Mancherial News: ‘లక్కీభాస్కర్’ సినిమా మాదిరిగా భారీ మోసం వెలుగులోకి వచ్చింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ఎస్బీఐ బ్యాంక్‌లో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఏకంగా నాలుగైదు కోట్లకు టెండర్ పెట్టాడట పని చేస్తున్న క్యాషియర్. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఎస్‌బీఐ బ్యాంకులో కుంభకోణం జరిగింది. ఖాతాదారులు తనఖా పెట్టిన బంగారం మాయం కావడం దుమారం రేగింది. పెద్దఎత్తున బంగారం, నగదును అందులో పని చేసిన క్యాషియర్ మాయం చేసినట్టు తెలుస్తోంది. విషయం తెలియగానే పోలీసులు రంగంలోకి దిగారు? అసలేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.
చెన్నూర్ ఎస్‌బీఐ బ్యాంకు మేనేజర్ మనోహర్‌రెడ్డి రెండు రోజులు సెలవు పెట్టారు. తిరిగి ఆయన మంగళవారం విధులకు హాజరయ్యారు. ఇదే క్రమంలో బ్యాంకు లెక్కల్లో తేడాలు కనిపించాయి. అనుమానం వచ్చి బ్యాంకులో డబ్బు, ఖాతాదారులు తనఖా పెట్టిన నగలను వివరాలను పరిశీలించారు. అవకతవకలు జరిగినట్టు గుర్తించిన ఆయన, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
హెడ్ ఆఫీసు నుంచి వచ్చిన సిబ్బంది ఆడిటింగ్ నిర్వ హించారు. దీంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. 330 మంది ఖాతాదారులు తనఖా పెట్టిన బంగారు ఆభరణాలు, రూ.80 లక్షల నగదు లావాదేవీల్లో తేడా వచ్చినట్టు గుర్తించారు. బంగారు ఆభరణాలు విలువ మూడు నుంచి నాలుగు కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ALSO READ: 81ఏళ్ల వృద్ధుడికి హనీ ట్రాప్ షాక్.. 7 లక్షలు మాయం
ఈ కుంభకోణంపై సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు సిబ్బందిని ప్రశ్నించారు. జైపూర్ మండలం షెట్‌పల్లి గ్రామానికి చెందిన క్యాషియర్ రవీందర్ రెండు రోజులుగా బ్యాంకుకు రాలేదు. ఆయడి ఫోన్ స్విచ్ఛాఫ్ కావడం, గోల్డ్ మాయం వెనుక ఆయన చేతివాతం ఉంటుందని ప్రాథమిక విచారణలో గుర్తించినట్టు తెలుస్తోంది. శుక్రవారం ఆడిటింగ్ జరగనుందని సీపీ అంబటి కిషోర్ ఝా తెలిపారు. ఇంకా బ్యాంకులో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. దీనిపై పోలీసుల వైపు విచారణ సాగుతోంది.