E-Paper
Advertisement

Gurugram Crime: నేపాల్ మహిళపై గ్యాంగ్ రేప్.. గురుగ్రామ్‌లో దారుణమైన ఘటన

Gurugram Crime: నేపాల్ మహిళపై గ్యాంగ్ రేప్.. గురుగ్రామ్‌లో దారుణమైన ఘటన
Advertisement

Gurugram Crime: కొందరు కామాంధులు రెచ్చిపోతున్నారు.. మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు.. వారి పనైపోయినట్టే. వారిని సొంతం చేసుకోవాలని తహతహలాడుతున్నారు. తాజాగా అలాంటి ఘటన హర్యానాలో చోటు చేసుకుంది. 26 ఏళ్ల నేపాల్ మహిళపై సామూహిక అత్యాచారం చేశారు ముగ్గురు సభ్యుల గ్యాంగ్. అసలేం జరిగింది?

గురుగ్రామ్‌లో దారుణమైన ఘటన

Advertisement

హర్యానాలోని గురుగ్రామ్‌లో కామాంధులు రెచ్చిపోయారు. నేపాల్‌కు చెందిన 26 ఏళ్ల యువతి కురుక్షేత్రలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తోంది. తన స్నేహితురాలిని కలిసేందుకు మంగళవారం గురుగ్రామ్‌‌కు వచ్చింది. ఫ్రెండ్ ఆచూకీ తెలియకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైంది. ఆ తర్వాత మద్యం తీసుకుంది.

ఆ మత్తులో ఆమె తన రూమ్‌కి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. అప్పటికే డ్రైవర్‌తోపాటు మరో ఇద్దరు వ్యక్తులు అందులో ఉన్నారు. మద్యం మత్తులోనున్న ఆమెని ఆ ముగ్గురు వ్యక్తులు నహర్‌పూర్ ప్రాంతంలోని ఓ నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లారు. అక్కడ ఓ గదికి తీసుకెళ్లి ముగ్గురు వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు.

Advertisement

నేపాల్ మహిళపై గ్యాంగ్ రేప్.. నిందితుల్లో ఒకరు అరెస్ట్

బుధవారం ఉదయం స్పృహ వచ్చేసరికి ఓ గదిలో ఉండడం చూసి షాకైంది. అక్కడి నుంచి వెంటనే బయలు దేరి నేరుగా పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. బుధవారం సాయంత్రం కీలక నిందితుడు ఆటో డ్రైవర్‌ని అరెస్ట్ చేశారు.

పట్టుబడిన నిందితుడు యూపీలోని ఎట్టా నివాసి మనీష్ కుమార్‌. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. మిగతా నిందితులను అరెస్టు చేస్తామని పోలీసు అధికారులు తెలిపారు.

ALSO READ: నిజామాబాద్ జిల్లాలో పేలిన సిలిండర్.. కాలి బూడిదైన ఇల్లు

 

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×