E-Paper
Advertisement

OG Movie: ఓజి సినిమాపై మెగాస్టార్ రివ్యూ… హాలీవుడ్ కు ఏమాత్రం తగ్గలేదంటూ!

OG Movie: ఓజి సినిమాపై మెగాస్టార్ రివ్యూ… హాలీవుడ్ కు ఏమాత్రం తగ్గలేదంటూ!
Advertisement

OG Movie: పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా సుజీత్(Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఓజి(OG). ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ సెప్టెంబర్ 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు అన్ని చోట్ల ఇదే ఆదరణ రావడంతో భారీ స్థాయిలో కలెక్షన్లను కూడా రాబడుతుంది. ఇక ఈ సినిమాని తాజాగా మెగా కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రసాద్ ల్యాబ్ లో చూసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలైన సమయంలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) విదేశాలలో ఉన్న నేపథ్యంలో సినిమా చూడలేకపోయారు. ఈయన ఇండియా వచ్చిన వెంటనే తన కుటుంబ సభ్యులందరితో కలిసి ఈ సినిమాని వీక్షించారు.

ప్రతి అంశాన్ని ఆస్వాదించాను..

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఓజి సినిమా చూసిన చిరంజీవి ఈ సినిమా పట్ల తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా చిరు ట్వీట్ చేస్తూ.. ఓజీ సినిమాని నా కుటుంబ సభ్యులందరితో కలిసి చూశాను. ఈ సినిమా చూస్తున్న సమయంలో ప్రతి అంశాన్ని కూడా తాను పూర్తిగా ఆస్వాదించానని తెలిపారు. హాలీవుడ్ ప్రమాణాలకు అనుగుణంగా అద్భుతంగా నిర్మించిన అండర్ వరల్డ్ గ్యాంగ్ స్టర్ చిత్రం. ఈ సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు దర్శకుడు సుజిత్ అసాధారణ రీతిలో రూపొందించారు. అందుకు ఆయనకు ప్రత్యేకంగా అభినందనలను తెలియజేశారు.

కళ్యాణ్ బాబును చూస్తుంటే గర్వంగా ఉంది..

Advertisement

ఇక హీరో పవన్ కళ్యాణ్ గురించి కూడా చిరంజీవి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. కళ్యాణ్ బాబును తెరపై ఇలా చూడటం చాలా గర్వంగా అనిపించింది. అతను తన గొప్పతనంతో ఈ సినిమాను మరింత ప్రత్యేకంగా నిలబెట్టాడు. ఈ సినిమా ద్వారా ఆయన అభిమానులకు సరైన విందు భోజనాన్ని అందించాడని పవన్ కళ్యాణ్ పై చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి కూడా ఈ సందర్భంగా చిరంజీవి ప్రస్తావిస్తూ…

Advertisement

తమన్ ఈ సినిమా కోసం ఎంతో మనసుపెట్టి చేశారు. అలాగే డిఓపి రవికే శంకర్ అద్భుతమైన విజువల్స్ అందించారని ఎడిటింగ్ అండ్ ఆర్ట్ వర్క్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. ఈ సినిమా విషయంలో ప్రతి ఒక్కరూ ఎంతో కృషి చేస్తూ అద్భుతమైన సినిమాని అందించారని, నిర్మాత దానయ్య అలాగే ఇతర చిత్ర బృందానికి మెగాస్టార్ అభినందనలు తెలియజేస్తూ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇలా మెగాస్టార్ నుంచి ఓజి సినిమాకు ఈ విధమైనటువంటి స్పందన రావడంతో మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాని పవన్ కళ్యాణ్, చిరంజీవి, రామ్ చరణ్(Ram Charan) తో పాటు వీరి కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి వీక్షించారు. అప్పుడెప్పుడో మగధీర సమయంలో చిరంజీవి రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి సినిమాని చూశారు. మరి ఇన్ని సంవత్సరాలకు ఓజీ సినిమా కోసం ఈ ముగ్గురు స్టార్స్ కలిసి సినిమాని చూడటంతో ఎంతో ప్రత్యేకంగా మారింది. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో సీక్వెల్ సినిమాపై కూడా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

Also Read: I Bomma : పైరసీ సైట్ ఐబొమ్మకు ఇక మూడినట్టే… నలుగురు అరెస్ట్

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×