Natural Honey: తేనె అనేది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సహజ ఆహారం. చిన్న పిల్లల నుండి పెద్దవారికి ప్రతి ఇంటిలో ఇది వాడే ఒక ముఖ్యమైన పదార్థం. తేనె రుచికే కాదు, ఎన్నో ఆరోగ్య గుణాలు కూడా కలిగి ఉంటుంది. కానీ మార్కెట్లో అందుబాటులో ఉన్న తేనెలో ప్రతిదీ నిజమైనదా లేదా అనేది చాలా మంది నిర్ధారించుకోరు. నకిలీ తేనె ఎక్కువగా ఉండటం వల్ల, మనం తీసుకుంటున్నది నిజమైనదేనా అని తెలుసుకోవడం అవసరం. మనం కొన్న తేనె నిజంగా స్వచ్ఛమా, నకిలీదా అనేది ఇంట్లోనే కొన్ని సులభమైన పరీక్షలతో తెలుసుకోవచ్చు.
ఇలా చేయండి!
ఒక సులభమైన పరీక్ష కోసం ఒక గ్లాసు నీటిని తీసుకోండి. దానిలో కొంచెం తేనె వేసి గమనించండి. నిజమైన తేనె అయితే అది నీటిలో కరిగిపోకుండా కిందకు జారి ముద్దలా స్థిరపడుతుంది. కానీ నకిలీ తేనె అయితే కొద్దికాలంలోనే అది నీటిలో కలవటం మొదలుపెడుతుంది. ఇది ఒక ముఖ్యమైన సూచన.
మరొక ఐడియా
మరొక మార్గం కాలక్రమంలో తేనె మార్పును గమనించడం. స్వచ్ఛమైన తేనె కొన్ని రోజులు గడిచాక తేమ తగ్గి, బరకగా మారి స్పటికాకారమైన రూపం తీసుకుంటుంది. ఇది సహజ ప్రక్రియ. కానీ కల్తీ తేనె నెలల తరవాత కూడా ద్రవరూపంలోనే ఉంటుంది, అంటే దాని లోపలి తేమ తగ్గదు.
Also Read: Hostels History: హాస్టల్ అనే పదం ఎవరు కనిపెట్టారు? లేడీస్, బాయ్స్ హాస్టల్స్ ఎందుకు వేరు చేశారు?
ఇలాకూడా చేయొచ్చు..
తేనె నిజమా అని తెలుసుకోవడానికి వెనిగర్ పరీక్ష కూడా ఉపయోగపడుతుంది. కొద్దిగా వెనిగర్‌లో తేనె కలిపితే, నిజమైన తేనెలో ఎటువంటి నురుగు రాదు, కానీ నకిలీ తేనెలో నురుగు ఏర్పడుతుంది. ఇది మరో గుర్తింపు మార్గం.
ఏమిటి అగ్గిపుల్లతోనా- అది ఎలా?
ఇంకో సరళమైన పరీక్ష అగ్గిపులతో చేయవచ్చు. ఒక చిన్న కాటన్ వత్తిని తేనెలో ముంచి తీసుకుని అగ్గిపుల దగ్గర పెట్టండి. నిజమైన తేనె ఉంటే ఆ వత్తి సులభంగా వెలుగుతుంది. నకిలీ తేనె అయితే తేమ ఎక్కువగా ఉండటం వల్ల వత్తి వెలగదు.
ఈ విధంగా, మనం ఇంట్లోనే ఈ పరీక్షల ద్వారా తేనె నిజమా, నకిలీదా అని తేల్చుకోవచ్చు. సరైన తేనె మాత్రమే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అందుకే కొన్న వెంటనే ఈ పరీక్షలు చేసి, మన కుటుంబానికి ఉపయోగపడే స్వచ్ఛమైన తేనె వాడటం అలవాటు చేసుకోవడం ముఖ్యం.