OTT Movie : సినిమాలను డిజిటల్ స్క్రీన్ మీద చూడాలనిపించినప్పుడు మలయాళం సినిమాలపై ఓ లుక్ వేస్తున్నారు తెలుగు ఆడియన్స్. అంతలా ఈ సినిమాలు రియలిస్టిక్ గా ఉంటున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కామెడీ జానర్ లో తెరకెక్కింది. థియేటర్లలో విడుదలైన రెండు నెలల లోపే డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ చిత్రం ఒక చిన్న ఇంటిలో, ఒక వృద్ధుడి మరణం, అతని అంత్యక్రియల మధ్య 16 గంటల వ్యవధిలో జరిగే కథను చూపిస్తుంది. ఒక దొంగ అనుకోకుండా ఆ ఇంట్లోకి దొంగతనానికి చొరబడటంతో ప్రారంభమయ్యే గందరగోళ సంఘటనలు, పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాయి. ఈ సినిమా పేరు ఏమిటి ? కథ ఏమిటి ? ఎందులో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే
‘కోలాహలం’ (Kolahalam) 2025లో విడుదలైన మలయాళ కామెడీ డ్రామా చిత్రం. ఈ సినిమా రషీద్ పరంబిల్ దర్శకత్వంలో రూపొందింది. ఇది 2025 జూలై 11న థియేటర్లలో విడుదలై, 2025 ఆగస్టు 22 నుండి Sun NXT ప్లాట్ ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో సంతోష్ పుత్తన్ (షమ్సుద్దీన్), అనుషా అరవిందాక్షన్ (లత), విష్ణు బాలకృష్ణన్ (సంతోష్), ప్రియ శ్రీజిత్ (సుభాషిణి), స్వాతి మోహనన్ (ప్రభాకరన్), చిత్ర ప్రసాద్ (సుమ), ప్రధాన పాత్రల్లో నటించారు. ఫైన్ ఫిల్మ్స్, పుత్తన్ ఫిల్మ్స్ దీనిని నిర్మించాయి.
కథలోకి వెళ్తే
ఈ కథ ఒక చిన్న గ్రామంలోని ఇంటిలో ప్రారంభమవుతుంది. అక్కడ షమ్సుద్దీన్ అనే దొంగ డబ్బు దొంగిలించేందుకు చొరబడతాడు. అదే సమయంలో, ఆ ఇంటి పెద్దాయన, ఒక వృద్ధుడు, తన చివరి శ్వాస విడుస్తాడు. ఆ ఇల్లు స్నేహితులు, బంధువులతో సందడిగా మారుతుంది. షమ్సుద్దీన్ ఈ గందరగోళంలో చిక్కుకుంటాడు. అతను తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలు కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ కథ కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి కోసం జరిగే రాజకీయాలను వ్యంగ్యాత్మకంగా చూపిస్తుంది. అయితే ప్రభాకరన్ పాత్ర కథకు ఎమోషనల్ డెప్త్ ని ఇస్తుంది.
ఇక రెండవ భాగంలో, షమ్సుద్దీన్ వల్ల ఇంటిలోని వ్యక్తుల సీక్రెట్స్ బయట పడతాయి. ఈ దొంగ తప్పించుకునే ప్రయత్నాలు, కుటుంబ సభ్యుల మధ్య జరిగే వాగ్వాదాలు, ఆస్తి కోసం జరిగే గొడవలు కథను ముందుకు నడిపిస్తాయి. ఈ కథ ఒక ఎమోషనల్ ట్విస్ట్ తో క్లైమాక్స్ ముగుస్తుంది. 90 నిమిషాల రన్‌టైమ్‌తో, ఈ చిత్రం కామెడీతో ప్రేక్షకులకు ఒక ఆనందకరమైన అనుభవాన్ని అందిస్తుంది. ఆ దొంగ అక్కడి నుంచి ఎలా తప్పించుకుంటాడు ? అతని వల్ల ఎలాంటి సీక్రెట్స్ బయటపడతాయి ? అనే విషయాలను ఈ మలయాళ కామెడీ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : ప్రతి 36 సంవత్సరాలకు రీఎంట్రీ… చిన్నపిల్లలను బలి తీసుకునే మంత్రగత్తె… హర్రర్ కి కేరాఫ్ అడ్రస్ ఈ మూవీ