BigTV English

Tollywood : ఇండస్ట్రీ బాగు కోసం… టాలీవుడ్ పిల్లర్ బాలకృష్ణ ఎక్కడా ?

Tollywood : ఇండస్ట్రీ బాగు కోసం… టాలీవుడ్ పిల్లర్ బాలకృష్ణ ఎక్కడా ?

Tollywood : తెలుగు చిత్ర సీమ పెద్ద ఎవరు అంటే నలుగురు పేర్లు చెబుతారు. వాళ్లే చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్. ఇండస్ట్రీలో ఎలాంటి కష్టం వచ్చినా… ముందు నిలబడేది వీళ్లే. అందుకే వాళ్లను సినిమా ఇండస్ట్రీ అనే భవనానికి నాలుగు పిల్లర్లు అని అంటారు. ఈ పిల్లర్లే లేకపోతే… ఇండస్ట్రీనే లేదు. అయితే ఆ పిల్లర్ల నుంచి ఒక పిల్లర్ తప్పుకుందా..? ఆ పిల్లర్ సైలెంట్ అయిపోయిందా ? ఆ పిల్లర్‌ ఇప్పుడు ఇండస్ట్రీని పట్టించుకోవడం లేదా ? అనే మాటలు నిన్నటి నుంచి తెగ వినిపిస్తున్నాయి.


ఇంతకి ఆ ఒక్క పిల్లర్ ఎవరంటే… నందమూరి బాలకృష్ణ. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకంటే…

నిన్న (సోమవారం) హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆనంద్‌ను టాలీవుడ్ పెద్దలతో పాటు హీరోలు, నిర్మాతలు కలిశారు. ఎందుకంటే… నిన్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ వాళ్లు పైరసీ మూఠాను అరెస్ట్ చేశారు. దాదాపు 2 కోట్లు ఖర్చు పెట్టి… ఆ మూఠాలో కీలకంగా ఉన్న 5గురు సభ్యులను పట్టుకున్నారు. దీంతో పాటు చాలా హార్డ్ డిస్క్‌లు ఫైరసీ చేసే పరికరాలు.. ఇంకా చాలా స్వాధీనం చేసుకున్నారు.


ప్రతి సారి పైరసీ భూతానికి బలైవుతున్న ఇండస్ట్రీకి ఇది శుభవార్త. కాబట్టి… పైరసీ మూఠాను అరెస్ట్ చేసిన సీపీ ఆనంద్‌ను కలిసి అభినందించిన సినీ ప్రముఖులు అందరూ వెళ్లారు.

బాలయ్య ఎక్కడా ?

సీపీ ఆనంద్ దగ్గరకు వెళ్లిన వాళ్లలో మెగాస్టార్ చిరంజీవ, కింగ్ నాగార్జున, దగ్గుబాటి వెంకటేష్‌తో పాటు నాని లాంటి హీరోలు, దిల్ రాజు లాంటి కొంతమంది నిర్మాతలు కూడా ఉన్నారు. అయితే ఇండస్ట్రీ పెద్ద… ఇండస్ట్రీ పెద్ద కుటుంబం… ఇండస్ట్రీకి పిల్లర్ అని చెప్పుకునే బాలయ్య మాత్రం ఆ మీటింగ్‌లో కనిపించలేదు.

సీపీ ఆనంద్ దగ్గరకు వెళ్తున్నట్టు సినీ ప్రముఖుల నుంచి బాలయ్యకు సమాచారం ఇచ్చారట. అయినా.. బాలయ్య రాకపోవడంతో ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఉద్దేశపూర్వంగానే బాలయ్య ఈ మీటింగ్‌కు రాలేదా ? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

మెగా vs నందమూరి…

ప్రస్తుతం ఇటు సినిమా పరంగా, రాజకీయ పరంగా మెగా vs నందమూరి ఎపిసోడ్ నడుస్తుంది. అంతే కాదు.. గత రెండు రోజుల నుంచి బాగా ముదిరిపోయింది. ఏపీ అసెంబ్లీలో చిరంజీవిని అవమానిస్తూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు భగ్గుమన్నాయి. మెగా అభిమానులు అయితే, వరుసగా ఆందోళన చేస్తున్నారు. నిన్న బాలయ్యపై 300 పోలీస్ స్టేషన్స్‌లో ఫిర్యాదు చేయడానికి అఖిల భారత చిరంజీవి యువత రెడీ అయిపోయింది. తర్వాత చిరు రంగంలోకి దిగి… సర్దిచెప్పాడు.

ఇలాంటి టైంలో… బాలయ్య వచ్చి… చిరంజీవితో క్లోజ్‌గా ఉంటే మెగా vs నందమూరి ఎపిసోడ్ కూల్ అయిపోయింది. కానీ, సోమవారం మీటింగ్‌కు రాకపోవడంతో మెగా vs నందమూరి అనేది మరింత బలపడింది.

చిరంజీవి ఉన్నాడు కాబట్టే, బాలయ్య ఆ మీటింగ్ రాలేదు అని ఇండస్ట్రీ జనాలు అనుకుంటున్నారు.

ఇండస్ట్రీ పిల్లర్ పరిస్థితేంటి ?

నందమూరి బాలకృష్ణ తెలుగు ఇండస్ట్రీకి పిల్లర్ అని అంటారు. కానీ, ఈ మధ్య బాలకృష్ణ నుంచి అలాంటిదేమీ కనిపించడం లేదు. సినీ కార్మికుల సమ్మె టైంలో కూడా కార్మికులు బాలయ్య దగ్గరకు వెళ్లారే తప్పా…. తర్వాత సమ్మె పరిష్కారినికి బాలయ్య చేసిందేమీ లేదు అనే మాటలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి.

చిరంజీవి చాలా విషయాల్లో, చాలా సమస్యలను చోరవ తీసుకుని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక వెంకటేష్, నాగార్జున కూడా తమ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, బాలయ్య నుంచి ఇండస్ట్రీ బాగు కోసం ఏదీ కనిపించడం లేదు అని అంటున్నారు.

నిన్న (సోమవారం) మీటింగ్‌కు వస్తే.. మెగా vs నందమూరి అనే వార్‌కి ఓ పులిస్టాప్ దొరికేది. అలాగే ఇండస్ట్రీ పిల్లర్ అనే పదానికి అర్థం ఉండేది అని ఇండస్ట్రీ జనాలు కూడా అంటున్నారు.

ఇప్పుడు వీటి అన్నింటికి నందమూరి బాలకృష్ణ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి బాలయ్య నుంచి ఆన్సర్ వస్తుందంటారా ?

Related News

OG 2 shooting: ఓజీ 2 షూటింగ్ పై బిగ్ అప్డేట్… పండగ చేసుకుంటున్న పవన్ ఫ్యాన్స్!

OG Movie: ఓజి సినిమాపై మెగాస్టార్ రివ్యూ… హాలీవుడ్ కు ఏమాత్రం తగ్గలేదంటూ!

I Bomma : పైరసీ సైట్ ఐబొమ్మకు ఇక మూడినట్టే… నలుగురు అరెస్ట్

Shukracharyudu in Mahakali : ప్రశాంత్ యూనివర్స్‌లో శుక్రచార్యడు… పురాణాల్లో ఈయన పాత్ర ఏంటో తెలుసా ?

The Raja Saab Trailer : ట్రైలర్ రాకపోయి ఉంటే బాగుండు

Nani Sujeeth : దసరాకు నాని – సుజీత్ మూవీ.. అప్పుడే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్

SSMB 29: టార్గెట్ ఫిక్స్ చేసిన జక్కన్న.. అయోమయంలో మహేష్!

Big Stories

×