Intinti Ramayanam Today Episode August 15th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రణతికి చూసిన పెళ్ళికొడుకు మోసగాళ్ళని పార్వతికి తెలిసేలా చేయాలని అవని పార్వతిని పోలీస్ స్టేషన్ రమ్మని అడుగుతుంది. అక్కడికి వచ్చిన పార్వతీ పోలీస్ చెప్పిన విషయంతో షాక్ అవుతుంది. అయితే ఆ అబ్బాయి వాళ్ళ ఇల్లు ఎక్కడో నాకు తెలుసు అని పార్వతి అంటుంది. అవని పార్వతి ఇద్దరూ అక్కడికి వెళ్తారు. మీరు భరత్ తో ప్రణతి పెళ్లి చేయడం ఇష్టపడకపోవచ్చు కానీ ఇలాంటి ఫ్రాడ్లను చేసి ప్రణతి నీ జీవితాన్ని నాశనం చేయొద్దు అని అవని అంటుంది. పార్వతి నిజం తెలుసుకుని షాక్ అవుతుంది. అత్తయ్య ఏదో పని ఉందని బయటికి వెళ్లారు వెంటనే ఆవిడ గుడికి వస్తుంది అని పల్లవి అంటుంది. పల్లవి శ్రేయ భానుమతి ముగ్గురు కలిసి గుడికి వెళ్తారు. భానుమతికి అనుమానం రావడంతో పల్లవి పూజ కోసమే మనం వెళ్తున్నామని అంటుంది.. కమల్ కు నిజం తెలిసిపోతుంది. అవనికి అసలు విషయాన్ని చెప్పేస్తాడు కమల్.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రణతిని అక్షయ్ గుడికి నమ్మించి తీసుకొని వెళ్తాడు.. అక్కడ పల్లవి వాళ్ళు గుడిలో అన్ని సిద్ధం చేసి రెడీ చేస్తారు. పల్లవి భానుమతి శ్రియ గుడికి వచ్చేస్తారు..అక్కడ ఏర్పాట్లను చూసి భానుమతికి అనుమానం వస్తుంది. ఏదో పూజ వ్రతం అని చెప్పావు. ఇక్కడ ఏదో పెళ్లి లాగా ఉంది అని భానుమతి అడుగుతుంది. పంతులుగారు పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నట్లుంది అని భానుమతి అడుగుతుంది. పల్లవి నువ్వు కాసేపు మాట్లాడకు నేనేం చేస్తున్నామో నీకు తర్వాత తెలుస్తుంది అని అంటుంది.పల్లవి ఎన్నిసార్లు ఫోన్ చేసినా పార్వతి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని అంటుంది. పార్వతి ఆటోలో టెన్షన్ గా బయలుదేరుతూ ఉంటుంది.. ఇటు అవని వాళ్ళందరూ కూడా పెళ్లి ఆపడానికి బయలుదేరుతారు..
అక్కడికి పెళ్లి వాళ్ళు వచ్చేస్తారు. అయితే పెళ్లి వాళ్ళని చూసి భానుమతి ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతుంది.. ఇక్కడ ఏం జరుగుతుందని మీరు అందరూ ఇలా చేస్తున్నారు పెళ్లి వాళ్ళు ఎందుకు వచ్చారు పూజని చెప్పావు కదా అని భానుమతి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. ప్రణతికి అసలు విషయం చెప్పలేదు కాబట్టి వీళ్ళు పెళ్లి చేసుకోవడానికి వచ్చారు మీ కోడలే ఈ నిర్ణయం తీసుకునిందని పల్లవి భానుమతితో అంటుంది..
పల్లవికి ఇష్టం లేదని చెప్తుంది కదా మరి ఎందుకు మీరు ఈ పెళ్లి చేస్తున్నారు అని భానుమతి అంటుంది. కాసేపు కామ్ గా కూర్చుంటే ఏం జరగాలి జరుగుతుంది అని పల్లవి అంటుంది.. ఇక అప్పుడే అక్షయ్ ప్రణతిని తీసుకొని గుడికి వస్తాడు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకున్న ప్రణతి నాకు పెళ్లి ఇష్టం లేదు నేను భరత్ ని ప్రేమించాను అని అంటుంది. అక్షయ్ మాత్రం నువ్వు ఆ భరత్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు అమ్మ చెప్పిన వాటితోనే నీకు పెళ్లి జరిపిస్తాను అని అంటాడు..
బలవంతంగా ప్రణతిని పీటల మీద కూర్చోబెట్టి తాళికట్టమని పంతులుని ఫోర్స్ చేస్తాడు అక్షయ్.. అప్పుడే అక్కడికి అవని వాళ్ళు వస్తారు.. అది చూసి అవని ఆగండి అని అంటుంది.. వాళ్ళని చూసి నాకు ప్రణతి ఆ తాళిని విసిరికొట్టి అవని దగ్గరికి వెళుతుంది.. అన్నయ్య నాతో చేపిస్తాను అని గుడికి తీసుకొచ్చి ఇలా పెళ్లి జరిపిస్తున్నారని వదినా అని అంటుంది.. అక్షయ్ ని అవని నిలదీస్తుంది మీరు ఎందుకలా చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందని అంటుంది. నా చెల్లి గురించి ఆలోచించాల్సిన విషయం నాకు ఉంది కాబట్టే ఈ పెళ్లి జరిపిస్తుందని అక్షయ్ అంటాడు.
Also Read: మౌనికకు మాటిచ్చిన మీనా.. మనోజ్ ను మోసం చేసిన రోహిణి..ప్రభావతికి షాక్..
భరత్ ని కేసులో ఇరికించిన వాళ్ళు వచ్చి చెప్పిన కూడా అక్షయ్ వినడు. ఇలాంటి వాళ్లు డబ్బులు కోసం ఏదైనా చేస్తారు ఇది ఒక కొత్త నాటకమని పల్లవి అంటుంది. అవని ఎంత చెప్పినా సరే అక్షయ్ మాత్రం వినడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటివిషన్లో ఏం జరుగుతుందో చూడాలి..