతవరకు ఆ మహిళ వేసుకున్న స్కెచ్ బాగానే వర్కవుట్ అయ్యింది. రెండు గంటల్లో తన టీమ్‌తో కలిసి అగ్నిసాక్షిగా తాళి కట్టిన భర్తను చంపేసింది. సంచలనం రేపిన ఈ ఘటన యూపీలో వెలుగుచూసింది.
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కి కి చెందిన 45 ఏళ్ల ఇంద్రకుమార్ తివారీ. నాలుగు పదుల వయస్సు వచ్చినా ఆయనకు పెళ్లి కాలేదు. అతడికి 18 ఎకరాల భూమి ఉంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయనకు వివాహం కాలేదు. చివరకు మనస్తాపానికి గురైన తివారీ, మే చివరలో ఆధ్యాత్మిక గురువు అనురుద్ధ చార్య మహరాజ్ వద్దకు వెళ్లాడు.
భక్తులతో స్వామికి ఇంటరాక్షన్ సెషన్‌లో చాలా విషయాలు చెప్పాడు. అంతేకాదు వ్యక్తిగత వివరాలు బయటపెట్టాడు. తనకు ఆస్తి ఉన్నప్పటికీ పెళ్లి జరగడం లేదన్న అసహనంతో ఉన్నట్టు మనసులోని మాట బయటపెట్టాడు. తనతోపాటు ఉన్న భూమిని చూసుకోవడానికి ఎవరు లేరని వెల్లడించాడు.
ఆ మాటలు విన్న మహారాజ్, సాధువుగా మారి ఉన్న భూమిని ప్రజా సేవకు అంకితం చేయాలని సరదాగా అన్నాడు. ఆ తర్వాత వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వ్యవహారం జరిగిన కొన్ని రోజులకు యూపీలోని కుషి తివారీ అనే మహిళ సోషల్ మీడియా వేదికగా ఇంద్రకుమార్‌ని సంప్రదించింది. అతడితో కొద్దిరోజులు మాట్లాడింది.
ALSO READ: నిజామాబాద్‌లో దారుణం.. కారు టైర్ల కింద నలిగి ఏడేళ్ల బాలుడు మృతి
చివరకు తన మనసులోని ఆలోచనను బయటపెట్టింది ఆ మహిళ. పెళ్లి చేసుకుందామని చెప్పడంతో ముందు వెనుక ఏ మాత్రం ఆలోచించకుండా కుషి ప్రపోజల్‌ని ఓకే చేశాడు. తనకు పెళ్లి కాబోతున్న ఆనందంతో ఉన్నాడు ఇంద్రకుమార్. కానీ ఆ పెళ్లి వెనుక మృత్యువు దాగి ఉందన్న విషయాన్ని గ్రహించలేకపోయాడు. తాను ఓ యువతిని పెళ్లి చేసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులకు తెలిపాడు.
జూన్ 6న యూపీలోని కుషినగర్‌కి వెళ్లాడు తివారీ. అక్కడి నుంచి కుషితో కలిసి గోరఖ్‌పూర్‌కి వెళ్లాడు.. వివాహం చేసుకున్నాడు. ఇంద్రకుమార్ పెళ్లి చేసుకున్నాడు కానీ, ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. పెళ్లయిన రెండు గంటల వ్యవధిలో కుషి తివారీ తన సహచరులతో కలిసి భర్త ఇంద్రకుమార్‌ని హత్య చేయించింది. ఆ తర్వాత తివారీ మృతదేహాన్ని మురికికాలువలో పడేసింది.
అతడి దగ్గరున్న బంగారు నగలు, నగదు తీసుకుని కుషి గ్యాంగ్ పరారైంది. కాలువలో మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. మృతుడు మధ్యప్రదేశ్ కి చెందినవాడని గుర్తించారు. ఆ రాష్ట్ర పోలీసులతో కలిసి దర్యాప్తును మొదలుపెట్టారు.
ఈ నేపథ్యంలో కుషి తివారీ గురించి అసలు విషయాలు బయటపడ్డాయి. కుషి తివారీ అసలు పేరు సాహిబా బానో. నకిలీ ఆధార్ కార్డు క్రియేట్ చేసి ఇంద్రకుమార్‌కు దగ్గరైంది. ఆస్తిని కాజేసే ప్రయత్నం చేసింది. పోలీసులు సాహిబాతోపాటు మరో ఇద్దర్ని అరెస్ట్ చేశారు. పెళ్లి ఫొటోలు ఉపయోగించి మృతుడి భూమిని దక్కించుకోవాలని ప్లాన్ చేసినట్టు తేలింది.
అందుకే పెళ్లి చేసుకున్న భర్తను చంపినట్టు పోలీసులు తెలిపారు. సాహిబా, ఆమె గ్యాంగ్ మోసాలు చేయడం ఇది మొదటిసారి కాదు. ఆమెలో ఒకడైన కుషాల్ ఈ ఏడాది మొదట్లో ఇదే విధంగా నకిలీ వివాహం చేసుకున్నాడు. పెళ్లి కాని ప్రసాదులు ఇలాంటి మహిళ విషయంలో తస్మాత్ జాగ్రత్త.
Sahiba Bano watched a video of Bhagwat Kathavachak Aniruddhacharya answering questions from Hindu devotees.
In the video, she saw Indra Kumar Tiwari, a teacher from Jabalpur, MP, with 18 acres of land and still unmarried.
Sahiba Bano then hatched a murder plot to grab his land.… pic.twitter.com/ICi1K8UA4x
— Treeni (@TheTreeni) June 29, 2025