E-Paper
Advertisement

3 Killed in Palnadu Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. అదుపు తప్పి చెట్టును ఢీకొట్టిన కారు.. ముగ్గురు స్పాట్ డెడ్

3 Killed in Palnadu Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. అదుపు తప్పి చెట్టును ఢీకొట్టిన కారు.. ముగ్గురు స్పాట్ డెడ్
Advertisement

3 Killed in Palnadu Road Accident: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్‌తోపాటు మరో ఇద్దరు మృతి చెందగా..నలుగురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా, మృతులు గుంటూరు ప్రాంతానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు.

గుంటూరు ప్రాంతానికి చెందిన ఓ కుటుంబ సభ్యులు రాష్ట్రంలోని వివిధ పుణ్య క్షేత్రాలను సందర్శించుకున్నారు. అనంతరం తిరిగి సొంత గ్రామానికి వెళ్తుండగా గురువారం ఉదయం వినుకొండ నియోజకవర్గం శివాపురం, కొత్తపాలెం రహదారి ప్రాంతంలో వీళ్లు ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు అదుపు అప్పు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గుంటూరు జిల్లాలోని లక్ష్మీపురానికి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం విశ్రాంత ఉద్యోగి అయిన సోమసి బాలగంగాధర్ శర్మ(78), యశోద(67)తోపాటు కారు డ్రైవర్ మృతి చెందాడు.

Advertisement

ఈ ప్రమాదంలో బాలగంగాధర్ శర్మ కుమారుడు హెచ్ ఎస్ వై శర్మ, నాగసంధ్య దంపతులతోపాటు పిల్లలు కార్తీక్, అనుపమలు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో శర్మ, అనుపమల పరిస్థితి విషమంగా ఉందని వినుకొండ పట్టణ సీఐ సాంబశివరావు తెలిపారు. వీరంతా పుణ్యక్షేత్రాల పర్యటనకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కర్ణాటకలోని బళ్లారి నుంచి గుంటూరుకు తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

Also Read: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన.. ఈ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు

Advertisement

మౄతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఇటీవల రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×