Hyderabad News: హైదరాబాద్‌లో పాకిస్థాన్ యువకుడి రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. పదేళ్ల కిందట హిందూ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్న సదరు వ్యక్తి, మరో యువతితో ఉంటుండగా భార్యకు చిక్కాడు. ఈ విషయాన్ని భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అడ్డంగా దొరికిపోయాడు. దీంతో ఆ యువకుడి అసలు బండారం బట్టబయలైంది. ఇంకా లోతుల్లోకి వెళ్తే..
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ప్రాంతంలోని మౌంట్ బంజారా కాలనీలో ఉంటున్నారు పాకిస్థాన్‌కి చెందిన యువకుడు ఫహద్. దాదాపు రెండున్నర దశాబ్దాల కిందట ఇక్కడి వచ్చి మకాం పెట్టేశాడు. ఇక్కడి వ్యవహారాలను పూర్తిగా అర్థం చేసుకున్న అతగాడు, తన ఆలోచనను బయటపెట్టాడు.
అతడి టాస్క్ ఒక్కటే. అమ్మాయిలకు ప్రేమతో వల వేయడం, ఆ తర్వాత వారిని మతం మార్చి పెళ్లంటూ మాయం చేయడం ఇతగాడి హాబి. ఆ తరహా చాలా మోసాలు చేశాడనుకోండి. హిందూ అమ్మాయి కీర్తిని ప్రేమించాడు. సరిగ్గా తొమ్మిదేళ్ల కిందట అంటే 2016లో పెళ్లి చేసుకున్నాడు. వివాహం తర్వాత కీర్తి పేరును దోహా ఫాతిమాగా మార్చేశాడు.
ఇంతవరకు ఫహద్ స్కెచ్ బాగానే వర్కవుటయ్యింది. హైటెక్ సిటీలోని సిపాల్ కంపెనీలో పని చేస్తోంది ఆమె. ఆ తర్వాత సిపాల్ కంపెనీలో పని చేసిన మరో మహిళతో ఫహద్ పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత దాన్ని అక్రమ సంబంధంగా మార్చుకున్నాడు. ఈ విషయం భార్య చెవిలో పడింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త అలా చేయడని మొదట భావించింది.
ALSO READ: ఆర్‌కే బీచ్‌లో విషాదం.. గల్లంతైన ముగ్గురు వ్యక్తులు
అనుమానం పెనుభూతమైంది. భర్తను ఎలా పట్టుకోవాలన్న దానిపై రకరకాలు ఆలోచించింది. చివరకు భర్తపై నిఘా పెట్టింది. మరో మహిళతో ఏకాంతంగా ఉన్న సమయంలో ఫహద్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది భర్తను పట్టించింది. ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్న పోలీసులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
దీంతో ఫహద్ వ్యవహారాలపై కూపీ లాగారు పోలీసులు. దీంతో అతగాడు వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి. 1998లో పాకిస్థాన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చి సెటిలయ్యాడు. అమ్మాయిలను ప్రేమ పేరుతో మతంలోకి మార్చడం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో పెళ్లి పేరుతో అనేక మోసాలకు పాల్పడ్డాడు. భార్య ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు పోలీసులు.
పాకిస్థాన్ యువకుడి రాసలీలలు
హైదరాబాద్-బంజారాహిల్స్ మౌంట్ బంజారా కాలనీలో వెలుగులోకి వచ్చిన ఘటన
హిందూ అమ్మాయి కీర్తిని మతం మార్చి 2016లో పెళ్లి చేసుకున్న పాకిస్థాన్ యువకుడు ఫహద్
పెళ్లి తర్వాత కీర్తి పేరును దోహా ఫాతిమాగా మార్చిన పాకిస్థానీ
హైటెక్ సిటీ సిపాల్ కంపెనీలో పని… pic.twitter.com/lqtUQ0EVOl
— BIG TV Breaking News (@bigtvtelugu) August 15, 2025