BigTV English

I Bomma : పైరసీ సైట్ ఐబొమ్మకు ఇక మూడినట్టే… నలుగురు అరెస్ట్

I Bomma : పైరసీ సైట్ ఐబొమ్మకు ఇక మూడినట్టే… నలుగురు అరెస్ట్

IBomma: సినిమా ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున పైరసీ (Piracy)జరుగుతున్న సంగతి తెలిసిందే. సినిమా థియేటర్లలోకి వచ్చిందే ఆలస్యం వెంటనే పలు వెబ్ సైట్ లలో హెచ్డీ ప్రింట్ అందుబాటులోకి వస్తుంది తద్వారా సినిమా నిర్మాతలకు పెద్ద ఎత్తున నష్టాలు ఏర్పడటమే కాకుండా ప్రభుత్వాలకు కూడా భారీ స్థాయిలో నష్టాలు వస్తున్న నేపథ్యంలో ఈ పైరసీ ముఠాపై హైదరాబాద్ సైబర్ క్రైమ్(Cyber Crime) దృష్టి సారించింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇండియాలోనే అతిపెద్ద పైరసీ ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఇలా పైరసీ ద్వారా మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి వేలకోట్ల రూపాయల నష్టం చేకూరిందని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు.


త్వరలో ఐ బొమ్మ పని పడతాం..

తాజాగా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్(C.V Anand) తో సినీ ప్రముఖులు భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీలో భాగంగా సీపీ ఆనంద్ మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారిగా భారీ ఎత్తున పైరసీ ముఠాను అరెస్టు చేశామని తెలిపారు. త్వరలోనే ఓటీటీ పైరసీ కంటెంట్ సైట్ అయిన ఐ బొమ్మ(IBomma) హెడ్ పట్టుకుంటామని, ఇప్పటికే దీనికి సంబంధించి నలుగురును అదుపులోకి తీసుకున్నాము అంటూ ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ పోలీసులు ఐ బొమ్మకు తమదైన శైలిలోనే మార్నింగ్ ఇవ్వడమే కాకుండా ఐ బొమ్మ పై పూర్తి స్థాయిలో దృష్టి సారించారని వెల్లడించారు.

సైబర్ క్రైమ్ పోలీసులతో సినీ పెద్దల భేటీ..

ఇక ఈ విషయంలో భాగంగా పలువురు సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు సైబర్ క్రైమ్ పోలీస్ ఆనంద్ గారితో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని కూడా ఈయన అధికారికంగా సోషల్ మీడియా వేదికగా తెలియచేశారు. తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన హీరోలు, నిర్మాతలు, దర్శకులు, డిజిటల్ మూవీల కంపెనీ ప్రతినిధులను సినిమా పైరసీ గ్యాంగుల అరెస్టు చేసిన విషయం మరియు పైరసీ జరుగుతున్న తీరును వివరించడానికి వీరందరిని ఒక సమావేశానికి ఆహ్వానించి ప్రజెంటేషన్ ద్వారా అన్ని వివరాలను తెలియజేశాము.


ఒక సినిమా థియేటర్లో విడుదలకు ముందే హెచ్డి ప్రింట్ ఎలా బయటకు వస్తోందనే విషయాన్ని తెలుసుకొని వారందరూ ఆశ్చర్యపోయారని తెలిపారు. భవిష్యత్తులో వారందరూ ఏ విధమైనటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమని ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఈ పైరసీ అనేది బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులే హ్యాకర్లకు, ఫైటర్లకు డబ్బులు చెల్లిస్తున్నారనే విషయం సినిమా సెలబ్రిటీలకు ఇప్పటివరకు తెలియదని ఆనంద్ పేర్కొన్నారు. డిజిటల్ మీడియా కంపెనీలు తమ సైబర్ సెక్యూరిటీ ఎంత తక్కువగా ఉందో గ్రహించి సర్వర్ల రక్షణ కోసం మరింత వ్యయం ఖర్చు చేస్తాయని హామీ ఇచ్చారు. ఇక ఈ భేటీలో భాగంగా వెంకటేష్ నాగార్జున, చిరంజీవి, దిల్ రాజు, నాని, రామ్ పోతినేని వంటి తదితరులు పాల్గొన్నారు. ఏది ఏమైనా పైరసీ విషయంలో సైబర్ క్రైమ్ పోలీసులు చాలా సీరియస్ గా ఉండటమే కాకుండా ప్రత్యేకంగా ఐబొమ్మపై దృష్టి సారిస్తామనే విషయాన్ని తెలియజేయడంతో త్వరలోనే ఐ బొమ్మకు కూడా భారీగా మూడినట్టు ఉందని స్పష్టం అవుతుంది.

Related News

OG 2 shooting: ఓజీ 2 షూటింగ్ పై బిగ్ అప్డేట్… పండగ చేసుకుంటున్న పవన్ ఫ్యాన్స్!

OG Movie: ఓజి సినిమాపై మెగాస్టార్ రివ్యూ… హాలీవుడ్ కు ఏమాత్రం తగ్గలేదంటూ!

Tollywood : ఇండస్ట్రీ బాగు కోసం… టాలీవుడ్ పిల్లర్ బాలకృష్ణ ఎక్కడా ?

Shukracharyudu in Mahakali : ప్రశాంత్ యూనివర్స్‌లో శుక్రచార్యడు… పురాణాల్లో ఈయన పాత్ర ఏంటో తెలుసా ?

The Raja Saab Trailer : ట్రైలర్ రాకపోయి ఉంటే బాగుండు

Nani Sujeeth : దసరాకు నాని – సుజీత్ మూవీ.. అప్పుడే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్

SSMB 29: టార్గెట్ ఫిక్స్ చేసిన జక్కన్న.. అయోమయంలో మహేష్!

Big Stories

×