Kukatpally Murder Case: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూకట్ పల్లి బాలిక హత్య కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సహస్రను పదోతరగతి చదువున్న మైనర్ బాలుడే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. మైనర్ బాలుడు సహస్ర ఇంటి పక్క భవనంలో ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లోకి దొంగతనం కోసం వెళ్లి బాలిక ఉండడంతో హత్య చేసినట్లు గుర్తించారు. ఇన్ని రోజులుగా పోలీసులు దర్యాప్తులో సహస్ర ఇంటి పక్కన ఉండే వారే ఈ హత్య చేసి ఉంటారని పోలీసుల అనుమానం ఎట్టకేలకు నిజమైంది.
Also Read: New Realme Smartphone: మార్కెట్లో ఎప్పుడూ లేని బ్యాటరీ పవర్! రాబోతున్న రియల్‌మీ బిగ్ సర్‌ప్రైజ్
సహస్రను హత్యకు కారణం ఇదే
సహస్ర హత్య కేసులో నిజాన్ని వెలికితీసిన పోలీసులు చివరకు నిందితుడిని పట్టుకున్నారు. ఈ కేసులో సాయి అనే టీనేజర్‌కే ప్రధాన పాత్ర ఉందని పోలీసులు గుర్తించారు. సహస్ర ఇంట్లోకి దొంగతనానికి వెళ్లిన సాయి, ముందే కత్తి తీసుకుని వెళ్లాడు. ఇంట్లోకి చొరబడి సుమారు 80వేలు దొంగిలించాడు. డబ్బు తీసుకుని వెళ్లే సమయంలో సహస్ర అతన్ని చూసింది. దీంతో సహస్ర తనను చూసిందనే భయంతో తనపై దాడి చేశాడు, మొదట గొంతు నులిమి చంపాలని చూశాడు. చనిపోయిందో లేదోనని నిర్ధారించుకోవడానికి గొంతు కోశాడు. అంతటితో ఆగకుండా విచక్షణారహితంగా కత్తితో పొడిచి హత్య చేశాడు.
అంతే కాకుండా.. దొంగతనం ఎలా చేయాలి, ఎవరైనా అడ్డొస్తే ఎలా వ్యవహరించాలి అన్నది సాయి ముందుగానే ఒక ప్లాన్‌గా రాసి పెట్టుకున్నాడని పోలీసులు దర్యాప్తులో గుర్తించి షాకింగ్‌కి గురయ్యారు. సహస్ర హత్య జరిగిన రోజే సాయిని ఆ ప్రాంతంలో చూశామని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరిపి మిస్టరీని ఛేదించారు. విచారణలో మొదట సాయి పొంతనలేని సమాధానాలు చెప్పి తప్పించుకోవాలని చూశాడు. క్రికెట్ ఆడేందుకు సహస్ర తమ్ముడిని కలవడానికి ఇంటికి వచ్చానని చెప్పాడు. అయితే పోలీసులు తనదైన రీతిలో ప్రశ్నించడంతో చివరకు నేరాన్ని ఒప్పుకున్నాడు.
కూకట్ పల్లి బాలిక హత్య కేసు చేధించిన పోలీసులు
పదో తరగతి చదువుతున్న మైనర్ బాలుడే హత్య చేసినట్లు గుర్తింపు
సహస్ర ఇంటి పక్క భవనంలో ఉంటున్న బాలుడు
ఇంట్లోకి దొంగతనం కోసం వెళ్లి బాలిక ఉండడంతో హత్య చేసినట్లు గుర్తింపు https://t.co/bpGYL5xzD5
— BIG TV Breaking News (@bigtvtelugu) August 22, 2025