Gundeninda GudiGantalu Today episode August 23rd: నిన్నటి ఎపిసోడ్ లో.. బాలుకు మందును మాన్పించాలని పసరు మందును కలిపి జ్యూస్ ను ఇవ్వాలని అనుకుంటుంది.. ఆ జ్యూస్ ను కక్కుర్తి పడి తాగేస్తుంది. ఆ తర్వాత ప్రభావతి మోషన్స్ తో మంచానికి ఎక్కుతుంది. మీనా మాత్రం ఒక జ్యూస్ లో పసరు కనిపిస్తుంది. ప్రభావతి కళ్ళు మూసుకొని మీనా చేసిన జ్యూస్ ని తాగాను అని ఉలిక్కిపడి లేచి అందరితోనూ చెప్తుంది. ఆ జ్యూస్ లో ఏం కలిపావు అని అందరూ అడుగుతారు. అయితే మీనా మాత్రం ఆ జ్యూస్ లో నేను ఇదే కలిపాను అని అంటుంది..
అది ఆయన కోసం కలిపాను అని నిజం చెప్పేస్తుంది. సత్యం తన భర్తని మార్చుకోవాలని ప్రయత్నం చేసింది అందులో మీనా తప్పేమీ లేదు ఎవ్వరూ మీనా అని అనడానికి వీల్లేదు అని అంటాడు. పాలు మాత్రం మీనా కూడా నన్ను నమ్మట్లేదని బాధపడతాడు. మౌనిక మీనాకు ఫోన్ చేసి మా అన్నయ్య అలాంటి వాడు కాదు వదినా ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని హింట్ ఇస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. బాలు అయినా నమ్మకాన్ని కూడా నేను పోగొట్టుకున్నానని బాధపడుతూ ఉంటాడు. ఈ క్రమంలో మీనా కూడా బాలుని ఎలాగైనా సరే ఈ సమస్య నుంచి బయటకు తీసుకురావాలని ఆలోచిస్తుంది. మౌనిక మీనాకు ఫోన్ చేసి ఏం జరిగిందో తెలుసుకొనే ప్రయత్నాలు చెయ్యాలని అంటుంది. నువ్వు కూడా నమ్మకపోతే అన్నయ్య చాలా బాధపడతాడు.. అని మౌనిక అంటుంది. ఆయన నిజంగానే తాగి డ్రై చేసి ఉండడు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అని అనుకుంటుంది. బాలు తన కారుని విడిపించుకోవడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. అయితే అక్కడ పోలీసులు ఇతను నిజంగానే తాగాడు అని ఆ వీడియోని చూసి దారుణంగా అవమానిస్తారు. కావాలని అక్కడున్న పనులని బాలు చేత చేయిస్తారు. బాలు ఎంతగా అవమానిస్తున్న సరే కారు కోసం మౌనంగా భరిస్తూనే ఉంటాడు.
పోలీసులు కోర్టులో తేల్చుకొని బాలు అనడంతో అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు. మీనా బార్ కి వెళ్ళిన మా ఆయన అక్కడ ఏదో పొరపాటు జరగడం వల్లే అడ్డంగా ఇరుక్కున్నాడని ఆలోచిస్తూ బార్ కి వెళ్తుంది. అక్కడ బార్ దగ్గర వెయిట్ చేస్తూ ఎప్పుడు తెరుస్తారని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఒక యూట్యూబర్ అక్కడికి వచ్చి శ్రావణమాసంలో ఉదయం లేచి పూజలు చేసుకోవాల్సిన ఆడవాళ్లు ఇలా ఉదయం లేచి బార్ల దగ్గర నిలబడి ఉన్నారంటే ఆశ్చర్య పోవాల్సిన విషయమే అంటూ వీడియో చేస్తారు.
ఆ వీడియో పై మీనా కోపం కట్టలు తెంచుకుంటుంది. నా భర్త ఈ బార్ కు వచ్చి తాగలేదు అని నిరూపించడానికి నేను వచ్చాను అని నిజాన్ని కక్కేస్తుంది.. నీ భర్త మంచివాడు నిరూపించుకోవడానికి ఏకంగా బార్కే వచ్చావంటే నువ్వు మామూలు మహిళలు కాదమ్మా అని వాళ్ళు పొగడ్తలు కురిపిస్తారు. కానీ మీనా మాత్రం వాడి వల్ల ఒక కుటుంబం రోడ్డున పడేలా ఉంది. ఒక మంచి మనసు మీద నిందలు పడ్డాయి అంటూ అరుస్తుంది.
అయినా కూడా ఆ యూట్యూబర్ వినకుండా మహిళలు బార్ కి రావడం ఇది కొత్త వింత అంటూ రెచ్చిపోతాడు. దాంతో మీ నాకు కోపం కట్టలు తెంచుకోవడంతో వాడిని చితకబాదుతుంది. అమ్మాయిలు బారికే వస్తారా? ఇంకేం పని ఉండదా అంటూ సీరియస్ అవుతుంది. ఎలాగైనా సరే తన భర్తని నిర్దోషి అని బార్లో ఏ తప్పు జరగలేదని నిరూపించాలని బీస్మించుకొని కూర్చుంటుంది.. బాలు తప్పు చేశాడని అందరూ అవమానిస్తున్నారు అది తట్టుకోలేకపోతున్నారని మీనా బార్ లో అసలు విషయం ఏంటో తెలుసుకోవాలి అని అంటుంది. సీసీ ఫుటేజ్ లో నిజాలు ఏంటో తెలిసిపోతాయని ఆలోచిస్తుంది.
Also Read: డైరెక్టర్ గా సమంత.. హీరోయిన్ గా ఇక చేయనట్లేనా..?
మీనా ఆలోచన బాగానే ఉంది.. బారు దగ్గర మీనాక్షి అందరూ నవ్వుతారు.. కానీ భర్త కోసం ఎవరేమనుకున్నా నేను పట్టించుకోను అని మీనా అనుకుంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. సోమవారం ఎపిసోడ్లో మీనా బార్ లోపలికి వెళ్తుందా? బాలు తప్పేమీ లేదని నిజం తెలుసుకుంటుందా? గుణను ఏం చేస్తుంది..? శివ గుణ నుంచి దూరమవుతాడా? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే సోమవారం ఎపిసోడ్లో చూడాలి..