Intinti Ramayanam Today Episode August 23rd : నిన్నటి ఎపిసోడ్ లో.. పల్లవి నేను చీర మార్చుకోవాలి పక్కకెళ్ళి బావ అని ఎంతగా బ్రతిమిలాడినా కూడా కమల్ నేను వెళ్ళను గాక వెళ్ళను అని అంటాడు. ఏంటి కొత్తగా ఇలా మాట్లాడుతున్నావు అని కమల్ ను పల్లవి అడుగుతుంది.. నేను పక్కకు వెళ్లాలంటే నువ్వు నా వీపును గోకాలి అని కమలంటాడు. ఇక చేతులు ఉన్నాయి కదా నీకు గోర్లు ఉన్నాయి కదా గోక్కొ అని పల్లవి అంటుంది.. నువ్వు గోకితేనే బాగుంటుంది అని కమల్ పల్లవి తో సరసాలు ఆడుతాడు. ఇక పల్లవి చేసేదేమీ లేక ఈ తింగరోడుతో వచ్చిన బాధ ఎందుకు అని గోకడానికి వెళ్తుంది.. కమల్ చేతిలో ఉన్న కరెంటు వైర్ పల్లవికి కావాలని తగిలేలా చేస్తాడు. దాంతో షాక్ కొడుతుంది. ఏంటి బావ ఇలా చేసావు అని పల్లవి అంటుంది. ఇంట్లో ఏదైనా సమస్య వస్తే దాన్ని పరిష్కరించాలి అంతేగాని నువ్విలా ఇంకా కొంచెం దాంట్లో నిప్పులు పోసినట్లు చేస్తే మామూలుగా ఉండదు అని అంటాడు. ప్రణతి మాటలు విన్న పార్వతి వీళ్ళిద్దరికీ శోభనం ఏర్పాట్లు చేయాలని అంతకన్నా ముందు వ్రతం చేయించాలని అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. కొత్తగా పెళ్లయిన దంపతులు కదా అత్తయ్య వాళ్ళు ఎలా పెళ్లి చేసుకున్నా వాళ్లకి పెళ్లి జరిగింది.. మనము సాంప్రదాయం ప్రకారం వ్రతం చేయించాలి కదా అని అవని అంటుంది.. దాని గురించి పార్వతి ఆలోచిస్తుంది కానీ పల్లవి మాత్రం ఈ వంకతో ఇంట్లోనే తిష్ట వేసేలా ఉంది అని ఆలోచిస్తుంది. ఏదైనా చేసి అవని ఈ ఇంటికి రానివ్వకుండా చేయాలని మనసులో అనుకుంటుంది. ఈ విషయాన్ని చక్రధర్ తో చెప్పాలని బయటకు వెళ్తుంది. పల్లవి మాటలు విన్న చక్రధర్ ఏదో ఒకటి చేద్దాం అని అంటాడు.
పార్వతి వ్రతం చేపిస్తున్న విషయాన్ని అందరికీ చెప్పాలని ఇంట్లో వాళ్ళందరిని పిలుస్తుంది.. మన ఇంటి సాంప్రదాయం ప్రకారం కొత్తగా పెళ్లైన వారిచేత వ్రతం చేయించాలి అని అంటుంది. ఇప్పుడు ఈ వ్రతం అవి ఇవి ఎందుకు అత్తయ్య అని పల్లవి అంటుంది.. కానీ పార్వతి మాత్రం సాంప్రదాయం ప్రకారం అన్ని చేపించాలి అని అంటుంది.. వ్రతానికి అన్ని ఏర్పాట్లు చేపించాలని పార్వతి అంటుంది. ఇక ఈ విషయాన్ని అవినీతి చెప్పాలని పార్వతి స్వరాజ్యం వాళ్ళ ఇంటికి వెళ్తుంది.
అవని ఇంట్లో నువ్వు చెప్పినట్లుగానే వ్రతం చేయించాలని అనుకున్నాను. మీరందరూ తప్పకుండా ఈ వ్రతానికి రావాలని పార్వతి అడుగుతుంది… అప్పుడే అక్షయ్ ఇంట్లోకి రావడం చూసిన పార్వతి అరె అక్షయ్ నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది. రాజేంద్రప్రసాద్ అవని ఇద్దరూ నిజం చెప్పేస్తారు. గత రెండు నెలల నుంచి అక్షయ్ ఇక్కడే ఉంటున్నాడు అని అంటారు. వాడికి ఆరోగ్యం బాగోలేక చాలా ఇబ్బంది పడ్డాడు.. మేము ఎంత బ్రతిమలాడినా కూడా ఇష్టం లేకుండానే ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు కూడా తన భార్య కోసం రాలేదు తన కూతురి కోసం మాత్రమే ఇక్కడికి వచ్చాడు అని రాజేంద్రప్రసాద్ అంటాడు.
నేను వ్రతం చేయించడానికి చెప్పడానికి వచ్చాను.. మీరు సంజాయిషీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని పార్వతి అంటుంది. అవని నీ వెళ్లి కుంకుమ భరణి తీసుకురమ్మని అడుగుతుంది. బొట్టు పెట్టి వ్రతానికి రమ్మని పిలుస్తుంది. మన ఇంట్లో ఫంక్షన్ కి మీరు పిలవడమేంటి అత్తయ్య మేం తప్పకుండా వస్తామని అంటుంది. అయితే స్వరాజ్యం ని కూడా బొట్టు పెట్టి పిలుస్తుంది. వదిన గారు మీరు ఇలా ప్రేమగా పిలిస్తే ఎందుకు రాము అని స్వరాజ్యం అంటుంది.
నెట్వర్కు మిమ్మల్ని చూస్తే భయమేసేది కానీ ఇప్పుడు ఇలా నవ్వుతూ పిలుస్తుంటే చాలా సంతోషంగా ఉంది అని అంటుంది. కొత్తగా పెళ్లైన దంపతులకు మనం బట్టలు పెట్టాలి వ్రతం చేసే వాళ్ళకి బట్టలు పెట్టడం మన సాంప్రదాయం అని అక్షయతో అంటుంది పార్వతి. ప్రణతి తరపున నేను మీ నాన్న కూర్చొని బట్టలు పెడతాం. భరత్ తరపున నువ్వు అవని కూర్చొని వాళ్ళకి బట్టలు పెట్టాలి అని అంటుంది పార్వతి. ఈ వ్రతం చేయడమే నాకు ఇష్టం లేదు అసలు వాళ్ల పెళ్లి నాకు ఇష్టం లేదు అలాంటిది నేనెలా వస్తానమ్మా అని అక్షయ్ అంటాడు.
Also Read: బార్ కు వెళ్లిన మీనా.. యూట్యూబర్ కు మైండ్ బ్లాక్.. నిజం తెలిసిపోతుందా..?
అక్షయ్ మాటలు విన్న పార్వతీ షాక్ అవుతుంది.. అదేంట్రా అలా మాట్లాడుతున్నావ్ అని పార్వతి అంటుంది.. మీ అమ్మే అన్ని మర్చిపోయి సంతోషంగా అందరిని పిలవడానికి వచ్చింది. నీకేమైందని రాజేంద్రప్రసాద్ అంటాడు. నేను రాను నన్ను వదిలేయండి అని అక్షయ్ బయటకు వెళ్ళిపోతాడు. పార్వతి అక్షయ్ ని అడుగుతుంది. మాట వినే నేను అందరి దగ్గర ఎదవని అయిపోయాను ఇప్పుడు మరోసారి అందరి దగ్గర చులకన అవ్వాలని నేను అనుకోవట్లేదు అమ్మ అని అక్షయ్ అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…