BigTV English

Viral News: అమ్మ చనిపోయిందంటూ లీవ్ అడిగిన ఉద్యోగి.. బాస్ రిప్లైతో ఒక్కసారిగా షాక్!

Viral News: అమ్మ చనిపోయిందంటూ లీవ్ అడిగిన ఉద్యోగి.. బాస్ రిప్లైతో ఒక్కసారిగా షాక్!

UCO Bank Viral News:

ఆయా సంస్థలు ఉద్యోగాఉలకు సెలవులు ఇవ్వడంలో కాస్త కఠినంగానే ఉంటాయి. కానీ, అత్యవసర పరిస్థితులలో కచ్చితంగా సెలవులు మంజూరు చేస్తాయి. అయితే, తాజాగా యూకో బ్యాంకు సీనియర్ ఆఫీసర్ తన కింద పని చేసే ఉద్యోగి సెలవు విషయంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహానికి కారణం అవుతున్నాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు సదరు అధికారి మీద నిప్పులు చెరుగుతున్నారు. ఛీ.. ఇలాంటి దుర్మార్గమైన బాస్ లు ఉంటారా? అని ఫైర్ అవుతున్నారు.


ఇంతకీ అసలు ఏమైందంటే?   

యూకో బ్యాంక్ కు చెందిన ఓ సీనియర్ అధికారికి తన కింది ఉద్యోగులకు సెలవు విషయంలో తీవ్రంగా సతాయిస్తున్నట్లు విమర్శలు వచ్చాయి. తాజాగా ఓ ఉద్యోగి చెన్నై జోనల్ చీఫ్ అయిన అజిత్ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. తనకింద పని చేసే వారిని అత్యంత నీచంగా చూస్తున్నాడని మండిపడ్డారు. తప్పనిసరి పరిస్థితుల్లో సెలవులు అడిగినప్పటికీ సెలవులు ఇచ్చేందుకు తెగ సతాయిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు.

అందరి తల్లులు చనిపోతారు.. డ్రామా చేయకు!

ఇక ఓ బ్రాంచ్ చీఫ్ తన తల్లి ఐసీయూలో ఉండగా సెలవు ఇచ్చేందుకు ఇదే జోనల్ హెచ్ పెద్ద షో చేశాడని సదరు ఉద్యోగి ఆరోపించారు. సెలవు ఇవ్వడానికి ముందే ఎప్పుడు వస్తావో చెప్పాలన్నట్లు మండిపడ్డారు. మరికొద్ది రోజుల తర్వాత సదరు బ్యాంక్ చీఫ్ తల్లి చనిపోగా, ఏమాత్రం మానవత్వం లేకుండా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. “అందరి తల్లులు చనిపోతారు. డ్రామా చేయకు. ప్రాక్టికల్ గా ఉండాలి. వెంటనే వచ్చి డ్యూటీలో జాయిన్ కావాలి. లేదంటే సాలరీ కట్ చేస్తాను” అని సదరు జోనల్ హెడ్ హెచ్చరించినట్లు సదరు ఉద్యోగి ఆరోపించారు. అంతేకాదు, ఓ బ్రాంచ్ హెడ్ తన ఏడాది వయసున్న కూతురు ఆస్పత్రిలో చేరినప్పుడు, ఒక అధికారి భార్యకు అత్యవసర సంరక్షణ అవసరమైనప్పుడు కూడా లీవ్ ఇచ్చేందుకు సదరు జోనల్ హెడ్ దారుణంగా వ్యవహరించాడని వివరించారు.


Read Also:  ప్రియుడితో భార్య సరసాలు.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త.. ఇదిగో వీడియో!

నిప్పులు చెరుగుతున్న నెటిజన్లు

యూకో బ్యాంక్ జోనల్ హెడ్ మీద ఉద్యోగులు చేసిన ఆరోపణలు సంబంధించిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. వీటిని చదివి నెటిజన్లు నిప్పుడు చెరుగుతున్నారు. “అత్యవసర విషయాల్లో కూడా లీవ్ ఇవ్వకుండా మానవత్వం లేని వ్యక్తిగా వ్యవహరిస్తున్న సదరు వ్యక్తిని వెంటనే ఆ పోస్టు నుంచి తొలగించాలి” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.  “మానవత్వం లేని క్రమశిక్షణ పతనానికి కారణం అవుతుంది. అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా సెలవులను మార్చుకోవచ్చు” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు.

Read Also:  ఓర్నీ దుంపతెగ.. ఏంటీ ఇలాంటి సమోసా ఒకటి ఉందా? రుచి చూస్తే అస్సలు వదలరండోయ్!

Related News

Viral Video: 12 ఏళ్ల బాలిక జడ కొప్పులో ఉడుత గూడు, వీడియో వైరల్

Viral Video: డెలివరీ బాయ్ ను చేజ్ చేసిన 10 మంది పోలీసులు.. అసలు ఏమైందంటే?

Viral Video: గర్బా ఈవెంట్ లో ముద్దులు.. క్షమాపణ చెప్పి దేశం విడిచి వెళ్లిపోయిన జంట!

Viral News: ఐఫోన్ కోసం.. ఇన్ స్టాలో క్యూఆర్ కోడ్ పెట్టి మరి అడుక్కుంటున్న అమ్మాయి?

Dry fruit Samosa: ఓర్నీ దుంపతెగ.. ఏంటీ ఇలాంటి సమోసా ఒకటి ఉందా? రుచి చూస్తే అస్సలు వదలరండోయ్!

Google 27th Anniversary: గూగుల్ 27వ వార్షికోత్సవం.. తొలినాటి డూడుల్ తో సెర్చ్ ఇంజిన్ సర్ ప్రైజ్

Viral Video: ప్రియుడితో భార్య సరసాలు.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త.. ఇదిగో వీడియో!

Big Stories

×