Gadwal Road Incident: ఘోర రోడ్డు ప్రమాదం.. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం ఇటిక్యాలపాడు దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి బృందంతో వెళ్తున్న ఒక డీసీఎం వాహానం అక్కడే ఎదురుగా ఉన్న వాహానాన్ని తప్పించబోయి అదుపు తప్పి బోల్తా పడింది. ఆ వాహనంలో 100 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు.. అందులో 15 మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి. మరో 50 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. అక్కడి స్థానికులు వెంటనే 108కి సమాచారం అందించగా వెంటనే అంబులెన్స్ వారు స్పందించి సకాలంలో వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వాహనాన్ని తప్పించబోయి బోల్త పడిన డీసీఎం..
ఈ డీసీఎం వాహనం గద్వాల జిల్లా ఇటిక్యాలపాడు గ్రామం నుంచి ప్రారంభమై, పెళ్లి వేడుకలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. వాహనంలో పండితులు, బంధువులు, పిల్లలు సహా మొత్తం 100 మంది ప్రయాణిస్తున్నారు. ఇటిక్యాలపాడు దగ్గర రాష్ట్ర రహదారిపై డ్రైవర్ అతి వేగంతో వెళ్తూ.. అక్కడే ఎదురుగా వెళ్లున్న వాహానాన్ని తప్పించబోయి ఒక మలుపు వైపు అదుపు తప్పాడు. దీంతో వాహనం రోడ్డు పక్కనుంచి దూరంగా బోల్తా పడింది. వాహనం మొత్తం తుక్కుతుక్క అయిపోయింది.
Also Read: బంగాళాఖాతంలో అల్పపీడనం..? వర్షాలు దసరా వరకు దంచుడే.. దంచుడు.
గాయపడిన వారిలో ఎక్కువగా పిల్లలు.. మహిళలు..
అయితే ఈ ఘటన ఇటిక్యాలపాడు గ్రామం నుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో జరిగింది. ఈ ప్రమాదంలో పిల్లలు, మహిళలు ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుతం 12 మంది వెంటిలేటర్ పై ఉన్నారు.. మిగిలినవార ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.