Nindu Noorella Saavasam Serial Today Episode: అప్పుడే షాపింగ్ మాల్‌కు వచ్చిన చిత్రను చూసి వినోద్ ఎందుకు ఇంత లేటు అయింది. అయినా భాగీని ఎందుకు తీసుకొచ్చావు అంటూ విసుక్కుంటాడు. దీంతో హెవీ ట్రాఫిక్ ఉందని.. భాగీ వస్తానని ఒకటే నస పెట్టిందని అందుకే తీసుకువచ్చానని చెప్తుంది. ఇంతలో మేనేజర్ వచ్చి వచ్చిన స్టాక్ మొత్తం అయిపోయిందని కొత్త స్టాక్ తెప్పించానని హెవీ క్రౌడ్ కస్టమర్స్ ఒకసారి చూస్తారా..? అని అడగ్గానే.. అక్కర్లేదు.. నువ్వే చూసుకో అంటూ చిత్ర చెప్పగానే.. మేనేజర్ సరే అంటూ వెళ్లిపోతాడు. దీంతో మిస్సమ్మ అదేంటి చిత్ర ఆ స్టాక్ ఎలా ఉందో ఏంటో చెక్ చేయవా..? క్వాలిటీ బాగాలేకపోతే కస్టమర్స్ రిజెక్ట్ చేస్తారు వినోద్. ఇలాంటివన్నీ మీరు దగ్గరుండి చూసుకోవాలి అని చెప్పగానే.. అవన్నీ మాకు తెలుసు.. మీరు వచ్చిన పని చూసుకోండి అంటూ వినోద్ వెళ్లిపోతాడు.
మిస్సమ్మ మాత్రం చూడు చిత్ర నేన మీ మంచి కోరి చెప్తున్నాను. స్టాఫ్‌ను, వర్కర్స్ ను నమ్మి వదిలేయడం మంచిది కాదు. నమ్మించి మోసం చేస్తారు అని చెప్పగానే.. చూడు భాగీ నేను మరీ అంత అమాయకురాలిలా కనిపిస్తున్నానా..?నేను నీలా వంటిటి కుందేలును కాదు.. నా కలలు ఎలా నెరవేర్చుకోవాలో నాకు బాగా తెలుసు.. అందుకే నేను ఇంత పెద్ద షాపింగ్ కాంప్లెక్స్‌కు ఓనర్ అయ్యాను అంటుంది. షాప్ పెట్టడం గొప్ప విషయం కాదు.. అది నిలబెట్టుకోవాలి. మీ కాళ్ల మీద మీరు నిలదొక్కుకోవాలని ఆయన మీ మీద నమ్మకంతో డబ్బులు ఇచ్చారు. ఏ చిన్న తప్పు జరిగినా పెద్ద ఎత్తున నష్టం వస్తుంది. మళ్లీ ఆయన ముందు తల ఎత్తుకోలేరు. చెప్పిన నీతిసూత్రాలు చాలు.. మేము అంత తెలివి తక్కువవాళ్లం ఏమీ కాదు. మాకు నీ సలహాలు అవసరం లేదు.. ఓకే అంటుంది చిత్ర.
ఇది సలహా కాదు జాగ్రత్త అని చెప్తున్నాను అంటుంది మిస్సమ్మ. దీంతో చిత్ర కోపంగా నువ్వు ఇలాంటి సుత్తి మాటలు చెప్తావనే నిన్ను ఇక్కడికి తీసుకురాకూడదు అనుకున్నాను. కానీ ఆ మనోహరి పట్టుబట్టి నిన్ను తీసుకెళ్లమని చెప్తే తప్పక ఇక్కడికి తీసుకురావాల్సి వచ్చింది అంటూ చిత్ర చెప్పగానే.. మిస్సమ్మ షాక్ అవుతుంది. నన్ను మాల్‌కు తీసుకురమ్మని మనోహరి చెప్పిందా..? అని అడుగుతుంది. చిత్ర చిట్ ఇలా నోరు జారానేంటి..? అని మనసులో అనుకుంటుంది. నన్ను ఎందుకు ఇక్కడకు తీసుకురమ్మంది అంటూ మిస్సమ్మ అడుగుతుంది. దీతో చిత్ర ఏదేదో చెప్తుంటే.. మిస్సమ్మ నమ్మదు. స్వామిజీ చెప్పిన మాటలు గుర్తు చేసుకుని మనోహరి కావాలనే నన్ను ఇక్కడకు పంపించింది అంటే ఇంట్లో తను ఏం చేయబోతుంది. అందరిని బయటకు పంపించి మనోహరి అరుందతి అక్కను ఏమైనా చేయబోతుందా..? అని మనసులో అనుకుంటుంటే.. చిత్ర మెల్లగా ఏంటి బాగీ ఆలోచిస్తున్నావు.. రా కూర్చుందువు కానీ కూల్‌డ్రింక్ తెప్పిస్తాను అంటుంది. దీంతో మిస్సమ్మ కోపంగా నేను వెళ్లాలి అంటూ వెళ్లిపోతుంది. చిత్ర వెనకాలే భాగీ ఆగు నా మాట విను బాగీ అంటూ పిలిచినా మిస్సమమ్ ఆగకుండా బయటకు వెళ్లి ఆటో తీసుకుని ఇంటికి బయలుదేరుతుంది.
మరోవైపు చంభా అమర్ ఇంట్లో ఆరు ఆత్మను బంధిస్తుంది. వెంటనే గుప్త యముడిని పిలుస్తాడు. యముడు రాగానే చిత్రగుప్తుడు ప్రణామములు యమధర్మరాజా అంటాడు. ఏమిటి చిత్ర గుప్త అని యముడు అడగ్గానే.. ప్రభూ ఆ బాలిక దుష్ట మాంత్రికురాలి చేతిలో బాధించబడుతుంది. మీరు సెలవిస్తే ఈ బాలికకు నేను సహా పడెదను అంటాడు. వద్దు చిత్రగుప్త ఎవరి కర్మకు వారే బాధ్యులు నువ్వు నిమిత్త మాత్రుడవై కర్తవ్యమును పాటించుము అని యముడు చెప్పగానే.. అది కాదు ప్రభూ అంటూ చిత్రగుప్తుడు ఏదో చెప్పబోతుంటే.. ఒకవేళ ఆ హింసకు తాళలేక బాలిక యమపురికి పయనం అయినచో తీసుకుని రమ్ము అని చెప్పి యముడు వెళ్లిపోతాడు. ఆజ్ఞ ప్రభు అంటాడు గుప్త.
తర్వాత చంభా శూలా అని పిలవగానే రామచిలుక వస్తుంది. చిలకను చూసిన రణవీర్, మనోహరి షాక్ అవుతారు. చంభా మాత్రం రణవీర్ ఇప్పుడు ఈ మరుగుజ్జును ఆ చిలకలో బంధిస్తాను అని చెప్తుంది. రణవీర్ సరే అంటాడు. దీంతో చంభా మంత్రాలు చదువుతుంటే.. ఆరు గిలగిలా కొట్టుకుంటుంది. మరోవైపు అమర్, మిస్సమ్మ ఇంటికి వస్తుంటారు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం