E-Paper
Advertisement

వైద్యం వికటించి 8 నెలల పసికందు మృతి.. నర్సాపూర్‌లో ఉద్రిక్తత!

వైద్యం వికటించి 8 నెలల పసికందు మృతి.. నర్సాపూర్‌లో ఉద్రిక్తత!
Advertisement

Narsapur: స్వేచ్చ బ్యూరో: వైద్యం వికటించి 8 నెలల పసికందు మృతి చెందిన సంఘటన నర్సాపూర్ పట్టణంలోని మంగళవారం చోటుచేసుకుంది. కుటుంబీకుల కథనం ప్రకారం.. నర్సాపూర్ మండల పరిధిలోని జక్కపల్లి గ్రామానికి చెందిన మంజుల ఆంజనేయులు దంపతుల కుమారుడు మణివర్ధన్(8నెలలు) కు సోమవారం మూడు గంటల సమయంలో జ్వరం వచ్చిందని నర్సాపూర్ లోని అమ్మ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అనంతరం బాలుడిని ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకొని చికిత్సలు జరిపారు.

అయితే మంగళవారం ఉదయం వైద్యులు మణి వర్ధన్ పరిస్థితి విషమంగా ఉందని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని చెప్పారు. వెంటనే కుటుంబీకులు బాలుడిని అంబులెన్స్ లో సంగారెడ్డి ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. సంగారెడ్డి ఆసుపత్రిలో అక్కడి వైద్యులు పరీక్షించగా అప్పటికే బాలుడు చనిపోయినట్లు చెప్పారు. అమ్మ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలుడు మృతి చెందాడని అంతకు ముందే బాలుడు అమ్మ హాస్పిటల్ లోనే మృతి చెందాగా కావాలి అనే సంగారెడ్డి ఆసుపత్రి కి తరలించారని ఆరోపించారు.

Advertisement

8 నెలల బాలుడు మణివర్ధన్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కుటుంబీకులు డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున అమ్మ ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. విషయం పోలీసులకు తెలియడంతో ఎస్సై రంజిత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

Also Read: కేంద్రం ‘మాస్టర్ ప్లాన్’.. దేశీయంగా జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్న వెండి ధరలు.. అసలు కారణాలివే!

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×