Rain Alert: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. వారం పాటు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు. బంగాళాఖాతం, అరేబియ సముద్రంలో ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది. ఉత్తర ఒడిశా, జార్ఖండ్ దిశగా ఆవర్తనం కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారి చేసారు. హైదరాబాద్‌లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
జూన్ నెల అయిపోతున్న వర్షాల జాడ కనిపించ లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే నిన్నటి నుంచి అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. జూలైలో మాత్రం అధిక శాతం వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ తెలిపారు. ఇప్పటికే ఉత్తరాది స్టేట్స్‌లో కుండపోత వానలు కురుస్తున్నాయి. ఉత్తరాఖండ్, హిమచల్ ప్రదేశ్‌లో ఎడతెరిపి లేని వర్షాలకు జల జీవనం స్తంభించిపోయింది.
అయితే రానున్న వారం రోజులు తెలంగాణ రాష్ట్రం అంతట ఈదురు గాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. మొత్తం మీద జూలైలో వర్షాలు బాగా కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపారు. దీంతో ఎంతో ఆత్రుతగా ఎదురు చూసే రైతులకు ఇక పండగే.. అయితే తెలంగాణలో ఈ రోజూ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, మహబూబాబాద్, వరంగల్, హనమకొండ జిల్లాలో మెస్తరు వర్షాల కురిసే అవకాశముంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. మిగత జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Also Read: ORR పై మితిమీరిన వేగం.! 9 కార్లు తుక్కు తుక్కు
అంతేకాకుండా ఏపీలో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉండగా మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాలు కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. క్లైమట్ బాగుందని బయటకు వస్తే ఖతం.. ఇంకా రోగాలన్నీ మీ వెంటే ఉంటాయి. అలాగే ఏదైన ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంటుంది. అందుకే జాగ్రత్తగా ఇంట్లోనే ఉండండి. ఏదైన అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు.