Viral Video: మన ఒంటిపై ఏమైనా ఈగ, దోమ వాలితే వాటిని కొట్టడానికి ప్రయత్నాలు చేస్తాము. లేదంటే ఆ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లిపోతాము. అలాంటిది ఏకంగా బాలిక జడ కొప్పులో ఉడుత గూడు పెట్టింది. చెప్పడానికి విచిత్రంగా ఉన్నా ముమ్మాటికీ నిజం. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
సమయం.. సందర్భం.. ఎక్కడ.. అనేది కాసేపు పక్కన పెడదాం. వీడియో కనిపిస్తున్న బాలిక జడ కొప్పు నుంచి ఉడుత గూడును తొలగించారు ఆమె తండ్రి. అదేంటి జడలో ఉడుత గూడు ఉండడం ఏంటని అనుకుంటున్నారు. కారణాలు ఏమైనా కావచ్చు. కాకపోతే దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అయ్యింది.
12 ఏళ్ల బాలిక జడ కొప్పులో ఓ ఉడుత దాగి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు బాలిక ఎప్పుడు మాదిరిగా స్కూల్‌కు వెళ్లింది. ఇంటికి వచ్చిన తర్వాత జడ నుంచి ఏదో వింత శబ్దం రావడం మొదలైంది. మొదట్లో ఆ బాలిక లైటుగా తీసుకుంది. అది కీటకం లేదా దోమ కావచ్చని భావించింది.
రాత్రి భోజనం చేస్తున్నప్పుడు బాలిక తల నుండి కిచకిచ మంటూ శబ్దాలు రావడం మొదలయ్యాయి. మరుసటి రోజు మళ్లీ స్కూల్‌కి వెళ్లింది. రోజురోజుకూ ఆ జంతువు శబ్దాలు జడ నుంచి పెరగడం మొదలైంది. అనుమానం వచ్చింది.. ఆ బాలికకు భయం పెరగడం మొదలైంది. పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్లింది.
ALSO READ: డెలివరీ బాయ్‌ని చేజ్ చేసిన 10 మంది పోలీసులు
దీంతో ఆమె తండ్రి జడ కొప్పును విప్పి చూడగా అందులో చిన్న ఉడుత కనిపించింది. అది చూసి కుటుంబసభ్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. కూతురి జుట్టును తండ్రి విప్పినప్పుడు ఆశ్చర్యపోయారు. లోపల చిన్న పక్షి మాదిరిగా కనిపించింది. అందులో నుంచి ఉడుతను బయటకు తీశారు. ఈ తతంగాన్ని వీడియో షూట్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
నెటిజన్ల నుంచి మాంచి రెస్పాన్స్ వచ్చింది. చివరకు ఆ వీడియో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. ఇది ప్రకృతి మాయాజాలం అంటూ ఒకరు రాసుకొచ్చారు.
ఆ అమ్మాయి జుట్టు చాలా మందంగా ఉందని, అందుకే పక్షి తన ఇంటిని నిర్మించిందని వ్యాఖ్యానించారు. చాలా మంది యూజర్లు ఆమె జుట్టులో గూడు తనిఖీ చేస్తున్న మీమ్స్‌ను షేర్ చేశారు. ఈ వ్యవహారం ప్రకృతి-జంతువు-మానవుల మధ్య ప్రత్యేకమైన సంబంధాన్ని హైలైట్ చేస్తోందని మరికొందరు రాసుకొచ్చారు. దీన్ని కొంతమంది తేలిగ్గా తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో హైలైట్ కావడం కోసమే ఇదంగా చేశారని అంటున్నావాళ్లూ లేకపోలేదు.
12 ఏళ్ల బాలిక జడ కొప్పులో ఓ ఉడుత దాగి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు బాలిక రోజూలాగే స్కూల్‌కు వెళ్లింది. అయితే ఇంటికి వచ్చిన తర్వాత తన జడ నుంచి ఏదో వింత శబ్దం వస్తోందని కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో ఆమె తండ్రి జడ కొప్పును విప్పి చూడగా అందులో చిన్న ఉడుత… pic.twitter.com/qFcvyptY3D
— ChotaNews App (@ChotaNewsApp) September 30, 2025